సద్గురు: దురదృష్టవశాత్తు కొంతమంది ప్రజలు దేశంలో చర్చను ప్రారంభించారు..జాతీయ గీతం ఆలాపించేటప్పుడు మీరు నిలబడాలా లేదా అని... దీనికి కారణం దేశభక్తి ఉండటం లేదా లేకపోవడం కాదు. అసలు విషయం..వాళ్ళకు ఒక చేతిలో పాప్ కార్న్ ఉంది.. మరొక చేతిలో కోకా కోలా ఉంది..అందుకే వాళ్ళు నిలబడలేకపోతున్నారు. నేననేది.. ప్రజలు బద్ధకస్తులుగా మారడానికి కారణం...వారే ప్రతికూల పరిస్థితులని ఎదుర్కోక పోవడమే.

అలాంటి పరిస్ధితులు ఎదురవలేదంటే...ధైర్యవంతులైన జవాన్లు సరిహద్దుల్లో కాపలాకాస్తున్నారు కాబట్టి, దేశ ప్రజలుగా మనం మర్చిపోకూడనిది ఏంటంటే, వేలాది సంవత్సరాలుగా మనం ఆనేక  ఆక్రమణలకు గురయ్యాము. మన ప్రజలు ఎలాంటి భయంకర సంఘలనలు చవిచూశారో దురద్రుష్టవశాత్తూ వాటిని మన చరిత్రలో రాయలేదు, మన సినిమాల్లో చూపించడం లేదు.

ఒక దేశం ఎన్నో విధాల్లో నిర్మించబడుతుంది. కాని దేశ నిర్మాణం జరగవలసిన అతి ముఖ్యమైన చోటు.. ప్రజల మనసులలో, హృదయాలలో.., కానీ దురద్రుష్టవశాత్తూ మనం ఈ పని చేయలేదు. నేడు కూడా, ప్రజలు తమ కులం, మతం, వాళ్ళ జాతి మూలం వంటి వాటితో గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు. దేశం అనేది గొప్ప గుర్తింపు. నెమ్మదిగా యువ తరంలో ఇది చాలా వరకు మెరుగుపడుతోంది. కానీ మీరు పాత తరంలో చూస్తే, గ్రామీణ ప్రాంతంలో, వాళ్ళకు బలమైన జాతీయ భావం ఉండటం లేదు.

జాతీయ భావం చాలా చిన్న వయస్సులోనే కలగాలి. ఈ దేశంలో పుట్టడాన్ని గర్వంగా భావించాలి. లేకపోతే ఈ దేశం కోసం ఎవరు జీవిస్తారు, ఈ దేశం కోసం ఎవరు పోరాడతారు, ఈ దేశం కోసం ప్రాణాలివ్వడానికి ఎవరొస్తారు? భావోద్వేగాలు ఉండాలి... ఒక న్యూస్ యాంకర్ నన్ను ఇలా అడిగారు.. ‘‘సినిమాకు వెళ్ళినప్పుడు అందరం నిలబడటం ఏమిటి, ఈ భావోద్వేగం అంతా అవసరమా? అని. అప్పుడు నేను తనని ఒక ప్రశ్న వేసాను. ‘‘మీకు కుటుంబం ఉందా’’? ‘‘ఉంది’’ అన్నాడు. నేను ‘‘మీలో భావోద్వేగాలు లేకపోతే, మీరు మీ కుటుంబాన్ని నిర్మించి, నిర్వహించగలరని అనుకుంటున్నారా?’’. అతను.. ‘‘లేదు’’. ‘‘ప్రయత్నించి చూడండి. మీ భార్యతో ప్రయత్నించండి. ఏ భావన లేకుండా.. భోజనం పెట్టి, చూసుకోండి... భావోద్వేగం ఉండకూడదు.. ఎంత కాలం కొనసాగుతుందో చూద్దాం?’’ నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాన్ని నిర్మించాలన్నా కూడా, మీరు మీ భావోద్వేగాలన్నిటినీ ఉపయోగించాలి. అలాంటిది ఒక దేశాన్ని నిర్మించడానికి, భావోద్వేగం లేకపోతే, దేశాన్ని ఎలా నిర్మిస్తారు? ఇది ఎలా సాధ్యం? దేశం అనేది మన భావోద్వేగంలో మాత్రమే ఉంది. ఎక్కడా ఉండదు. మనం దీని గురించి ఎలాంటి అనుభూతి చెందుతామన్నదే ప్రశ్న. ఈ దిశలో ఇప్పటి వరకు చెప్పుకోదగిన విధంగా మనం దృష్టి సారించలేదు...అది చేయాలి. 

నేను ఆర్మి జనరల్ని.. ఆర్మీకి చెందిన ఒక వీడియోను ఇవ్వవమని అడుగుతున్నాను. మేము ఇప్పటికే దీనిగురించి మన విద్యార్థులతో మాట్లాడుతున్నాం.. మేము నాలుగున్నర వేల ప్రభుత్వ స్కూళ్ళల్లో మేము పని చేస్తున్నాము.. మేము ఆర్మీ వీడియోలను ప్రదర్శిస్తాము.

