చనా ఛాట్ డిలైట్
శనగలు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉప్పువేసి ఉడకపెట్టాలి.
ArticleDec 29, 2016
కావాల్సిన పదార్థాలు :
టమేటాలు - 1 కప్పు (చిన్న ముక్కలు చేసుకోవాలి)
క్యాప్సికమ్ - 1 కప్పు (చిన్న ముక్కలు చేసుకోవాలి)
కాబేజి - 1 కప్పు (చిన్న ముక్కలు చేసుకోవాలి)
శనగలు - 1 కప్పు
ఉప్పు - తగినంత
నిమ్మరసం - 2 టేబుల్ స్పూనులు
ఛాట్ మసాల - 2 టీస్పూనులు
కీరా దోసకాయ - 1 కప్పు
చేసే విధానం :
శనగలు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉప్పువేసి ఉడకపెట్టాలి. టమేటా, కీర, క్యాప్సికమ్, కాబేజి కలిపి ఉప్పు, నిమ్మరసం, ఛాట్మసాల వేసి అందరికీ వడ్డించాలి.