#1 మీరు పడుకునే విధానాన్ని సరిచూసుకోండి

సద్గురు: మీరు పడుకునే విధానాన్ని గమనించండి. సామాన్యంగా గురక పెట్టేవారు వెల్లికలా పడుకుంటారు. మీరు పక్కకు ఒత్తిగిలి పడుకుంటే గురక తగ్గిపోవచ్చు. అంతేకాక మీ పొట్ట భాగాన్ని గట్టి పరుచుకుంటే ఈ గురక తగ్గిపోవచ్చు.

#2 నిద్రపోయే ముందు కొంచెం తేనె తీసుకోండి

మరో విషయం ఏంటంటే మీరు నిద్రపోయేముందు మీ నోట్లో నాలుగు చుక్కలు తేనె  వేసుకుంటే గురక తగ్గిపోవచ్చు.

#3 మీ ముక్కు దిబ్బడను తొలగించడానికి నెయ్యి వాడండి

 మీరు నిద్రించే ముందు ముక్కు నాళాన్ని శుభ్రం చేసుకోండి దానిని వీలైనంత శుభ్రం చేసుకుంటే కనీసం రాత్రి పండుకున్న వెంటనే గురక  రాదు. గురక ఇంకా మొండిగా తగ్గకుండా ఉంటే మీరు నేతిని వాడవచ్చు.

ఒకవేళ మీకు ముక్కు ఎప్పుడూ దిబ్బడతోనే ఉంటే, ఆ పరిస్థితి కేవలం మీ శ్వాస మీదనే కాక, అది మీ మొత్తం శరీర వ్యవస్ధ మీద అనేక దుష్ప్రభావాలు చూపుతుంది.

ఒక వారం పదిరోజులు, మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మీరు ముక్కు రంధ్రాల్లో గోరువెచ్చటి నెయ్యి చుక్కలు వేస్తే దాని ప్రభావం కొంత ఉంటుంది. అంతేకాక ముక్కు రంధ్రాలకు అది కాస్త లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. దానివల్ల మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు ముక్కు సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

మరో పద్ధతి ఏమిటంటే, ఈ రోజుల్లో మందుల షాపుల్లో సలైన్ ముక్కు స్ప్రేలు దొరుకుతున్నాయి. మీరు ముక్కులో దానితో స్ప్రే చేసుకోవడం వల్ల, అది మీ ముక్కు దిబ్బడను తగ్గించి, ముక్కుని శుభ్రం చేసి, గురకను కొంత వరకు తగ్గిస్తుంది.

ఒకవేళ మీకు ముక్కు ఎప్పుడూ దిబ్బడతోనే ఉంటే, ఆ పరిస్థితి కేవలం మీ శ్వాస మీదనే కాక, అది మీ మొత్తం శరీర వ్యవస్ధ మీద అనేక దుష్ప్రభావాలు చూపుతుంది. అందువల్ల మీ శ్వాస నాళాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే, మీ శరీరంలోని ద్రవాలు, ముఖ్యంగా తల భాగంలోని ద్రవాలు, అంత బ్యాలెన్స్ గా ఉంటాయి. వాటి మూలంగా అనేక విషయాలు నిర్ణయించబడతాయి. అవి మీ మెదడు పని చేసే విధానం, మీలో ఆరోగ్యంగా ఉన్నారనే భావన, మీలోని సమతుల్యత, మీ చురుకుదనం, మీ పంచేంద్రియాలలో చురుకుదనం, వీటి మీద ప్రభావం చూపుతుంది.

ఒకవేళ ముక్కుదిబ్బడ మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెడుతుంటే, మీరు ప్రయత్నించగల కొన్ని చిట్కాలు ఉన్నాయి.

#4 వేగంగా పరుగెత్తడం

 మీరు రోజూ ఐదు, పది నిమిషాలు వేగంగా పరుగెత్తండి. బయట కాకపోయినా ఒకే చోట నిలబడి నోరు మూసుకొని పరిగెత్తితే అది ముక్కుదిబ్బడ తగ్గిస్తుంది. 

#5 జలనేతి 

మీకు ముక్కుదిబ్బడ జటిల సమస్య అయితే, పైన చెప్పిన వాటివల్ల తగ్గకపోతే, జలనేతి అనే ఒక క్రియ ఉన్నది. దానికి ముందస్తు ప్రిపరేషన్ కావాలి. ఇది ఎంతోమంది నేర్పుతున్నా కూడా, ఊరినే ముక్కులో నీళ్ళు పోసుకోవటం అంత తెలివైన పని కాదు. ఈ క్రియ ఒక పద్ధతి ప్రకారం నేర్పాలి. అవసరమైతే మా ఈశా హఠ యోగా టీచర్లు మీకు నేర్పించ గలరు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు