మీరు ఆరోగ్యంగా ఉండటానికి ౩ ప్రాధమిక విషయముల పట్ల శ్రద్ధగా ఉండాలి అవి – ఆహారం, క్రియాశీలత మరియు విశ్రాంతి.


#1 సరిగా భుజించటం

ఆహారం విషయంలో, మీరు ఎరుకతో ఉండవలసిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు తీసుకునే ఆహారం ఎంత త్వరగా జీర్ణం అయ్యి మీలో అంతర్భాగం అవుతుందో అని. ఒక వేళ మీరు తీసుకునే ఆహారం మూడు గంటలలో జీర్ణం కాలేదు అంటే మీరు నివారించావలసినదానిని (లేక) తక్కువ పరిణామంలో తీసుకోవలసిన దానిని తిన్నారు అని అర్ధం. ఆహారం ౩ గంటలలోపు ఉదరం నుండి బయటకి వెళ్ళింది అంటే, అది మెరుగైన ఆహారం కానప్పటికీ, మీ వ్యవస్థ దానిని సంభాళించుకో గలదు అని అర్ధ0.

ఒక వేళ మీరు కడుపు నిండుగా తిని నిద్రకు ఉపక్రమిస్తే, అది ఉదరం లోని మిగతా అంగాలను ఒత్తిడికి గురిచేస్తుంది. ఇది వివిధరకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఏమి తినకుండా మీరు భోజనానికి భోజనానికి మధ్య ఐదు నుండి ఆరు గంటల స్పష్టమైన తేడాను పాటించగలిగితే, ప్రక్షాళన అనేది సెల్యూలర్ స్థాయిలో జరుగుతుంది. సెల్యూలర్ స్థాయిలో ప్రక్షాళన అనేది ఆరోగ్యవంతమైన జీవితానికి అతి ముఖ్యం. మీరు ౩౦ సంవత్సరాలకు పై బడితే రోజుకు రెండు సార్లు భోజనం చేస్తే సరిపోతుంది .- ఒకసారి ఉదయం మరియు ఇంకొకసారి సాయంత్రం.

మీరు సాయంత్రం ఆహారం తీసుకున్న తరువాత, నిద్రకు ఉపక్రమించటానికి మధ్యన ౩ గంటల వ్యత్యాసం తప్పక ఉండాలి. దీనికి తోడు సాధారణ నడక వంటి తేలికైన శారీరక క్రియాశీలత, 20 నుండి 30 నిమిషముల జత కలిస్తే మీ వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఒక వేళ నిండైన కడుపుతో నిద్రకు ఉపక్రమిస్తే, అది ఒక విధమైన జడత్వాన్ని మీ వ్యవస్థలో ఉత్పత్తి చేస్తుంది. శారీరకధర్మ0 ప్రకారం, ఈ జడత్వం మరణాన్ని వేగిరపరిచేటటువంటిది. మరణం అనేది అంతిమ జడత్వం.

ఇంకొక పరిమాణం ఏమిటంటే ఒక వేళ మీరు కడుపు నిండుగా తిని నిద్రకు ఉపక్రమిస్తే, అది ఉదరం లోని మిగతా అంగాలను ఒత్తిడికి గురిచేస్తుంది. ఇది వివిధరకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ కారణం వల్లనే నిద్రపోయేముందు మీరు తీసుకున్న ఆహారం ఉదరం లోనుండి బయటకి వెళ్ళటం అతి ముఖ్యం. మీరు వివిధ భంగిమములలో నిద్రపోతారు, ఎప్పుడూ మీ ఉదరము ఇతర అంగాలను ఒత్తిడికి గురి చెయ్యకూడదు.

