ప్రశ్న: నా జీవితంలో లేదా వ్యాపార నిర్ణయాల్లో పెళ్ళి చర్చల్లో లేదా పిల్లల పెంపకంలో, లేదా వృత్తిపరమైన నిర్ణయాల్లో, ఏది సరిగ్గా పని చేస్తోందో నాకు ఎలా తెలుస్తుంది?.

సద్గురు: మీకు పెళ్ళయ్యుండి మీరు ఈ మాట అడుగుతున్నారా?. చూడండి, మీరు దేవుడిలా ఉండాలి. నిశ్శబ్ద భాగాస్వామిలాగా!. అప్పుడే అన్నీ సరిగ్గా పనిచేస్తాయ్. అచ్చం దేవుడిలా. ఎవరు ఏం చేసినా, దేవుడిలా ఉండటం నేర్చుకోండి.దేంట్లోనూ ఎప్పుడూ కలగజేసుకోకండి. ప్రతి ఉదయం, ప్రతి వెధవా మీకు ఇవాళ ఏం చెయ్యాలో చెప్తూ ఉంటాడు.మీరు వినండంతే!. అచ్చం దేవుడిలా. పెళ్ళైతే పరవాలేదు కానీ, వృత్తిపరంగా ఇది కష్టం కావచ్చు.

చూడండి, మీరు దీన్ని పూర్తిగా అపార్ధం చేసుకుంటున్నారు. మీరు దీన్ని ఒక రకమైన నీతుల వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారు.దీన్ని మీ తత్వంగా మార్చుకుంటున్నారు “నేను పనికొచ్చే విషయాలే చేస్తాను” అంటూ. ఎందుకు అలా ఒట్టేసుకుంటున్నారు? నేను ఇదే పని చేస్తానని?. ఏది సరిగ్గా పని చేస్తుందో మీకు తెలీదు కదా!.(నవ్వులు).ఎందుకంటే, ఒట్ల వల్ల ఏదీ పని చెయ్యదు, నీతుల వల్ల కూడా కాదు. ఏది పనిచేస్తుందో తెలియాలంటే, నిరంతర గమనిక కావాలి, మీరు ఎవరో తెలుసుకునే పరిణితి కావాలి. అంతేనా?.హలో!. అవే విషయాలు, మీరు ఒకప్పుడు చేతగానితనంతో చేసి ఉన్నప్పటికీ ఈ రోజు వాటిని సరిగ్గా చేస్తూ ఉండుంటారు. కదా!. అంతేనా?. లేదా ఇది వరకు బాగా చేసిన పనులు ఇప్పుడు చెడగొడుతున్నామేమో, ఏ విధంగా నైనా కానివ్వండి కాస్త అటూ ఇటూగా ... కాబట్టీ ఏ సరైనది అనేది ఒక ఫార్ములా ఏమీ కాదు. అది ఒక మనిషి యొక్క పరిణామ ప్రక్రియ. ఏది పని చేస్తుందో ఎక్కడ ఏది చెయ్యాలో తెలుసుకునే ప్రక్రియ.

మీరు అడుగుతున్న ప్రశ్న మీరు రకరకాల పుస్తకాలు చదివి పోగు చేసింది. నాకు అవన్నీ తెలియవు. ఏది పని చేస్తే అది చెయ్యండి. ఏది కావాలంటే అది చెయ్యండి. నాకు సమస్యేముంది?. కానీ పని చెయ్యని విషయాలను చెయ్యటంలో అర్ధం ఏముంది?.నేను మీకు పని చేసే విషయాలు మాత్రమే చెయ్యాలని ఏమీ చెప్పట్లేదు. మీకు నచ్చినట్టు చేస్కొండి,ఎవరు కాదన్నారు?. కానీ, మీ జీవితం ఎంతో పరిమితమైంది కాబట్టీ, పనికిరాని పన్లు చెయ్యటంలో అర్ధం ఏముంది చెప్పండి.ఔనా కాదా?. అది మీకైనా పనిచెయ్యాలి, లేదా మీ చుట్టు పక్కల ఉన్నవారికైనా పని చెయ్యాలి. అది మీకూ పని చెయ్యక, మీ చుట్టుపక్కల ఉన్నవారికీ పని చెయ్యకపోతే, ఆ పని చెయ్యటంలో ఉపయోగం ఏముంది చెప్పండి?.

