అన్నదానం - ఒక పవిత్రమైన సమర్పణం

 
Isha Samskriti Wins the First Tamil Nadu State Level Kalaripayattu Championship
 

“మనం మనకు అందింపబడ్డ ఆధ్యాత్మిక సంపదకు, ఆధ్యాత్మిక బాటలో జీవనం సాగించిన ఋషులు, జ్ఞానులు, గురువులు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులకు మాత్రమే కాక వారికి  పోషణనిచ్చి సహాయపడిన సమాజానికి కూడా ఎంతో ఋణపడి ఉంటాము. మన సంస్కృతిలో ఆధ్యాత్మిక సాధకులను, సన్యాసులను సేవించటం చాలా గొప్పగా భావిస్తారు. నిజానికి, ఎంతోమందికి ఇలా సేవలో తరించటమే వారు ఎంచుకున్న ఆధ్యాత్మికత బాట. ఇలా సేవించటంలో అత్యంత అధ్బుతమైన మార్గం అన్నదానం, ఆహార సమర్పణ.”- సద్గురు

ఈశా, ఒక లాభాపేక్షలేని సంస్థగా ప్రజల జీవితాల్లో భౌతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేందుకు పలురకాల సేవా కార్యక్రమాలు, ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. వీటన్నిటినీ సాగించటానికి, అన్నిటిలోకల్లా ప్రధానమైన అంశం ఆహారం. ఈశా యోగా కేంద్రంలో, అన్నదానాన్ని ఒక పవిత్రమైన ఆహార సమర్పణగా ఇక్కడ నివాసం ఉండేవారికి, సన్యాసులకు, వాలంటీర్లకు, బ్రహ్మచారులకు, విద్యార్ధులకు మరియు ఆశ్రమ సందర్శకులకు షుమారు వెయ్యిమందికి రోజులో రెండుసార్లు అన్నదానం అందిస్తారు. ఈ అత్యవసర దానం వల్ల తమ జీవితాల్ని ఈశా నిర్వహరణలో సాగే పలు ఆధ్యాత్మిక, సామాజిక, పర్యావరణ మరియు విద్యా కార్యక్రమ్మలకు అంకితం చేసిన సాధకులకు ఆయువు అందిస్తుంది.

ఈశా యోగా కేంద్రంలోని భిక్ష హాలులో అన్నదానం నిర్వహింపబడుతుంది. భిక్ష అంటే అన్న సమర్పణ అని అర్ధం. పూర్తి నిశ్శబ్దంలో, భోజనానికి ముందు మనిషి జీవ ప్రక్రియను ఇనుమడింపచేసే విధమైన తెజోవంతమైన శబ్ద అమరిక కలిగిన ఆవాహనతో ఇక్కడ అన్నదానం స్వీకరింపబడుతుంది. ఆధ్యాత్మిక బాటలోని ఒక ముఖ్య అంశం ఏంటంటే, జీవితంలోని ప్రతి కోణాన్ని గ్రహించగలగటం, అందుకే ఈశా యోగా కేంద్రంలో ఒక ప్రత్యేకమైన తరహాలో అన్న సమర్పణకు గొప్ప ప్రాముఖ్యతనిస్తారు.

“ఇప్పుడు మన రోజువారీ జీవితంలో రెండు పూటలు లేక ఒక్క పూట ఆహారం తీసుకుంటున్నాం. ఒకవేళ మీరు కేవలం ఒకటి లేదా రెండు పూటల మాత్రమే భోజనం చేస్తుంటే సహజంగానే భోజనానికి కూర్చునే సరికి మీరు బాగా ఆకలితో ఉంటారు. ఇక్కడ ఆహారం వడ్డించిన వెంటనే మీరు తినరు. అందరూ కూర్చునేదాకా వేచి ఉంటారు. అందరి పళ్ళాలలో వడ్డన జరిగేదాకా మీరు ఆగుతారు, తర్వాత ఆవాహన చేస్తారు, ఆ తర్వాత మెల్లగా తింటారు. ఇలా ఉండగలగటానికి చాలా ఎరుక కావాలి. ఆకలిగా ఉన్నప్పుడు అలా ఆపుకొగలగటం, ఆ మూడు లేదా నాలుగు నిమిషాలు ఓర్పుతో వేచి ఉండటం, మనిషిలో గొప్ప ఎరుక ఉంటే తప్ప అది వీలుకాదు. ఆహారం కనిపించగానే లాక్కుని తినేయటం ఎంతో తేలిక, కాని అలా చేయటం వలన మీ ఎరుక మరింత క్షీణించిపోతుంది.”- సద్గురు

 

annadanam

గడిచిన కొద్ది సంవత్సరాలలో, ఈశా అద్భుతంగా విస్తరించడంతో సద్గురు చాలా మందికి చేరువయ్యారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆధ్యాత్మికతచే స్ప్రుశింపబడటం వలన ఆధ్యాత్మిక తపనను పెంపొందిచుకుంటూ, ఈశా అందించే ఈ శక్తివంతమైన అవకాశాన్ని అందుకునేందుకు వచ్చే స్త్రీ పురుషుల సంఖ్య ఈశా యోగా కేంద్రంలో నెమ్మదిగా పెరుగుతుంది. ఆశ్రమం పెరిగేకొద్దీ, దానిని సహకరించే వనరులు అవసరం కూడా పెరుగుతుంది.

ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును విస్తరింపచేయాలన్న సద్గురు సంకల్పంలో మీరూ భాగాస్వాములయ్యి మీ  పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం లేదా ఇంకేదైనా మీ జీవితంలోని ముఖ్యమైన సందర్భాలలో మీరు ఎంపిక చేసుకొన్న రోజున అన్నదానం అందించే అవకాశం పొందండి. మరింత సమాచారం కొసం donations@ishafoundation.org కు మెయిల్ పంపించండి లేదా +91-9442504655 , +91-9442504737 కు కాల్ చేయండి.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1