సద్గురు: యవ్వనం ఒక అనంత శక్తి కలిగిన సమయం.మన యవ్వనంలో మనకి ఇంకాస్త Balance Clarity ఉండుంటే ...ప్చ్..... ఎన్ని విషయాలు? ఎన్ని విషయాలు జరిగి ఉండేవి? ఎన్ని విషయాలు జరగకుండా ఉండేవో? ఎందుకంటే నేను ఎప్పుడూ వింటూ ఉంటాను.”సద్గురు నేను మిమ్మల్ని ఇరవై ఐదేళ్ళ పయసులో కలిసుంటే,నేను ఎన్ని చేసి ఉండేవాణ్నో అని.అందువల్ల మేము యువతని కలుసుకుని...వాళ్ళని సత్యానికి ఎంత దగ్గరగా తేగలమో చూస్తున్నాం. ఇవి భలే కబుర్లు తెలుసా..

ప్రాచీన కాలం నించీ, ఎవరైనా ఏ విషయం గురించైనా నిజం తెలుసుకోవాలనుకున్నప్పుడు, పుకార్లను, కబుర్లను నమ్మేవారు.!!!. పేపర్లో ఒక వార్తొస్తే అది నమ్మరు, ఇరుగు పోరుగుని అడిగి వాళ్ళు చెప్పిందే నిజం అవుతుంది.అందుకే పుకార్లే నిజమై కూర్చుంటాయ్ సువార్తలు కాదు, మరీ సీరియస్ గా ఉంటుంది.

అందుకే పుకార్లు నమ్మేవారు.పుకారు చిలవలు-పలవలు ఔతుంది, పెరుగుతుంది, మారుతుంది – కానీ మనుషులకి తెలుసు దాన్ని ఎలా వినాలో ఎలా వడ కట్టాలో నిజం ఎలా రాబట్టాలో తెలీదా?.ఇప్పుడు సోషల్ మీడియావల్ల పుకార్లు ప్రపంచవ్యాప్తం అయ్యాయి.(కొందరి నవ్వు), అదిప్పుడు ప్రాంతీయం కాదు.అందుకే దీన్ని తర్వాతి మెట్టుకి తీసుకెళ్దాం అనుకుంటున్నా.మీరు ఒక మార్మికుడితో ఊసులాడితే  అది విశ్వవ్యాప్తం ఔతుంది.

ఇదింతే, ఇదొక్కటే అనేదేది ఇక్కడుండదు.ఇలా ఎందుకంటే, మనుషులకి నిజమంటే ఒక్కటే అనే అబిప్రాయం. దీన్ని మార్చాలనుకుంటున్నాం –సత్యం ఒకే ఒక్కటి కాదు.సత్యం ఎన్నో రకాలుగా ఉంటుంది.మీకు తెలిసిన సత్యానికి మూలమేంటి అనేదే ప్రశ్న. మీరు దాన్ని ఎలా అనుభవిస్తారు? దీన్ని సూర్యాస్తమయం చూస్తూ అనుభావిస్తారా ?పున్నమి చంద్రుణ్ణి చూస్తూ అనుభావిస్తారా ? ప్రేమతో అనుభావిస్తారా?కరుణతో, సేవతో నా లేక ఈ జీవితాన్నే సత్యానికి మూలం చేస్తారా?.మీరు సూర్యాస్తమయాన్ని, చంద్రోదయాన్ని నమ్మితే,  ఒకటి రోజుకి ఒకసారే జరుగుతుంది.చంద్రుడి విషయంలో అది నెలకోసారి జరుగుతుంది.మీ జీవితం ఏంటి అనేదే మీ సత్యానికి మూలం.ఇప్పుడా సత్యం మీ జీవితంలోని ప్రతి క్షణం మీతో ఉంటుంది.

ఇదే సందర్భంలో మేము "Youth And Truth" మొదలెడతాం.