మర్మజ్ఞుడితో ఒక సాయంత్రం – 4000 మెడిటేటర్ల సభ, హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ లో ఆధ్యాత్మిక సాధకుల అతిపెద్ద సమావేశం
ఈశా ఫౌండేషన్ ఒక ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది – ‘మర్మజ్ఞుడితో ఒక సాయంత్రం’ అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ (2 జనవరి) , తిరుపతి (4 జనవరి), విశాకపట్నం(5 జనవరి)లో నిర్వహించనుంది. హైదరాబాద్ లో  ఈ కార్యక్రమం జేఆర్సి కన్వెన్షన్ హాల్, ఫిలిం నగర్, విష్పర్ వాలీ దగ్గర, జూబ్లీ హిల్స్ లో సాయంత్రం 4pm నుంచి 8pm వరకూ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిపెద్ద సంఖ్యలో 4000 మెడిటేటర్లు రానున్నారు.
 
తిరుపతిలో ఈ కార్యక్రమం శ్రీ విద్యానికేతన్ ఇంటర్ నేషనల్ స్కూల్లో జనవరి 4న సాయంత్రం 6pm నుంచి 8pm వరకూ జరుగుతుంది. దీనికి ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే.
 
విశాకపట్నంలో ఈ కార్యక్రమం పోర్ట్ స్టేడియంలో జనవరి 5న సాయంత్రం 6.30pm నుంచి 8.30pm వరకూ జరుగుతుంది.
 
ఈ కార్యక్రమాన్ని సద్గురు ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. “మర్మజ్ఞుడితో ఒక సాయంత్రం” – ఇది జీవితంలోని మార్మిక అంశాల అన్వేషణగా సాగుతుంది. గైడెడ్ మెడిటేషన్స, సౌండ్స్ ఆఫ్ ఈశా వారి ఉల్లాసమైన సంగీతంతో మనోరంజకంగా/రమణీయంగా సాగే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం జీవితం అతిశయంగా సాగాలనుకునేవారికి, స్పష్టత కోరుకునేవారి ఎడారిలో దాహం తీర్చే ఒక నీటి కొలను అవుతుంది.
  
ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో అంతర్దృష్టి ఉన్న ప్రసంగాలు, ధ్యానం, ప్రశ్నోత్తరాలు, అలాగే సద్గురు రూపొందించిన పద్ధతులకు పరిచయం లభిస్తుంది.
సృష్టి గురించి ప్రగాఢమైన విషయాలు, అంతర్దృష్టితో ఆవల ఏముందో తెలుసుకోవడానికై సద్గురుతో కలిసి ఈ సాయంత్రం గడపడానికి మిమల్ని ఆహ్వనిస్తున్నాము.
 
“ అందరూ వారిలోని దివ్యత్వాన్ని అనుభూతి చెంది, అభివ్యక్తపర్చుకునేలా చేయటమే నా జీవితం ముఖ్య ఉద్దేశం. మీరు ఈ దివ్య ఆనందాన్ని తెలుసుకోవాలి” అని అంటారు.
 
మరిన్ని వివరాలకు, కార్యక్రమంలో పాల్గొనటానికి ఫోన్ ద్వారా 7702638557 నెంబర్లో సంప్రదించవచ్చు.
ఈమైల్:   hyderabad@ishayoga.org
 వెబ్ సైట్ : www.isha.sadhuguru.org/yoga-classes/hyderabad