ప్రస్తుత సమాజంలోని చెడుకి కారణం మనిషి ఒక పరిధికి లోబడి పనులు చేయడమే. అలా కాకుండా ఇంకొద్ది లోతుగా తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించి పని చేస్తే, ఏ కోరిక చిన్నది/తక్కువది కాదు. దాని ఫలితం వ్యక్తి పైనే కాక సమాజం మీద కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఇలా ఒక సార్వజనీన స్వప్నం కోసం పనిచేస్తాడో, అప్పుడు ఆ పని/ కోరిక వేరే ఎవ్వరి ఆలోచలనలకి, కోరికలకు భిన్నంగా ఉండదు. కారణం - ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సు కొరకే పని చేస్తారు కానీ ఇక్కడ గుర్తించవలసినది ఏమిటంటే సమాజం యొక్క నిర్వచనం ఏమిటి? కొందరికి తాము మాత్రమే సమాజం. ఇంకొందరికి తాను, తన కుటుంబం. మరి కొందరికి తన కులము, మతము కూడా. వేరొకరికి తన దేశం.  అంటే, తేడా కేవలం మనిషి యొక్క ఆలోచన పరిధికి సంబంధించినదే.

కోరిక అనేది సమస్యగా మారడానికి కారణం అది వ్యక్తిగతం కావడమే.
చాలా సార్లు ఒక వ్యక్తి అభిలాష మరొకరి అభిలాషకి వ్యతిరేకం కావొచ్చు, దానివల్ల బేధాభిప్రాయాలు కలగవచ్చు. పర్యవసానంగ వ్యక్తికి మరియు సమాజానికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మనిషి, తన వ్యక్తిగత అభిలాషకు అనుగుణంగా కాక మొత్తం సమాజ హితానికై పని చేస్తే, అప్పుడు ఏ పని స్వార్థ పూరితం కాదు. మనం ఇంతకు ముందు అనుకున్నట్టు, ప్రతి మనిషి హితాన్నే కోరుతున్నాడు. అలాంటప్పుడు దాన్ని ఒక చిన్న పరిధికి కుదించకుండా విశ్వవ్యాప్తం చేస్తే? ఎందుకు మనిషి తన కోరికలను కూడా చిన్న చట్రంలో బంధించాలి? నేను బాగుండాలి అనుకునే బదులుగా మొత్తం ప్రపంచం బాగుండాలి అనుకుంటే? మనిషి కోరిక ఏదైనా అది కేవలం తనకు మాత్రమే అని కాక సకల జీవ రాశికి సంబంధించినది అయితే ఇక ఆ కోరికకు హెచ్చు తగ్గులే ఉండవు. అన్ని గొప్ప కలలే / కొరికలే. కోరిక అనేది సమస్యగా మారడానికి కారణం అది వ్యక్తిగతం కావడమే. ఆ కోరికనే గనక మనిషి విస్తరించగలిగితే అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు దారితీస్తుంది. అదే మన విముక్తికి బాట వేస్తుంది. ప్రస్తుతం కోరిక మనల్ని బంధిస్తుంది, ఎందుకంటే దాని పరిధిని మనం చిన్నగా ఉంచాం, దాని పరిధిని విస్తరిస్తే చాలు మనం అన్ని బంధాల నుంచి విముక్తి పొందుతాము.

ప్రేమాశీస్సులతో,
సద్గురు