గోధుమ కాఫీ
 
 

కావాల్సిన పదార్థాలు:

గోధుమ  -          500 గ్రా. (తొక్క-తీసిన గింజలు)

కొత్తిమీర  -          50 గ్రా.

బెల్లంకోరు  -    తగినంత

చేసే విధానం :

- బాణలిలో గోధుమలు దోరగా కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. అది పొడి చేసుకోవాలి. వేయించినప్పుడు మాడకుండా పగలకుండా దోరగా (ఎర్రగా కూడా) వేయించుకోవాలి. ఆ తరువాత పొడిచేసి వుంచుకోవాలి.

- పాలు లేక నీరు మరిగించి, పైన తయారు చేసిన పొడి రెండు టీస్పూనులు చక్కెర వేసి కలుపుకుని తాగాలి. ఇది రుచికి కాఫీలాగే ఉంటుంది. కాఫీ కంటే ఇది మంచిది. శరీరానికి ఇది ఆరోగ్యం. రక్తపోటు రాకుండా కాపాడుతుంది.

- రాగి, గోధుమ, జొన్నలు మూడూ కలుపుకోవాలి. అది మొత్తం 500 గ్రాములు వుండాలి. ఈ విధంగా చేస్తే కూడా చాలా బాగుటుంది.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1