వాస్తు విషయంలో ఎంతో మంది ఎన్నో విషయాలు చెబుతుంటారు. నిజానికి వాస్తు వలన ఈ రోజుల్లో ఏమైనా లాభముంటుందా? వాస్తు గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నలకు యోగి, మర్మజ్ఞుడు అయిన సద్గురు సమాధానమిస్తున్నారు..

ప్రశ్న: వాస్తు గురించి మీ అభిప్రాయం ఏమిటి సద్గురు..?

సద్గురు :  మీ భయం మిమ్మల్ని నియంత్రిస్తున్నప్పుడు మీరు దేని నుంచి అయినా శాస్త్రాన్ని కనుగొంటారు. పది సంవత్సరాల క్రితం మీకు వాస్తు గురించి ఏమైనా తెలుసా..? ప్రజలందరూ ఎంతో చక్కగా జీవించారు. కదూ..? మీరు మీ నాన్నగారికంటే, మీ తాతగారికంటే ఏమైనా మెరుగ్గా జీవిస్తున్నారా? ఇది ఎలా పనిచేస్తుంది..? వాస్తు అనేది ఒక సరళమైన కట్టడాలకి సంబంధించిన శాస్త్రం. మీరు ఒక చిన్న పల్లెటూరులో నివసిస్తున్నట్లైతే మీకు ఆర్కిటెక్ట్ అందుబాటులో ఉండరు.  మీకేమీ తెలియకుండా ఇల్లు కట్టాలి. ఒక పై కప్పు వెయ్యాలంటే, ఎలా వెయ్యాలీ అన్నది ఆర్ సీ సీ,  మెటల్ స్ట్రక్చర్స్ వచ్చేవరకూ ఒక పెద్ద సమస్యగా ఉండేది. పై కప్పు ఎలా వెయ్యాలీ అన్నది ఎప్పుడూ కూడా ఒక సమస్యగా ఉండేది. ఎందుకంటే మీరు వాడగలిగేది కేవలం చెక్కగాని, రాయిగాని అయి ఉండేది.

ఈ రోజున మీరు దీన్ని ఎలా తయారు చేశారంటే, మీ జీవితం ఎలా గడుస్తుందో, మీ వ్యాపారం ఎలా నడుస్తుందో  దీనిమీద ఆధారపడుతుంది అన్నట్లుగా చేస్తున్నారు.

ఇవి పరిమితమైన మోతాదులో మాత్రమే లభిస్తూ ఉండేవి, మీకు కేవలం ఒక ఐదు అడుగుల పొడుగు ఉన్న దుంగ మాత్రమే దొరికిందనుకోండి.. అప్పుడు మీరు ఏమి చేస్తారు.. మీ ఇల్లు కేవలం ఐదు అడుగుల వెడల్పుతో వంద అడుగుల పొడుగుతో నిర్మిస్తారు. అది ఒక గుహా లాగా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి చోట కనుక మీరు ఉంటే, శారీరికంగా, మానసికంగా మీకు అస్వస్థత కలిగినట్లు అనిపిస్తుంది. అందుకని  గ్రామీణ ప్రాంతాల వారి కోసం ఇలాంటి ఒక సరళమైన విధానాన్ని పలు ప్రాంతాలలో కనుగొన్నారు. మీరు కనుక కొండ ప్రాంతంలో నివసిస్తే ఒక రకమైన వాస్తూ, అదే చదునుగా ఉన్న ప్రాంతాలలో అయితే మరొకరకమైన వాస్తు. ఇది కేవలం కట్టడం పట్ల ఇస్తున్న సరళమైన సలహా.

ఈ రోజున మీరు దీన్ని ఎలా తయారు చేశారంటే, మీ జీవితం ఎలా గడుస్తుందో, మీ వ్యాపారం ఎలా నడుస్తుందో  దీనిమీద ఆధారపడుతుంది అన్నట్లుగా చేస్తున్నారు. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి నన్ను ఒకరు వారి ఇంటికి ఆహ్వానించారు. నన్ను ఎవరైనా భోజనానికి పిలిస్తే.. నేను కేవలం వారికి వంట బాగా వచ్చా..? లేదా..? -  అని చూస్తాను. ఒకవేళ వాళ్ళకి వంట బాగా వచ్చుననుకుంటే వెళ్తాను. నేను ఒకరి ఇంటికి భోజనానికి వెళ్ళాను. అది ఎంతో అందమైన ఇల్లు. 8-9 సంవత్సరాలు పాతదై ఉండవచ్చు. ఆ ఇంట్లో ఒక చిన్న తోట ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ తోటలో ఒక పొడుగ్గా ఒక స్తంభం లాంటి కాంక్రీట్ పునాది ఉంది. ఇది తోట మధ్యలో నిలుచుని ఉంది. అసహ్యంగా.. తోట మధ్యలో ఒక స్తంభం..!! ఇది నేను చూశాను. ఇది అసలు అక్కడ సరిగ్గా ఉన్నట్లు అనిపించలేదు. నేను ఆ ఇంటి ఆవిడని. “ఎందుకు ఇలా  పెట్టారు..?“ అని అడిగాను.