ఓ సారి ఇలా జరిగింది. సైనికులు... అమెరికా సైనికులు, యుద్ధ రంగానికి వెళుతున్నారు.ఒక సైనికుడు ఇంకొకడితో అన్నాడు, స్టీవ్ భార్య three musketeers” పుస్తకం చదివి ముగ్గురు బిడ్డల్ని కంది” అని. వెంటనే ఎదుటి వాడు అన్నాడు,అమ్మో నా భార్య birth of a nationచదువుతోంది, నేనేం చెయ్యాలి? “అని. అది అలా జరగదు. కాబట్టీ, ఇదేదో నీతిగానో తత్వంగానో పెట్టుకోకండి, “నేను పనిచేసే పనులే చేస్తాను” అంటూ. ఏది సరిగ్గా పనిచేస్తుందో తెలియటానికి చాలా పరిశీలన కావాలి- అతి చిన్న విషయాలపై కూడా. ఔనా కాదా?.హలో!. ఒక బంతిని తిన్నగా కొట్టటం లాంటి ఒక చిన్న విషయం చెయ్యటానికి కూడా, ఎంతో గమనింపు కావాలి. ఎంత గమనిక కావాలో తెలుసా మీకు?.ఒక బంతిని కావలసిన చోటికి కొట్ట గలిగే మొనగాడిని ప్రపంచం ఆహా ఊహో అని పొగుడుతుంది.కేవలం బంతిని కొట్టి నందుకు. ఔనా కాదా?.ఎందుకంటే, అందులో ఎంత పరిశ్రమ ఉంటుందో అందరికీ తెలుసు. ఊరికే ఎవరూ ఎవరినీ ఆరాధించరు. దాని వెనుక ఉన్న కష్టం వారికి తెలుసు. ఔనా కాదా?. అలా బంతిని కొట్టటానికి అతను ఎంత శ్రమించి ఉంటాడో, ఏమి పణంగా పెట్టాడో అందరికీ తెలుసు. అతని జీవితమే అంకితం దానికి.

కాబట్టీ, అన్నిటికీ నీతులు, తత్వాలు ఎర్పరుచుకోకండి. మీకు మీరే ఆజ్ఞ్యలు ఇచ్చుకోకండి. “నేను పనిచేసే పనులే చేస్తాను’ అంటూ. అది మంచిదే కానీ ఏది పనిచేసే పనో మీకు తెలీదు.(నవ్వు). కాబట్టీ, ... వద్దు. మీరు చైతన్యంతో ఉంటూ, ప్రతి ఒక్క అంశాన్నీ పరికించి చూడాలి. మీరు ఇదొక్కటే నేర్చుకుంటే, అంటే, ‘ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు అనేది నిర్ణయించకుండా’ ఉంటే చాలు. నేను ఇక్కడికొచ్చే ముందు ఢిల్లీ లో rally for rivers బోర్డు మీటింగులో ఉన్నాను. CII... అంటే, confederationof Indian industries, కూడా ఇందులో పాలుపంచుకుంది, ఎందుకంటే, ఇది ఎలా జరుగుతుందో వారు తెలుసుకోవాలనుకున్నారు, ఎందుకంటే, ఈ ర్యాలీ పరిధి పెరిగేసరికి అందరికీ అర్ధమౌతోంది, అందరూ దీంట్లో పాల్గోనాలనుకుంటున్నారు . మాకు ఒక ముఖ్యమైన బోర్డు ఉంది, world wild life fund యొక్క CEO, ప్రముఖ నీటి వనరుల నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు, ఇంకా సుప్రీమ్ కోర్టు జడ్జి ఒకరు ఉన్నారు. ఇది ఎంతో ప్రముఖమైన బోర్డు. ఈ “కావేరి కాలింగ్” కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు.