ప్రశ్న : ఇండియన్ ఆర్మీ రాజకీయాలకు అతీతనమైన, లౌకికవాద సంస్థ. అనేక సంవత్సరాలుగా వాళ్ళు పక్షపాత రహితంగా పనిచేస్తున్నారు, రాజ్యాంగానికి కట్టుబడి..అలాగే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సిద్ధాంతాలను అమలుచేస్తున్నారు. నేటి సోషల్ మీడియా ఇంతగా పెరిగిపోయిన ఈ తరుణంలో, ఆర్మీ తన విలువలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలంటారా?

సద్గురు: సోషల్ మీడియాలో జరుగుతున్న చెత్త గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో, ఎవరో ఒకరు.. ఏ విషయం గురించైనా చెప్పచ్చు. మీ గురించి కాదు.. నా గురించి కూడా. మనిషి చేయగలవి, చేయలేనివి చేసారని మిమ్మల్ని నిందిస్తారు.. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు. కానీ వాళ్ళు మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తున్నారు. మీ జీవితం గురించి మీకు కూడా తెలియని విషయాలను వాళ్ళు చెబుతారు. కాబట్టి, సోషల్ మీడియా విషయంలో మనం కొంత పరిపక్వతని చూపించాలి.. దేన్ని విస్మరించాలో, దేనికి విలువ ఇవ్వాలో తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది నామరహిత మీడియా. ప్రతీ బుద్ధి లేని వ్యక్తీ, తమ రాతల వల్ల ఎలాంటి దుష్ఫరిణామాలు కలుగుతాయో తెలియకుండా రాస్తారు.. సాయుధ బలగాల గురించి కూడా... కాబట్టి మీరు సోషల్ మీడియా గురించి ఆలోచించకండి. కానీ, కొంత ప్రభావం కలిగిన రాజకీయ పార్టీలు... సాయుధ దళాల విషయంలో సరైన రీతిలో వ్యవహరించాల్సి ఉంది... ఇటీవల కాలంలో, అంటే గత ఆరు నుంచి పన్నెండు నెలల్లో, కొంతమంది రాజకీయ నాయకులు చేసిన కొన్ని ప్రకటనలు ఆమోదయోగ్యం కావు.

నేను దీని గురించి కొంతమందితో మాట్లాడాను..దీనికి విరుద్ధంగా చట్టం రావాలి. అసలు అవసరంలేని విషయాలు ప్రస్తావించారు..  నేను వ్యక్తుల గురించి చెప్పను, కానీ నేను చెప్పదలచుకున్నది, భారతదేశంలో కొంత పరివర్తన జరుగుతోంది.. ప్రత్యేకించి రాజకీయ పరివర్తన. ఆర్థికంగా, మనం సరైన మార్గంలో ఉన్నాము. ప్రపంచం కూడా ఇదే చెబుతోంది. అయితే దేశం సరైన మార్గంలో వెళ్ళడం లేదని కొంతమంది పదే పదే అంటున్నారు. ప్రతికూల ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఇదే మీరు చూసేది. మీరీ విషయాలపై ద్రుష్టిపెట్టాల్సిన పని లేదు. వీళ్ళల్లో కొందరు వచ్చే అయిదు పదేళ్ళలో మనుగడ సాగించలేరు. కొత్త తరం అభివ్రుద్ధిని కోరుకుంటోంది. నవ తరం ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేరాలనుకుంటున్నారు. కాబట్టి విలువలకు కట్టుబడని వారు దేశంలో జీవించలేరు. తప్పకుండా అదే దిశలో వెళ్తున్నాం. ఇది పరివర్తన సమయం.. మనుగడ కోసం అనేక మంది పోరాడుతున్నారు. కాబట్టి మీరు చాలా తప్పుడు భాష, అర్ధంలేని మాటలు వింటారు. మనం కొంత కాలం పాటు దీన్ని సహించాల్సి ఉంటుంది.

దురద్రు:ష్టవశాత్తూ సాయుధ దళాలు చర్య తీసుకున్నప్పుడు, వాళ్ళపై రాళ్ళు విసురుతున్నారు. దీన్ని అస్సలు అంగీకరించలేము. మనం దీన్ని ఆమోదిస్తే, మనం జాతీయ ప్రాథమిక సూత్రాలను లాగేసినట్లే, వాటిని తీసుకున్నట్లే, అందరూ అర్ధం చేసుకుంటున్నారో లేదో గాని..మనం నిర్మించుకున్న ఈ దేశం యొక్క పునాది రాళ్ళను కదిలిస్తున్నాం. దేశం కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే..అతనిపై మీరు దాడి చేస్తున్నారు. అది రాయి, పిన్ లేదా బుల్లెట్ ఏదైనా కావచ్చు. అతనిపై దాడి చేయాలన్న ఆలోచనే.. భారతదేశపు పునాది రాళ్ళను దెబ్బతీస్తుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి, నా మనసులో ఇంకో ఆలోచనే లేదు.