 #2 మీ శరీరాన్ని ఉపయోగించండి

కార్యాచరణ విషయానికి వచ్చేసరికి మీరు పరిగణలోకి తీసుకోవలసిన ఒక సాధారణ విషయం ఏమిటి అంటే, మన శరీరానికి ముందుకి, వెనుకకు మరియు ప్రక్కలకు వంగగలిగే సామర్ధ్యం ఉన్నది. ఎదోఒక రూపంలో ఈ కొద్ది క్రియాశీలత అయినా తప్పక జరగాలి. ఒక వేళ సాంప్రదాయక హఠయోగా మీ జీవితంలో భాగం కాకపోతే, ప్రతి రోజు ఖచ్చితంగా ఎదోవిధంగా ముందుకి వెనుకకి వంగండి మరియు వెన్నెముకను సాగదీసే విధముగా గొంతుకు కూర్చోండి. మీ మొత్తం వ్యవస్థ ముఖ్యంగా నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రోజువారీగా ఇవి చెయ్యటం ప్రతిఒక్కరికి తప్పనిసరి. లేకపోతే వయసు పెరిగే కొలది అనేక సమస్యలు వస్తాయి.

 #3  తగినంత విశ్రాంతి తీసుకోండి .. మరీ ఎక్కువ కాదు!

వ్యక్తిగతంగా ఎంత పరిమాణంలో నిద్ర అవసరమో అన్నది వివిధ కారణాల పైన ఆధార పడి ఉంటుంది. ఏ రకమైన మరియు ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నారు అనేది అతి ముఖ్యమైన అంశం. మీరు వివిధ రకమైన ఆహారముల పై తప్పక ప్రయోగం చేసి ఏ రకమైన ఆహారం మిమ్మల్ని భారంగా ఉంచుతుంది మరియు ఏ రకమైన ఆహారం మిమ్మల్ని తేలికగా, చురుకుగా ఉంచుతుందో గమనించండి. ఒక వేళ మీరు తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు 40 శాతంకు తగ్గకుండా ఉండినట్లయితే, మీ శరీరం తేలికగా ఉంటుంది.

మీ శరీరానికి అవసరమైనది విశ్రాంతియే కానీ నిద్ర కాదు. విశ్రాంతికి నిద్ర ఒక్కటే మార్గం అనేది సరి అయిన అవగాహన కాదు. మీరు కూర్చున్నా లేక నుంచున్నాకూడా విశ్రాంతి స్థితిలో ఉండవచ్చు, ఆందోళన స్థితిలో ఉండవచ్చు లేక జడత్వ స్థితిలో ఉండవచ్చు. ఒక వేళ మీరు జీవితంలోని ప్రతి క్షణం చురుకైన విశ్రాంతి స్థితిలో ఉంటే, మీకు అవసరమైన నిద్ర పరిమాణంలో తగ్గుదల ఉంటుంది.

శరీరం యొక్క ఐదు కోశములు

యోగాలో మానవ వ్యవస్థను ఐదు కోశములు లేక పొరలుగా చూస్తాము. మానవ వ్యవస్థ లోని ప్రతి అంశం, మనస్సును కూడా కలిపి దేహము గానే చూస్తాము, మరియు యోగా అనేది దానిని పరివర్తించే ఒక సాంకేతికత. శరీరంలో ఉన్న ఈ అయిదు కోశాలను లేక పొరలను అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం మరియు ఆనందమయ కోశం అని పిలుస్తాము.

అన్న అనగా ఆహారం. మీ భౌతిక శరీరం (లేక) అన్నమయ కోశం అనేది ప్రాధమికంగా మీరు తీసుకున్న ఆహార0 – చిన్నదా లేక పెద్దదా అనేది మీ ఎంపిక మాత్రమే కానీ ఇది ఆహారం కుప్ప తప్పించి ఏమి కాదు. మీకు బయటనుండి సేకరించిన భౌతిక శరీరం ఉన్నట్లే, మానసిక దేహం కూడా ఉంటుంది. మనస్సు అనేది శరీరంలోని ఒక నిర్దిష్ట భాగంలో ఉండదు – శరీరంలోని ప్రతి అణువుకూ సొంత జ్ఞాపక శక్తీ మరియు మేధస్సు ఉంటుంది. ఈ మానసిక శరీరాన్నే మనోమయ కోశము అని పిలుస్తాము. భౌతిక శరీరం హార్డువేర్ అయితే మానసిక శరీరం సాఫ్ట్ వేర్.