ప్రతి ప్రశ్నకీ, ముఖ్యంగా కొందరు నిపుణులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నేను వారికి యధాలాపంగా సమాధానాలు చెబుతున్నాను. వాళ్ళు అన్నారు, సద్గురు, మీకు ఇవన్నీ ఎలా తెలుసు? అని. నేనన్నాను, నా చిన్నప్పటి నించీ నేను ఊరికే ఏ గమ్యం లేకుండా తిరిగాను. ఏ ముఖ్య ప్రయోజనం లేకుండా అడవుల్లో, నదుల్లో ఊరికే తిరగాను. కానీ అన్నిటినీ నిశితంగా పరిశీలించాను. కాబట్టే, ప్రతి మొక్కా, కీటకం, అక్కడి తేమ, గాలి, అన్నీ తెలుసు. ఒకనాడు ఏ గమ్యం లేని ఒక ప్రయాణం, ఈ రోజు నాకు ఒక గొప్ప జ్ఞ్యానంగా ఉపయోగపడుతోంది. అది ఏ పుస్తకంలోనూ రాసి ఉండదు. మొదటిసారిగా ఒక వ్యక్తి పుస్తక జ్ఞ్యానాన్ని వదిలి కూలంకష పరిశీలనతో ఇవన్నీ చెప్పారు. నాది గాలి తిరుగుడు. ఒక పిల్లవాడిగా, ఒక యువకుడిగా, ఏ లక్ష్యం లేకుండా తిరిగాను. ఒక గంయమంటూ లేకపోయినా ఒక నిశిత దృష్టి లేకుండా జీవించలేం. ఔనా కాదా?. హలో!.

కాబట్టీ, ఈ ఒక్క పనీ చెయ్యండి. ఇది ముఖ్యం, ఇది ముఖ్యం కాదు అనే తారతమ్యం వదిలెయ్యండి. ప్రతి విషయం పై మీరు ఒకేరకమైన పరిశీలనా దృష్టి కలిగి ఉంటే, మీకే తెలుస్తుంది. ఏది సరైన విషయమో అదే అతి సహజంగా జరిగిపోతుంది. కానీ మీరు ఇది ముఖ్యం, ఇది ముఖ్యం కాదని నిర్ణయించుకుంటే, ఏది సరైన విషయమో మీరు పరిణితితో ఎలా గ్రహిస్తారు?.ఇప్పటికే అంత ముఖ్యం కాదని సగం ప్రపంచాన్ని వదిలేశాం.

