సమాజానికి మీరు ఆనందంగా ఉన్నారో లేదో ఎందుకు తెలియాలి? అది మీ అంతర్గత అనుభవం. మీరు మీ ఆనందాన్ని ఒక భావంలా వ్యక్తీకరిస్తూ ఉంటే, ఉదాహరణకి ఎప్పుడూ నవ్వుతూ ఉంటే, అప్పుడు ఎవరైనా మీ తల మీద మొట్టికాయ వేసి, ‘ఇక నవ్వు ఆపు, సరేనా?’ అని అనవచ్చు. ఎవరైనా ఏదో బాధలో ఉన్నప్పుడు మీరు నవ్వుతూ ఉంటే, మీరు మళ్ళీ తిరిగి నవ్వకుండా వారు మీ ముఖాన్నిబద్దలకొట్టవచ్చు కూడా.మీకు అటువంటి సమస్యలేమి లేకపోతే, అంటే మీరు ఎలాంటి పరిస్దితిలో ఎలా ఉండాలో అలా ఉండి, మీలో మీరు మాత్రం ఆనందంగా ఉంటే, సమాజానికి దానితో అసలు సంబంధం ఏమిటి? మీ ఆనందం ఒక రూపంలో వ్యక్తీకరించబడినప్పుడే, అది సమస్య అవుతుంది. మీ భావవ్యక్తీకరణ నిర్భందంగా కాక, స్పృహతో జరుగుతుంటే, మీరు అవసరాన్ని బట్టి అత్యంత గంభీరంగా ఉండి కూడా, లోపల చాలా ఆనందంగా ఉండవచ్చు.

ఆనందం ఉండటం ఒక చర్య కాదు; ఆనందం ఎటువంటి భావవ్యక్తీకరణనూ కోరుకోవడం లేదని మీరు అర్ధం చేసుకోవాలి. మీరు కొన్ని భావవ్యక్తీకరణలను ఎంచుకున్నారు. ఎందుకంటే మీరు ఆ భావవ్యక్తీకరణలతో మీ ఆనందాన్ని గుర్తిస్తున్నారు. ఎలా అయితే మీరు కొన్ని చర్యలు ఆనందాన్ని కలిగిస్తాయని అనుకుంటున్నారో, అలాగే ఆనందం కూడా ఒక ప్రత్యేక విధానంలో వ్యక్తీకరణ అవుతుందని అనుకుంటున్నారు. కానీ అది అలా కావాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉందో అలా, సందర్భానుసారంగా వ్యక్తం కాగలదు.

ఆనందంగా ఉండటం అంటే,  ఇక మీకు మీ స్వంత బలవంతాలేమీ ఉండవని అర్ధం. ఒకసారి మీకు మీ బలవంతాలేమీ లేకపోతే, సందర్భానుసారంగా ఉండటం మీకు కష్టమేమీ కాదు, అవునా,కాదా?

ఆనందంగా ఉండటం అంటే,  ఇక మీకు మీ స్వంత బలవంతాలేమీ ఉండవని అర్ధం. ఒకసారి మీకు మీ బలవంతాలేమీ లేకపోతే, సందర్భానుసారంగా ఉండటం మీకు కష్టమేమీ కాదు, అవునా,కాదా? ఇప్పుడు ఇక్కడ అందరూ సంతాపంతో ఉంటే, మీరు అందరి కన్నా ఎక్కువగా సంతాపంతో ఉండవచ్చు, కానీ దాని ప్రభావం మీ మీద ఏ మాత్రం పడదు.

మీలో ఎటువంటి కోల్పోయిన భావనా ఉండదు, అయినప్పటికీ మీరు సంతాప సమయాన్ని ఇతరుల కన్నా హుందాగా పూర్తిచేయవచ్చు. మీకు ఆనందం ఇచ్చే స్వతంత్రం అది. అది అన్ని బలవంతాలను తొలిగిస్తుంది. అన్ని బలవంతాలకు ఆధారం బాధే. ఇది మీరు గమనించండి. మీరు బాధగా ఉండటానికి భయపడతారు కాబట్టి, మీరు ఒక ప్రత్యేకమైన విధానంలో ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు ఒక పద్ధతిలో తినవలసి ఉంటుంది, పనులు ఒక పద్ధతిలో చేయవలసి ఉంటుంది, ఒక పద్ధతిలో ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అలా  చేయపోతే, మీకు బాధ కలుగుతుందని మీ భయం.

ఒకసారి ఆ అవకాశాన్ని, అంటే మీకు బాధ కలుగుతుందనే భయాన్ని తీసివేస్తే, మీరు సందర్భానుసారంగా ఎలాగైనా ఉండవచ్చు. ఎందుకంటే మీలో ఏ బలవంతం ఉండదు. అదీ ఎందుకంటే మీకు, మీరు మీ ఆనందాన్ని కోల్పోతారన్న భయం ఉండదు. అలాంటప్పుడు, సమాజం మీ ఆనందానికి వ్యతిరేకంగా ఎందుకు  ఉంటుంది?

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.