ఆధ్యాత్మిక జీవితం కోసం 6 సూత్రాలు!

 

రండి! అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో ఈ ఆరు సూత్రాల ద్వారా తెలుసుకుందాం.

  • ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం అంటే అర్థం, మీరు దైవానికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారని కాదు – మీరు దైవంతో ఏకమవ్వాలనుకుంటున్నారని.

a1

 

  • మనుషులు తమలోనే ఉన్నసృష్టికర్తను అనుభూతి చెందరు కాబట్టే, మతాలు మనుతున్నాయి. లేకపోతే, దేవుడు స్వర్గంలో కూర్చున్నాడని ఎవరు నమ్ముతారు?

a2

 

  • అనుగ్రహం కిందికి దిగిరాదు – అది ఎల్లప్పుడూ ఉంటుంది. దానిని గ్రహించేలా మిమ్మల్ని మీరు తయారుచేసుకోవాలి.

a3

 

  • ఆధ్యాత్మికత అంటే భౌతికాన్నిత్యజించడం కాదు, దానిని అధిగమించడం.

a4

 

  • ఆధ్యాత్మిక ప్రక్రియ ఓ వెనకడుగు కాదు. ఇతరులింకా వెళ్ళని చోటుకు వేసే ఒక పెద్ద ముందడుగు.

a5

 

  • ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏదో ఒక రోజు స్వర్గానికి పోవడం గురించి కాదు. అది జీవితం యొక్క పూర్తి ఔన్నత్యాన్ని తెలుసుకోవడం గురించి.a6