మీరు భౌతిక శరీరాన్ని, మానసిక శరీరాన్ని(మనోమయ కోశాన్ని) మరియు శక్తీ శరీరాన్ని(ప్రాణమయ కోశాన్ని) సరి అయిన విధముగా లయం చేసినట్లయితే మీకు శారీరక మరియు మానసిక రుగ్మతలు అనేవి ఉండవు.

నాణ్యమైన శక్తి అందించకపోతే హార్డువేర్ మరియు సాఫ్ట్ వేర్ కూడా ఏమి ఎక్కువగా చెయ్యలేవు. శరీరంలో ఉన్న మూడవ పొరని ప్రాణమయకోశం లేక శక్తీ శరీరం అంటాము. దేహము, మానసిక శరీరం మరియు శక్తీ శరీరం అన్నీ భౌతికమే కానీ వేరు వేరు స్థాయిలలో సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు మీరు లైట్ బల్బ్ ను స్పష్టంగా భౌతిక0గా చూడగలుగుతారు. అది ప్రసురింపచేసే క్రాంతి కూడా భౌతికమే మరియు దాని వెనుక ఉన్న విద్యుత్ శక్తి కూడా భౌతికమే. లైట్ బల్బ్, క్రాంతి మరియు విద్యుత్ శక్తీ అన్నీ భౌతికమే కానీ సూక్ష్మంగా వేరు వేరు స్థాయిలలో ఉన్నాయి. అదే విధముగా భౌతిక శరీరము, మానసిక శరీరము మరియు శక్తీ శరీరము ((ప్రాణమయ కోశము) అన్నీ భౌతికమే కానీ సూక్ష్మంగా వేరుగా ఉంటాయి.

శరీరంలోని తరువాత పొర విజ్ఞానమయ కోశము అని పిలవబడే సంధికాలిక శరీరము. భౌతికత్వానికి అభౌతికత్వానికి మధ్య వారధి లాగా ఉంటుంది. ఇది ఏ రకమైన భౌతిక గుణములను ఆపాదించుకోదు కానీ అదే సమయములో ఇది పూర్తిగా అభౌతికం కూడా కాదు. ఐదవ పొరను ఆనందమయ కోశము అని పిలుస్తారు ఇది పరమానంద శరీరము. అంటే మీలో పరమానందమైన బుడగ ఒకటి ఉంది అని కాదు. మనము పరమానందమైన శరీరము అని ఎందుకు పిలుస్తాము అంటే దానిని మనము ఎప్పుడు స్పృశించినా మనము ఆనందభరితులమవుతాము. పరమానందం దాని స్వభావం కానప్పటికీ, అది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందమయకోశము అనేది భౌతికంగా ఉండే ప్రతి దానికి మూలమైన అభౌతిక పరిణామం.

ఒక వేళ మీరు భౌతిక శరీరాన్ని, మానసిక శరీరాన్ని మరియు శక్తీ శరీరాన్ని(ప్రాణమయ కోశము) సంతులనంగా సరిఅయిన రీతిలో ఆలీనం చెయ్యగలిగితే మీకు శారీరక మరియు మానసిక రుగ్మతలు అనేవి ఉండవు. అనారోగ్య సమస్యలు మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు మరియు మానసిక రుగ్మతలు నుండి బయటపడిన వందలు, వేలాది మందిని నేను మీకు చూపిస్తాను – కేవలం వారిలోవారు తగిన విధంగా లయం చేసుకోవటం వలన. సరిగా ఆలినమై ఉండక పోవటమే అన్నీ సమస్యలకు కారణం. మీ శరీరం నిమ్మళము (లేక) నెమ్మదిగా ఉన్నప్పుడు మీకు రోగము అనేదే ఉండదు.

మొదటి మూడు పొరలను ఆలినం చేసినప్పుడు మాత్రమే, ఆనందమయ కోశమును స్పృశించే అవకాశము మరియు మార్గము ఏర్పడుతుంది. మీ అస్థిత్వానికి పరమానందం అనేది సహజ స్థితి అవుతుంది. ఎదో ఒక నిర్దిష్టమైన దానికి ఆనందభరితం అవ్వటంకాదు – మామూలుగా ఆనందంగా ఉండటం ఎందుకంటే జీవం యొక్క స్వభావం అదే.

 ప్రేమాశీస్సులతో,
సద్గురు