జలుబుకి గృహవైద్యపు చిట్కాలు

 
 

ఇప్పుడు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో శీతాకాలం, ఈ కాలంలో మనలో చాలా మందికి జలుబు చేస్తుంటుంది. జలుబు సాధారణంగా కనీసం 7రోజులు ఉంటుంది అంటారు అందుకని మేము మీకు ఈశా ఆరోగ్య నుంచి కొన్ని గృహవైద్యపు చిట్కాలు అందిస్తున్నాము. 


తులసి మరియు మిరియాలు

ఒక గుప్పెడు తులసి ఆకులను(హోలీ బేసిల్) & 10 మిరయలు (మిలగు). ఈ రెంటినీ కలిపి నూరండి దీన్ని రోజుకు మూడు సార్లు తినండి. ఇది దగ్గు మరియు జలుబు నుంచి ఉపశమనం ఇస్తుంది.

 వాము ఆకు మరియు మిరియాలు

7 వాము ఆకులు (అనిసోచిలుస్ కార్నోసుస్) మరియు 10 మిరియాలు. రెంటినీ కలిపి నూరి రోజుకి మూడు సార్లు తినండి. ఇది దగ్గు మరియు జలుబు నుంచి ఉపశమనం ఇస్తుంది.

 అల్లపు కషాయము

4 చెంచాలు అల్లము రసము + 4 చెంచాలు తేన + 2 చెంచాలు నిమ్మ రసము + ౩/4 కప్పు నీళ్ళు – కలిపి త్రాగండి. ఇది దగ్గు, జలుబు, ఆస్తమా మరియు అజీర్తికి సంబందించిన సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1