మీరు ఎవరినైనా పరిశీలనగా చూసేది కూడా వాళ్ళతో మీకేమైనా సంబంధం ఉంటేనే. లేదు.. నేను మాత్రం అందరినీ నిశితంగానే చూసేవాణ్ణి. ప్రతి జీవాన్ని, ప్రతి రాయినీ, ప్రతి క్షణాన్నీ, ఈ ప్రకృతిలో, భూమిపై జరుగుతున్న అన్నిటినీ ఒక అధ్యయనంలా కాకుండా, నాకు కళ్ళు ఉన్నాయ్, శ్రద్ధ ఉంది కాబట్టీ చూశాను. నేను అన్నిటినీ శ్రద్ధగా గమనించాను. ఇవాళ దాన్నేదో పెద్ద విషయంగా చిత్రీకరిస్తున్నారు. నేను వాళ్ళతో నవ్వుతూ అన్నాను, ‘నేను ఊరికే ఒక గమ్యం లేకుండా తిరిగాను, దేశదిమ్మరిలా, కానీ ఈ రోజున ఆ గమ్యంలేని ప్రయాణం నాకు ఎంతో గొప్పగా ఉపయోగ పడుతోంది. ఎందుకంటే, మీరు చిన్న పని చేస్తున్నారా పెద్ద పని చేస్తున్నారా అనేది ముఖ్యం కాదు. మీరు పూర్తిగా నిమగ్నమైతే, సంపూర్ణంగా.. ఏది చేస్తే సరైనదో మీకు అదే తెలిసిపోతుంది. మీరిక్కడ ఏ విధంగా నిమగ్నం లేకుండా జీవిస్తున్నారు. అందుకే మీకు నీతులు ఉన్నాయ్, ఆదర్శాలు ఉన్నాయ్, మీకు తత్వాలు ఉన్నాయ్, మీకు విలువలు ఉన్నాయ్, నియమాలున్నాయ్, మీకు ఆజ్ఞ్యలు ఉన్నాయ్. ఎందుకంటే, మీరిక్కడ ఏ మాత్రం నిమగ్నం కాకుండా జీవిస్తున్నారు. మీకొక తయారుగా ఉన్న formula కావాలి. ‘ఏది సరైనది? ఏది చెయ్యాలి? ఏది చెయ్యకూడదు?’ ప్రపంచం ఇంతే స్థబ్దుగా ఉందా అని అడుగుతున్నా?. ప్రతి స్కూలు పిల్లాడికీ తెలుసు ఏది సరో. అది పని చేసిందా? పని చెయ్యలేదు. ఎందుకంటే, నిమగ్నమై ఉండటానికి వేరే ప్రత్యామ్నాయం ఉందని మీరు అనుకుంటున్నారు. దానికి ప్రత్యామ్నాయం లేనే లేదు. నిమగ్నమై జీవించకపోతే, అది జీవితమే కాదు. కాబట్టీ, ఫార్ములాలు, ఆదర్శాలు పుట్టించి జీవితంతో ఆడుకోకండి.

జీవితానికి కావల్సింది కేవలం నిమగ్నమయ్యే లక్షణమే. లీనమైపోయే లక్షణమే. ఇది ఎవరు? అది ఎవరు? ఇది ఏంటి? అది ఏంటి? అని కాదు మిమ్మల్ని స్పృశించిన ప్రతి విషయం పట్ల నిమగ్నమై జీవించటమే ముఖ్యం. మీరు ఈ ఒక్క విషయం చేస్తే, మీకున్న మేధస్సు స్థాయిని బట్టి, ప్రకృతి తను ఇచ్చేది ఇస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఏది సరైన విషయమో!. మీ దృష్టి ప్రకారం. ఇప్పుడు ఒకవేళ ఒక రకమైన సామర్ధ్యం ఉన్న ఒక వ్యక్తి కొన్ని పరిస్థితుల్లో ఒకటి చేస్తే, అదే మీకు సరి అవ్వాలన్న నియమం ఏమీ లేదు. ఔనా కాదా?. ఒక పరిస్థితిలో మీకు ఏది సరైనదో అది మీరు చెయ్యాలి. ఎదుటివారు చేసేది మీరు చెయ్యలేరు. మీ సామర్ధ్యం ప్రకారం మీరు చెయ్యగలిగింది ఎదో అది చెయ్యాలి మీరు. అదే మీ జీవితానికి సరైన విషయం ఔతుంది. ఇంకెవరో చేసిన పనులు చెయ్యటానికి ప్రయత్నించకండి. అదే పెద్ద సమస్య ఔతుంది మీకు. తయారు చేసి పెట్టుకున్న సమాధానాలు వెతక్కండి. మమేకం అవ్వటమే. దానికి ప్రత్యామ్నాయం లేనే లేదు. అది లేని చోట జీవితమే ఉండదు. ఈ 2019మీరు పూర్తిగా నిమగ్నమయ్యి జీవించే సంవత్సరం కానివ్వండి. ఎందుకంటే, మీరు ఈ జీవితాన్ని అనుభవించాలంటే, మీరు అందులో లీనమవ్వటం అవసరం. మీరు ఏం చేసినా సరే, సంపూర్ణంగా నిమగ్నమై చేస్తారా?రాబోయే రోజుల్లో?

