కావాల్సిన పదార్థాలు


దంపుడు బియ్యం    -    సగం కప్పు
పాలు     -    1 కప్పు
చక్కెర    -    తగినంత
కొబ్బరి పాలు    -    సగం కప్పు
ఏలకులపొడి    -     2 చిటికెలు
జీడిపప్పు    -     10
కిస్మిస్    -    5

చేసే విధానం 


బియ్యం రాత్రి మొత్తం నానపెట్టాలి. ఉదయం 3 కప్పుల-నీరు పోసి కుక్కర్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తరువాత ఆరపెట్టి మిక్సీలో - గరుకుగా - వెయ్యాలి.  - ఒక బాణలిలో నూరిన ముద్ద, పాలు, కొబ్బరి-పాలు చక్కెర వేసుకొని మధ్యమధ్యలు కలుపుకోవాలి.నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఏలకు పొడితోపాటు బాణలిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది తాగటానికి రెడీ.