కావాల్సిన పదార్థాలు:

బీట్రూట్‌           -          75 గ్రా.

క్యారెట్‌   -          75 గ్రా.

క్యాబేజి   -          75 గ్రా.

కందిపప్పు (ఉడికించినది) -          1 కప్పు

ఎండుమిర్చి         -          2

చేసే విధానం:

కూరలు చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని ఎండుమిర్చి, ఉడికించిన పప్పుకు ఒకటిన్నర గ్లాసు నీళ్లు కలిపి కుక్కర్లో పెట్టి ఒక విజిల్రానివ్వాలి. కూరలు ఎక్కువ గుజ్జు అవకూడదు. తరువాత ఎండుమిర్చి తీసేసి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి ఆరగించాలి.