మనిషి ఉన్నతికి ఉపకరించే 5 సూత్రాలు
ArticleOct 21, 2016
రండి..! మానవ అభివృద్ధికి ఉపయోగపడే సూత్రాలను తెలుసుకుందాం..!
- మానవులు తమగురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ జరిగే దానిలో మనం ఒక చిన్న అంశం మాత్రమే.
- ఏమి జరిగినా, మీరు కృంగి పోవడం పరిష్కారం కాదు. మీరు కృంగి పోవడమే మరో సమస్య అవుతుంది.
- ఎక్కువ సమయం మీరు కేవలం జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు, జీవించరు.
- మీరు పనినుంచి విరామాన్ని ఎందుకు కోరుకుంటున్నారో ఒకసారి చూసుకోవాలి. మీకు నిజంగా ఎంతో ముఖ్యమనిపిస్తున్న విషయాన్ని మీరు చేస్తోంటే, మీరు దాని నుంచి విరామాన్ని కోరుకుంటారా ?
- ఏది సాధ్యమో. ఏది అసాధ్యమో నిర్ణయించడం మీ వ్యవహారం కాదు. అది ప్రకృతి నిర్ణయిస్తుంది. మీకు నిజంగా ఏది ముఖ్యమో దానికై కృషి చేయడమే మీ పని.