ఎనర్జీ మాల్ట్‌

ఇది వంటికి చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని,మంచి శక్తినిస్తుంది.
 
ఎనర్జీ మాల్ట్‌
 

కావాల్సిన పదార్థాలు

వేయించిన శనగపప్పు లేదా పుట్నాలు           -          100 గ్రా

మినుములు         -          100 గ్రా.

గోధుమ  -          200 గ్రా.

చక్కెర పొడి         -          100 గ్రా.

పాలపొడి            -          100 గ్రా.

చోళ్ళు    -          100 గ్రా.

కేపై       -          200 గ్రా.

ఏలక్కాయ          -          2 లేక 3

జీడిపప్పు            -          50 గ్రా.

చేసే విధానం :

మినుములు, గోధుమలు, చోళ్ళు, కేపై నాలుగు సన్నని మంటమీద మంచి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి. ఈ నాలుగింటితో పుట్నాలు, ఏలకుల పొడి, పాల పౌడర్‌, చక్కెర, జీడిపప్పు, కలిపి మిక్సీలో పట్టుకోవాలి. ఆ పొడి ఒక డబ్బాలో పెట్టుకోవాలి.

-మరిగిన, నీటిలో కాని, పాలలో కాని ఈ పొడి కలుపుకుని తాగాలి.

- ఇది వంటికి చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని,మంచి శక్తినిస్తుంది.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1