ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి ఇంకా మహా అన్నదానానికి సహకారం అందించండి.
ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి ఇంకా మహా అన్నదానానికి సహకారం అందించండి.
ఈశా యోగా కేంద్రంలో జరిగే మహాశివరాత్రి వేడుకకు హాజరయ్యే వేలాది మంది భక్తులకు, రాత్రి పొడుగునా జరిగే సంబరాల సమయంలో, మహా అన్నదానం అందిస్తారు. ఇది కేవలం భౌతిక పోషణ అందించడం మాత్రమే కాదు; ఇది ఇష్టంతో వాలంటీర్లు స్వయంగా తమ చేతులతో అందించే ప్రసాద పంపిణీ. 8 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో కూడా ప్రతిరోజూ అన్నదానం అందించబడుతుంది.
ప్రతి సంవత్సరం, ఈశా యోగా కేంద్రంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు వేలాది మంది ప్రజలు హాజరవుతారు. ఈ రాత్రి అందించే అనుభూతిని అందరికీ పంచడం కోసం, ప్రజలకు చేరువ కావడానికి ఇంకా వారిని ఆహ్వానించడానికి, ప్రింట్ ఇంకా సామాజిక మాధ్యమాల ద్వారా, వేడుకకు ముందు భారీ స్థాయి కృషి జరుగుతుంది. ఈశా యోగా కేంద్రంలో జరిగే మహాశివరాత్రి ప్రత్యక్ష ప్రసారం అనేక ప్రముఖ టెలివిజన్ ఛానెళ్లలో ఇంకా వెబ్‌లో అందుబాటులో ఉంటుంది. సౌకర్యాలు, వెసులుబాటులు ఇంకా ఇతర సౌలభ్యాలు కల్పించడం ద్వారా భక్తులు ఈ రాత్రి యొక్క అపారమైన అవకాశాలను అనుభూతి చెందేలా ఏర్పాట్లు చేయబడతాయి.