దానికి ఆవిడ కొద్దిగా సిగ్గు పడుతూ “దానిగురించి మాట్లాడాలి అనుకోలేదు.”  నేను “ఎందుకూ..? “  అన్నాను.  అప్పుడు ఆవిడ “లేదు, ఇది వాస్తు” అంది. నేను “ఏమి జరిగింది..?” అన్నాను. ఒక రోజున ఆమె స్నేహితులు ఒక వాస్తు తెలిసిన ఆయనని ఆమె ఇంటికి పంపించారు.  ఆయన అక్కడికి వచ్చాడు. ఆవిడ స్నేహితులు పంపించారు కాబట్టి, ఆవిడ ఆ వాస్తు ఆయనకి తలుపు తీసింది. ఆయన వచ్చి లోపల కూర్చున్నాడు. ఆయన పైకి.. కిందకి.. వెళ్ళి  ఎంతో అధికారంతో ఇంటిని చూసి ఇలా చెప్పాడు.. మీ ఇంట్లో వాయువ్యం మూల కంటే కూడా నైరుతి పొడుగ్గా ఉంది అని. ఈవిడకి ఇద్దరు కొడుకులు ఉన్నారు.  అతడు ఏమి చెప్పాడంటే, “ మీ పిల్లల్లో ఒకరు చనిపోతారు “ అని. ఆవిడ “ఇదంతా చెత్త..మీరు వెళ్లిపొండి” అంది. ఆయన తన విజిటింగ్ కార్డ్ అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఇది పని చేస్తుంది అన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన వెళ్లిపోయాడు.

ఒకసారి మీరు భయంలో ఉన్న తరువాత ఇక మీతో ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు.

ఈవిడ “ఇదంతా చెత్త” అని అనుకుంది. కానీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సరికే, వాళ్ళిద్దరినీ చూసే సరికే, ఏమి జరిగి ఉంటుందో మీకు తెలుసు. వాళ్ళు కొద్దిగా జారిపోబోయినా సరే.. ఆవిడ వాళ్ళల్లో ఎవరో ఒకరు చనిపోతారేమో అనుకోవడం మొదలు పెట్టింది.  ఒకవేళ పిల్లల్లో ఎవరైనా “నాకు ఇవాళ అన్నం తినబుద్ధి కావటం లేదు” అంటే, వాళ్ళారోజు రాత్రికి చనిపోతారేమో అన్న భయం పట్టుకుంది. ఇది ఆవిడ మీద ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. ఒక వారం రోజుల్లో ఆవిడ “వీళ్ళల్లో ఎవరో ఒకరు చనిపోతారేమో.”అని పిచ్చి పట్టినట్లుగా అయిపోయింది. ఆ తరువాత, ఆవిడ దగ్గర ఆయన విజిటింగ్ కార్డ్ ఉండడంతో, ఆయనకి ఫోన్ చేసి “సరే.. మీరు చెప్పినదాని గురించి మేము ఏమి చెయ్యవచ్చు.. దానికి ఎంత ఖర్చు అవుతుందీ”  అని అడిగింది.  ఆయన 50,000 రూపాయలు అని చెప్పారు. ఆవిడ.. లేదు.. నా దగ్గర అంత డబ్బు లేదు.. అని చెప్పి.. బేరమాడి.. బేరమాడి.. చివరకు దానిని 15,000 రూపాయలకు తెచ్చి, సరే.. పదిహేను వేల రూపాయలు ఇస్తాను.. వచ్చి నా పిల్లల్ని కాపాడమని అడిగింది.  సరే అనుకున్న రోజు ఆయన ఈ పొడవాటి దుంగతో వచ్చి.. దానిని ఇక్కడ నైరుతిలో పెట్టి, “ఇప్పుడు మీ నైరుతి మీ వాయువ్యం కంటే పొడవుగా ఉంది, మీ పిల్లలు సరిగ్గా ఉంటారు” అని చెప్పారు.

ఒకసారి మీరు భయంలో ఉన్న తరువాత ఇక మీతో ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు. నేను చాలామందిని చూసాను, వారు వారి బాత్రూముల్లో పడుకుంటూ ఉంటారు, బెడ్ రూముల్లో వంట చేస్తూ ఉంటారు. నిజం. నేను మీకు ఏమి చెప్తున్నానూ అంటే, మీరు నిజంగానే చనిపోవాలీ అన్నా సరే.. అది మానవుడిగా కొంత హుందాగా చెయ్యాలి కదూ..??!! మీరు బెడ్రూంలో పడుకుని చనిపోతే పరవా లేదు. కానీ బాత్ రూమ్ లో పడుకుని వంద ఏళ్ళు జీవిస్తే మాత్రం ఏం ఉపయోగం..?? కొంత ధైర్యంతో.. హుందాతనం తో మీరు జీవించాలి. అవునా కాదా..?

ప్రేమాశీస్సులతో,
సద్గురు