మహాశివరాత్రి ఉత్సవాలు 2018

 

మహాశివరాత్రి అనేక అధ్యాత్మిక అవకాశాలు అందించే రాత్రి. మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజు, అమవాస్య ముందురోజు  శివరాత్రి. ఈ రాత్రి అధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాథనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే ఈ పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో (ఫిబ్రవరి- మార్చ్) వచ్చే శివరాత్రి, మహాశివరాత్రి అంటారు ఎందుకంటే అది అన్నింటిలో మహత్తరమైనది, శక్తి వంతమైనది. ఈ రోజు ప్రకృతినుంచి సహజంగా ఎంతో సహాయం లభిస్తుంది. సాథకుడు తనలోని అధ్యాత్మికతను మేలుకొలపడానికి, శక్తిని ప్రేరేపింప చేయడానికీ ఆ రోజు గ్రహస్థానాలు అనుకూలంగా ఉంటాయి. ఇలా తెల్లవార్లూ మేల్కొని వెన్నెముక నిటారుగా నిలపటం, మీలోని సహజ శక్తులు ఉప్పొంగటానికి ఎంతో దోహదపడుతుంది. ఈ దేశంలో సనాతనంగా ఋషులు, మనులు  ఈ శక్తి ఉప్పొంగడం వల్ల వచ్చే ఆసరాతో తమ సర్వోత్తమస్థితికి చేరుకునేవారు.

శివుడి రాత్రి అయిన ఈ మహాశివరాత్రి ఇక్కడ ఎంతో ఆనందోత్సాహాలతో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలనుంచి, ఇంకా దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి విచ్చేసారు. ఇక్కడ ముఖ్య ఆకర్షణలు

    • శంభో, ఓం నమః శివాయ మంత్రోచ్చారణలు.
    • సద్గురు తో సత్సంగం. 
    • దలేర్ మెహేంది, సోనూ నిగం ఇంకా మొహిత్ చౌహాన్ పాడిన పాటలు
    • విలాస్ నాయక స్పీడ్ పెయింటింగ్
    • వేణుగోపాల్ రావు సాండ్ ఆర్ట్

అంగరంగ వైభవంగా జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలను ఇక్కడ చూడవచ్చు: ఈశా మహాశివరాత్రి ఉత్సవాలు 2018

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1