III(Isha Institute of Inner Sciences), టెన్నెసీలో నిర్వహించిన 90 రోజుల ఆనాధి కార్యక్రమనికి మహాచురుకుగా ఉండేవాళ్ళు చాలామంది హాజరయ్యారు. వాళ్ళందరూ వాళ్ళ సాధనని మరొక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అద్భుతమైన ప్రయత్నం చేశారు.  మేమందరమూ మా పరిమితుల అవధులను అన్వేషించడానికి కలిసికట్తుగా ప్రయత్నం చేశాము. అది అసాధారణమే కాదు, దానిని మించింది ఏమైనా ఉంటే అది. మేమందరం అక్కడ ఉన్నప్పుడు ఒక గురుపూర్ణిమ రావడం తటస్థించింది.

నా జీవితంలో ఎక్కువభాగం నన్ను శాసించింది నా గురువే తప్ప ఇంకెవ్వరూ కాదు. ఈ రోజుకీ నా మనసులో --నా మనసే కాదు, నా శరీరంలోని ప్రతి రంధ్రంలోనూ, ప్రతి నాడిలోనూ... ప్రతిధ్వనిస్తూ శాసించేది ఆయన ఉనికే.  బహుశా ఈ కారణం వల్లనే, నాలో స్పందించే సమస్తమూ నాది కాదు, నాకు అతీతమైనది ఏదో అది.

ఆయన స్పర్శ, నాలో... జీవితమూ దానికి అతీతమైనదాని గురించి జ్ఞానం ప్రసాదించడంతో పాటు మహోన్నతమైన అనుభూతిని కలిగించినప్పటికీ, నేను నా గురువుని నన్ను స్పృశించిన మానవాకృతిగా ఎన్నడూ చూడలేదు. నాలో అంతర్నిబిడంగా ఉన్న వ్యవస్థ ఏదో అది శివుడి దగ్గరనుండి వస్తే తప్ప దేనినీ అంగీకరించదు. ఆయన అనుకంపలో, మా గురువు తనని ఆ ఆకృతిలోకి మలుచుకున్నారు.  తనని అలా మలుచుకోవడం ఆయన లీలో, లేక నిజంగా వారు అలాగ ఉన్నారో నేను చెప్పలేను. కాని, అప్పటినుండి, నేను ఎప్పుడూ దేనిగురించీ తెలుసుకోవలసిన ప్రయత్నం చెయ్యనవసరంలేని స్థితిలో ఉన్నాను. ఎప్పుడు ఏది తెలుసుకోవలసిన అవసరం పడినా, ఆయన(గురువు) ఇంకా ఆయన(శివుడు) ఎల్లప్పుడూ ఉంటారు.

గురు పూర్ణిమనాడు,  5 -10 నిమిషాలలోనే ఈ క్రింది 5 పద్యాలూ నా నుండి బయటకు పెల్లుబికాయి.  నాకు పెద్దగా కవిత్వం రాయడం తెలియదు. ఏ భాషలోనూ ఏ రకమైన ప్రావీణ్యంలేకపోయినా, కేవలం అనుగ్రహం వల్ల,  నాలోని భావాలను మాటల రోపంలో పొందుపరిచాను.

 

నా గురువు

ఆలోచిస్తూ, మెల్లకళ్లతో తేరిపార చూస్తూ

నా లక్ష్యాన్ని చేదించలేకపోతున్నాను.

అతను మాత్రం స్వేచ్చగా రాజులా వచ్చి

వంపులు తిరిగిన కర్రపట్టుకుని

తన లక్ష్యాన్ని కొట్టగలిగేడు.

నా గురువు

ఓడిపోయాను. జీవన్మరణాలకు ఓడిపోయాను.

రెండూ చేశాను. కానీ అవి నను కదల్చలేదు.

కర్ర చేత్తో పట్టుకుని నడుస్తున్న మనిషి

ఒకడు నాదగ్గరకి వచ్చాడు, ధృఢకాయుడే,

చావుపుట్టుకలు చూసినవాడు,

జీవితం అందించగలవన్నీ అందుకున్నవాడు

అయినా కిక్కురుమనకుండా కూచున్నాడు,

వంకరటింకర కర్రతో ఒకతను వచ్చి

అతని మెరుపువంటి కర్రతో

నన్ను తాకాడు.

నా గురువు

భూమ్యాకాశాలనీ, లౌకిక పారలౌకిక

ప్రపంచాన్నీ వాటిమానాన వాటిని పోనిచ్చాను.

మాతృగర్భంలోనూ,

ప్రేమిక హృదయంలోనూ వెదికి చూసాను గాని

నేను క్రిమిలా అతని చెంతకు పాకేదాకా

తననిపోలిన వాళ్ళను కనుగొనలేకపోయాను.

నా గురువు

పాపం గురువు ఏమి చెయ్యగలడు?

నేను చేస్తున్న దంతా ఎప్ప్పుడూ ఏదో చెయ్యడమే.

చూడగలిగినదంతా చూసి, చివరకు

అతను నాకు ఎలా జీవించాలో చెప్పాడు.

నా గురువు

బయటకి పోయిన నా నిశ్వాస

తిరిగి లోపలికి రాదు.

నన్ను స్పృశించి నిష్క్రమించిన గురువు

నను వీడకపోయినా, మరలి రాడు.