(ఔను... అంటారు అందరూ....)

చూడండి, నేను నిజంగా మంచి గురువుని తెలుసా?. చాలా మంచి గురువుని. ఎందుకంటే, “ఇదే చెయ్యాలి” అని చెప్పట్లేదు నేను. మీకు చెప్పే వారందరూ “ఇదే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి” అని చెప్పారు. కానీ నేను చెప్తోంది “ మీ ఇష్టం వచ్చింది చెయ్యండి, చక్కగా చెయ్యండి ”అని. అందులో నిమగ్నం కాకుండా మీరు అలా చెయ్యలేరు ఔనా?. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, మీరు దానిలో పూర్తిగా లీనమై చేస్తారా?. మీరు ఉదయం ఎలా లేస్తారు? నిమగ్నమై లేస్తారా? బ్రష్ ఎలా చేస్తారు? అందులో లీనమై చేస్తారా?ఎలా మలమూత్రం చేస్తారు, ఎలా తింటారు/ పూర్తిగా అందులో మమేకమై చేస్తారా?శాంభవి ఎలా చేస్తారు?అందులో పూర్తిగా మమేకమైపోతారా?.

(ఔను... అంటారు అందరూ....)

మీరు చేసే ప్రతి పనీ,చిన్నదీ పెద్దదీ అనే భేదం చూడకండి. నేను మలమూత్రం అన్నప్పుడు మీరు హీ హీ హీ అన్నారు. ఐతే ఇక చెయ్యకండి.(అందరూ నవ్వుతారు). అది ముఖ్యం కాదు, అసహ్యం అనుకున్నప్పుడు మీరు ఆ పని చెయ్యకూడదు కదా!. నేను అంటోంది ఏంటంటే, ఆశుద్ధానికీ, పవిత్రమైనదానికీ భేదం చూడకండి. ఇదే ఇందులో కిటుకు. ఎందుకంటే, నిమగ్నమవ్వటం అంటే, తారతమ్యాలు లేక దానితో మమేకమవటమే. మీరు గనుక ఇది శుద్ధం ఇది అపరిశుద్ధం అని అన్న మరుక్షణం, ఆ అశుద్ధంలో మీరు నిమగ్నం కాగలరా?.హలో!. మీకు అజీర్ణం చేస్తుంది. నిజంగా!. ఆ తర్వాతా ఇంకేదీ పనిచెయ్యదు.

2019అనే సంవత్సరం సంపూర్ణంగా మమేకం అయ్యే సంవత్సరంగా చూద్దాం. తారతమ్యాలు లేకుండా. తారతమ్యాలు లేని చర్యలు కాదు, భేదాలు లేకుండా నిమగ్నమవ్వటం. మీరు ఒక కలుపు మొక్క వైపు, బైట ఉన్న కలుపు మొక్క వైపు, మీ బిడ్డని చూసినంత మమేకమై చూడగలరా?. ఇదే మీరు చెయ్యవలసినది. అలా నిమగ్నమయ్యే లక్షణాన్ని తెచ్చుకోండి. భేదాన్ని చూడకుండా. సంపూర్ణ నిమగ్నత. మీరే చూస్తారు, మీ జీవితం నిండుగా, ఎలా వికసిస్తుందో.2019లో మీరు వికసించాలి, జ్ఞ్యానోదయం కావాలుకునేవాళ్ళు, కాస్తంత రిలాక్స్ అవ్వండి, మీరు చేసే పని ఏదైనా సరే పూర్తిగా నిమగ్నం కండి. జీవితం అదే అద్భుతంగా జరుగుతుంది.

 

జీవితమంటే.... నిమగ్నం కావడమే.....

అది లేని చోట... జీవితమే ఉండదు...