ఆత్మీయులు ప్రశాంతమైన మరణం పొందగలగడానికి మనము చేయగలిగిన ప్రయత్నాల గురించి, ఇందుకు భారత సంసృతి అందించిన ప్రక్రియలు గురించి వివరిస్తున్నారు.

ప్రశ్న: మా అమ్మగారు అవసానదశలో ఉన్నారు . ఆమె ప్రశాంతంగా మరణానికి సిద్ధం కావాలంటే అనుసరించాల్సిన ఉత్తమ మార్గం ఏమిటి?

సద్గురు: ప్రపంచంలో ప్రతిచోటా, ప్రజలు ప్రశాంతంగా ఎలా చనిపోవాలనే విషయం గురించి మాట్లాడతారు. వారు చెప్పాలనుకున్నది ఏమిటంటే మొరటు పద్ధతిలో చనిపోవటానికి ఇష్టపడరని. వారు సున్నితంగా నిష్క్రమించాలని కోరుకుంటారు. మరణం లో ఉన్న కఠినత్వాన్ని తొలగించాలనుకుంటే, మీరు చేయగలిగే ఒక మామూలు విషయం ఏమిటంటే దీపం వెలిగించడం నెయ్యిదీపం అయితే మెరుగు లేకపోతే వెన్న దీపం అయినా సరే, ఆ వ్యక్తికి దగ్గరలో 24 గంటలూ .నిరంతరం వెలిగించి ఉంచడం. ఇది ఒక నిర్దిష్ట ప్రకాశాన్ని సృష్టిస్తుంది, తద్వారా ఉపసంహరణ యొక్క అస్థిరమైన స్వభావాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు- ఇంకొకటి మీరు చేయగలిగినది ఎదైన ఒక సిడిలో "బ్రహ్మానంద స్వరూప" వంటి భజనను - చాలామంద్రస్థాయిలో పెట్టవచ్చు . ఈ నేపథ్యంలో పవిత్రమైన ఆ శబ్దం కఠినమైన నిష్క్రమణను నివారించగలదని రుజువుచేస్తుంది.

ఒకరు చనిపోయినట్లు ధృవీకరించబడిన 14 రోజులవరకు ఒక దీపం మరియు ఒక సరళ శ్లోకం కొనసాగాలి, ఎందుకంటే అతను వైద్యపరంగా చనిపోయి ఉండవచ్చు, కాని అస్థిత్వపరంగా చనిపోలేదు; అతను పూర్తిగా చనిపోలేదు. మరణం నెమ్మదిగా జరుగుతుంది. ఈ భూమి నుండి జీవన ప్రక్రియ ఉపసంహరణ- శరీరం- అంతా దశల వారీగా జరుగుతుంది. సకల ఆచరణాత్మక ప్రయోజనాల కోసం, ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడు మొదలైన అవయవాలు పని చేయడం ఆగిపోతాయి , కాబట్టి వారు చనిపోయినట్లు ప్రకటించారు కానీ అది పూర్తిగా ఇంకా అలా కాదు . వ్యక్తి శరీరం కాలిపోయినప్పటికీ, అతను ఇంకా చనిపోలేదు ఎందుకంటే మరో లోకంలోకి అతని ప్రయాణం ప్రారంభం కాలేదు.

ఈ విషయం ఆధారంగానే ఎవరైనా చనిపోతే 14 రోజుల వరకు వివిధ రకాల ఆచారాలు నిర్వహించడం భారతదేశంలో ఉంది.. దురదృష్టవశాత్తూ ,ఈ ఆచారాల వెనుక ఉన్న జ్ఞానం, శక్తి చాలావరకు నశించాయి. ప్రజలు తమ జీవనోపాధి కోసం ఈ పనులు చేస్తున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే దాని యొక్క ప్రాముఖ్యతను నిజంగా అర్థం చేసుకుంటున్నారు. పూర్తి చైతన్యంతో దేహత్యాగం చేసినవారు తక్షణమే నిష్క్రమిస్తారు , అలాంటి వ్యక్తి కోసం మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కానీ మిగతావాళ్ళందరికీ, ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే మీరు వారికి మార్గం చూపించాలి.

కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు చేసే మొదటిపని ఏమిటంటే, వారి శరీరంతో సన్నిహితంగా ఉన్నవి ఏవైనా, లోదుస్తులు లాంటివి కాల్చేస్తారు . ఇతర బట్టలు, నగలు, ప్రతిదీ పంచివేస్తారు . ఒకే వ్యక్తికి కాదు- కానీ మూడు రోజుల్లో ప్రతిదీ వీలైనంత త్వరగా చాలామందికి పంచివేస్తారు. తద్వారా చనిపోయినవారికి ఇకపై ఎక్కడ తారట్లాడాలో తెలియదు. మీరు వారి వస్తువులను ఒకే కట్టగా ఎవరికైనా ఇస్తే, వారు అక్కడికి వెళతారు ఎందుకంటే వారి శరీరశక్తి ఇప్పటికీ ఆ వస్త్రాలలో ఉంటుంది. . ఇలా చేయడంవల్ల చనిపోయినవారిని స్థిరపరచడమేకాక , కుటుంబం , బంధువులు కూడా స్థిమితపడడానికి దోహదం చేస్తుంది. తద్వారా వాళ్ళు కూడా ఇదంతా అయిపోయిందని తెలుసుకుంటారు. మీరు ఎవరితో ఎంత అత్మీయంగా ఎంత ప్రమేయం కలిగి ఉన్నారు అనే దానితో పట్టింపు లేదు, అది జరిగినప్పుడు జరిగిపోయింది. -- ఆట ముగిసింది.

ఇప్పుడు చనిపోతున్నది మీ శత్రువయినా సరే ,మీరు అతనికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందచేయాలి.సాధారణంగా ప్రపంచంలో ప్రతిచోటా సంస్కృతి అనే దానితో సంబంధం లేకుండా, "ఇప్పుడు చనిపోతున్నది మీ శత్రువు అయినా, మీరు తగిన వాతావరణాన్ని సృష్టించి అతను ప్రశాంతంగా చనిపోయేలా చూడాలి. మీరు వికృతమైన పనులు చేయ కోడదు." మీరు అతన్ని యుద్ధంలో కాల్చిఉండవ చ్చు , కాని అతను చనిపోతున్నప్పుడు మీరు మీ టోపీని తీసో, లేక “ రాం రాం” అనో ఎదోవిధంగా మీకు తెలిసిన విధంగా గౌరవం ఇస్తారు. , మనిషి చనిపోతున్నప్పుడు ఆ క్షణంలో అంతా జరిగిపోయింది, ఆట ముగిసింది. ఇప్పుడు ఎదురెళ్ళ్డడంలో అర్థంలేదు.

అందువల్లనే చనిపోయినవారిని కూడా గౌరవంగా చూడకపోవటాన్ని మీరు గమనించినప్పుడు , మీలో ఏదో తెలియని వణుకు పుడుతుంది. మీరు ఒక శరీరాన్ని గౌరవంగా చూడాలని కాదు, అతను నెమ్మదిగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి. అతను ఎలా జీవించాడనేదానితో సంబంధం లేదు,. కనీసం చివరిది సక్రమంగా జరగాలి. ప్రతి మనిషికి అంతమాత్రం సంకల్పం ఉండాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు