తన జీవితంలోని వివిధ దశల్లో జరిగిన సంఘటనల్లో సంపంగి పువ్వు ఎటువంటి ప్రాముఖ్యతని చోటు చేసుకుందో సద్గురు వివరిస్తున్నారు.

Sadhguruనా జీవితంలో నాకు సంపంగి పువ్వుతో ఒక వింత సంబంధం ఉంది. దీనిని తమిళంలో ‘షెన్బగం’ అంటారు. పసుపుపచ్చగా ఉంటుంది. కొన్నిచోట్ల అది కాస్త ఎర్రగా కూడా ఉంటుంది. చాలా ఘాటైన వాసన. ఒక్కొక్కసారి మత్తెక్కించేస్తుంది. ఇంట్లో కొన్ని పువ్వులు పెట్టుకుంటే మీకు తల దిమ్ముగా ఉంటుంది. మా అమ్మకు సంపంగి పువ్వంటే ఎంతో ఇష్టం. ఈ పూలు పూసే రుతువులో మాయింట్లో ఎప్పుడూ కనీసం ఒక్క పువ్వైనా ఉండేది.

విజ్జీ, నేను ఆశ్రమానికి రాకపూర్వం పన్నెండేళ్లపాటు సంచార జీవుల్లాగా తిరిగాం. మేము ఇల్లు చేరుకున్న తర్వాత సంపంగి చెట్టు వేసే బాధ్యతను తానే తీసుకుంది. “ఇది మీ అమ్మకు ఇష్టమైన పువ్వు. మన ఇంట్లో మొదటి మొక్కగా ఇదే ఉండాలి” అన్నది. ఏడెనిమిది నెలల తర్వాత మొక్క పెరిగింది. కాని పూవు పూయలేదు. కాని పౌర్ణమి నాటి ఉదయం ఒక పువ్వు పూసింది. దీన్ని కోసి అమ్మ పటం ముందు పెడతానంది. నేనన్నాను, “వద్దు, దాన్ని చెట్టుమీదే ఉండనీ, అది తొలి పుష్పం”. పౌర్ణమినాడు తొలిపూవు పూసిందని ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. అదే రాత్రిన తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది, ఆ విధంగానే వెళ్ళిపోయింది.

సాధారణంగా సంపంగి చెట్టు జీవిత ప్రమాణం అంత ఎక్కువగా ఉండదు. కాని ఈ చెట్టు వయస్సు 6,000 సంవత్సరాలనీ, అగస్త్యముని దీన్ని నాటాడనీ చెప్తారు.

నాకు ఈ సంపంగితో ఎన్నో సంఘటనలు ముడివేసుకుపోయి ఉన్నాయి. ‘బిలిగిరి రంగనబెట్ట’ అని కర్ణాటకలో ఒక గుట్ట ఉంది. ‘బిఆర్ హిల్స్’ అంటారు. ప్రకృతికి, ఆటవిక జీవజాలానికి సంబంధించి అద్భుతమైన స్థలం. నాకీ గుట్టతో ఒకవిధమైన సంబంధం ఉంది. నా చిన్నతనంలో సైకిలు మీద ఈ గుట్టల్లో తిరిగేవాడిని. అక్కడ నడిచేవాణ్ణి. రాత్రిపూట అక్కడే ఉండేవాడిని. ఏనుగులు, దున్నపోతులు, పులులు, ఎలుగుబంట్లతో భయంకరంగా ఉండేది. ఒకానొక సమయంలో వీరప్పన్ కూడా ఈ చోటు ఎంచుకున్నాడు. బిఆర్‌హిల్స్‌లో ‘దొడ్డ సంపంగె’ అని ఒక చోటు ఉంది. అంటే పెద్ద సంపంగి అని అర్థం. వయస్సుతో పాటు ఆ సంపంగి చెట్టు గజిబిజిగా అల్లుకుపోయింది. విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా సంపంగి చెట్టు జీవిత ప్రమాణం అంత ఎక్కువగా ఉండదు. కాని ఈ చెట్టు వయస్సు 6,000 సంవత్సరాలనీ, అగస్త్యముని దీన్ని నాటాడనీ చెప్తారు. 6,000 సంవత్సరాల కిందట ఆయన ఇక్కడ ధ్యానం చేశాడు. ఈ చెట్టును ఆశీర్వదించాడు అన్నది గాథ.

ఎందుకో నాకూ, సంపంగి చెట్టుకూ మధ్య ఎన్నో సంఘటనలు జరిగాయి. నేనీ చెట్టుతో కొంత ప్రేమలో పడ్డాను.

ప్రేమాశీస్సులతో,
సద్గురు