ప్రార్థన అంటే ఇలా ఉండాలి,  అలా ఉండాలి అని మనకి అనేక అభిప్రాయాలు ఉంటాయి. ఐతే  సద్గురు ప్రకారం నిజమైన ప్రార్థన అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి!

మిమ్మల్నిమీరడగాల్సిన మొదటి ప్రశ్న మీ ప్రార్థన ఏమిటన్న దాని గురించే. “ భగవంతుడా, నాకు అదివ్వు, నాకు ఇదివ్వు, భగవంతుడా, నన్ను కాపాడు” అనే మీ ప్రార్థన అయితే,  ప్రార్థనలో మీరు కోరుకుంటున్నది భగవంతుడిని కాదు, మీరు కోరుకుంటున్నది భద్రత, ఆనందం. అంతిమంగా, ప్రార్థనలో మీరు కోరుకుంటున్నది సుఖసంతోషాలనే, కానీ అది ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. మీరు వేయాల్సిన మొదటి అడుగు మీతో మీరు కచ్చితంగా ఉండటం. ఆ తరువాత మనం నిజమైన ఆనందానికీ, సుఖసంతోషాలకీ ఉన్న అడ్డంకులను ఎలా దాటాలో చూడచ్చు.

మీరు రక్షణనో లేదా ప్రాపంచిక విషయాలనో కోరుకుంటూ ఉంటే, మీ ప్రార్థనకి అత్యాశ, భయం ఆధారాలవుతాయి. దీని వల్ల ఒరిగేదేమీ లేదు.

మన మూర్ఖత్వాన్ని మనం తెలుసుకోనంత వరకూ భగవంతుడి వైపు చూడడం వల్ల లాభం లేదని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. మతం పట్ల మీకున్న లోతైన ఉద్దేశ్యాన్ని మీరు నిజాయతీగా చూస్తే, మీరెప్పుడూ దైవత్వాన్ని కాంక్షించలేదని మీరు గమనిస్తారు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. మీ ఆకాంక్ష ఎన్నడూ అనంతం కోసం కాదు. మీ ఆకాంక్షంతా సౌకర్యం, సంపద, అధికారం, సుఖాల కోసమే.  వీటన్నిటినీ సాధించేందుకు భగవంతుడు ఒక పరికరమని మీరు అనుకుంటారు. మీరు రక్షణనో లేదా ప్రాపంచిక విషయాలనో కోరుకుంటూ ఉంటే, మీ ప్రార్థనకి అత్యాశ, భయం ఆధారాలవుతాయి. దీని వల్ల ఒరిగేదేమీ లేదు.

సాధారణంగా, మనం ప్రార్థనని దేవుడిని చేరుకునే మార్గంగా భావిస్తాం, కానీ, భగవంతుడి గురించి మనకు నిజంగా తెలిసిందేమిటి? మనం సత్యవంతులమైతే, మనకు భగవంతుడి యొక్క ప్రత్యక్ష అనుభవం లేదని ఒప్పుకోవాలి; మనమో ప్రత్యేకమైన విశ్వాస వ్యవస్థ నుండీ వస్తున్నాం. మనకు ప్రత్యక్ష అనుభవం లేని దేవుడిని చేరుకోవాలని అనుకోవడం ఒక భ్రమ కావచ్చు. ఆలోచనలు, ప్రార్థన ఒక మనిషిని వికసించేలా చేయవచ్చు, కానీ అదే సమయంలో, అవి భ్రమలను కాడా కలుగచేయవచ్చు.

ఒక్కసారి భ్రమలు పెరగడం మొదలైతే, అవి చాలా పెద్దగా అవుతాయి, ఎందుకంటే భ్రమ, వాస్తవం కన్నా ఎప్పుడూ శక్తివంతమైనది. భ్రమకి తనేది కావాలనుకుంటుందో అదయ్యే స్వేచ్ఛ ఉంది.

సినిమా నిజ జీవితం కన్నా శక్తివంతమైనది. దాన్ని మీకు తోచినట్టుగా ఎక్కువ చేసుకుంటూ పోవచ్చు. భ్రమించే ప్రక్రియ పెద్దదైనప్పుడు, అది జీవితం కన్నా శక్తివంతంగా తయారవుతుంది. ప్రార్థనని దుర్వినియోగం చేయడానికే కాదు, అందులో వంచనకూ ఆస్కారముంది.

ప్రార్థనాపూర్వకంగా ఉండడం అంటే మొత్తంగా మీ ప్రాణాన్నే ఒక అర్పణగా మార్చడం; అది మిమ్మల్ని మీరు అర్పించుకునే ప్రక్రియ

మనుషులు అర్థం చేసుకోవాల్సినదేమిటంటే తేడా అనేది ప్రార్థన వల్ల జరగదని. తేడా ప్రార్థనపూర్వకంగా ఉండడం అనే గుణం వల్ల కలగుతుంది, అంతే కానీ ఒక చర్యలా కాదు. ప్రార్థనాపూర్వకంగా ఉండడం అంటే మొత్తంగా మీ ప్రాణాన్నే ఒక అర్పణగా మార్చడం; అది మిమ్మల్ని మీరు అర్పించుకునే ప్రక్రియ.

ప్రార్థనాపూర్వకంగా ఉండడమనేది సకలభూతస్థమూ, సర్వవ్యాపితమూ అయిన దైవంతో లోతైన బంధాన్ని కలిగి ఉండడం.

ప్రార్థనాపూర్వకంగా ఉండడమనేది సకలభూతస్థమూ, సర్వవ్యాపితమూ అయిన దైవంతో లోతైన బంధాన్ని కలిగి ఉండడం. అదొక గుణం, అదొక ప్రాణ స్థితి. మనం ప్రార్థనాపూర్వకంగా మారేకొద్దీ, అది అత్యంత అందంగా ఉంటుంది. కానీ మనం మన అంతర్గత ప్రవృత్తికి సంధానించబడి ఉన్నప్పుడే మనం ఆ స్థితికి చేరుకుంటాము. తరువాత, ఆ అనుభవం సంపూర్ణంగా ఆనందంగా ఉంటుంది.

మనం నిజంగా ప్రార్థనాపూర్వకంగా ఉండడం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు, ప్రార్థన దేవుణ్ణి చేరే మార్గం కాక, దేవుడు కేవలం మన ప్రార్థనకు మార్గంగా మారుతాడని

మనం నిజంగా ఆనందంగా ఉన్నప్పుడు, మన పరిమితులు తొలుగిపోయి, దేన్నైనా గ్రహించడానికి అనుకూలమైన స్థితిలో ఉంటాము. అప్పుడు ప్రార్థన ఏమాత్రం ఏకపాత్రాభినయం కాబోదు, ఒక అందమైన దృగ్పరిణామంగా, ఎంతో గొప్ప సంతోషాన్ని తెచ్చే వేడుకగా మారుతుంది. అప్పుడు మనం భయంతోనో లేదా అత్యాశతోనో ప్రార్థించం. ఎందుకంటే అప్పుడు ప్రార్థనే ఒక బహుమతి కాబట్టి. యోగపితామహుడిగా పరిగణించబడే పతంజలి, ఎంత దూరం వెళతాడంటే మనం నిజంగా ప్రార్థనాపూర్వకంగా ఉండడం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు, ప్రార్థన దేవుణ్ణి చేరే మార్గంగా కాక, దేవుడు కేవలం మన ప్రార్థనకు మార్గంగా మారుతాడని ఆయన అన్నారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Image courtesy: flickr.com