వేప - ఓ అసమానమైన వృక్షం

 

వేప ఓ అసమానమైన వృక్షం. ఇది అన్ని ప్రదేశాల్లోనూ పెరగదు, స్వతహాగా భరతఖండంలోనే విరివిగా పెరుగుతుంది, బహుశా ప్రపంచంలోని మిగితా ప్రాంతాల్లో దీని ఎదుగుదలకు కావలసిన సరైన వాతావరణం లేకపోవడం వలన అక్కడ పెరగదేమో... ఇది కేవలం భరతఖండంలోనే విరివిగా పెరుగుతుంది, మీరొక వేపాకుని తీసుకుని చూస్తే దానిలో దాదాపు 130 కి పైగా వివిధ రకాల రసాయన ఆకృతులున్నాయి. ప్రపంచంలో, అన్నిఆకుల్లోకెల్లా ఇది అతి సంక్లిష్టమైనది. మీ శరీరాన్ని పలు విధాలుగా లాభాలను గ్రహించడానికి సంసిద్ధం చేస్తుంది.  

కాన్సర్ నివారణకు ఉపకరిస్తుంది

కాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే వేపముద్దను మింగిస్తారు.

వేపలో ఉన్న అత్యద్భుత లాభాల్లో ఒకటి – కాన్సర్ కణాలను వధించడం. మనందరిలోనూ కాన్సర్ కణాలుంటాయి, కాకపొతే అవి శరీరంలో చెల్లా చెదరుగా ఉంటాయి, అవి మీ శరీరంలో సరైన పరిస్థితులకోసం పొంచి చూస్తూ ఉంటాయి, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అవి రంగంలోకి దిగి తాము సంఘటితమౌతాయి. ఇదెలా అంటే ఏదైనా నేరం/ దోపిడీ చేసేముందు, దుండగులు ఎలా సమావేశామౌతారో అలాగన్నమాట ! అయితే వేప ఈ దుండగులని సంఘటిత కానీయకుండా , చెదర గొడుతుంది, రోజూ కొన్ని కాన్సర్  కణాలని హతమారుస్తూ ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే వేప ఈ కాన్సర్ కణాలను వృద్ధి చెందనీయదు, వాటి సంఖ్యను ఒక పరిమితిలో ఉంచుతుంది. కాన్సర్  కణాలు, అంత తక్కువగా ఉంటే ఇక నిశ్శక్తులై మిమ్మల్ని ఏమీ చేయలేవు . అందుకే ప్రతి నిత్యం వేపాకు తీసుకోవడం అత్యవసరం.  కాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే వేపముద్దను మింగిస్తారు.

అంటి-బ్యాకటిరియల్ గా పనిచేస్తుంది

1neem

మీ పెద్దపేగు అన్ని ఇన్ఫెక్షన్లకీ దూరంగా ఉంటుంది

మీకు తెలుసా , మీ శరీర బరువులో 52% మీలో ఉన్న బాక్టీరియాలదే! అంటే మీకు తెలియకుండానే , మీ ప్రమేయం లేకుండానే , మీలోపల ఇన్ని జీవులు జీవిస్తున్నాయి! అయితే వీటిలో కొన్ని బాక్టీరియాలు మనని వేధిస్తాయి, మరికొన్ని కొన్ని ఏంతో సహాయ పడతాయి, అవి లేకపోతే మనం బ్రతకలేము. కానీ కొన్ని ఎదో ఓ విధంగా మనల్ని వేధిస్తూనే ఉంటాయి. అందుకే ఈ వేప ముద్దని రోజూ తీసుకోవడం వల్ల, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బాక్టీరియాలని నాశనం చేస్తుంది. ఇలా చేసినప్పుడు మీ పెద్దపేగు ఇన్ఫెక్షన్లకీ దూరంగా ఉంటుంది , ఇదీ వేపలోని సుగుణం.

పెద్ద పేగును పరిశుభ్రంగా ఉంచుకోవడం ఏంతో ముఖ్యం, దీని ప్రభావం నేరుగా మీ శారీరిక, మానసిక ఆరోగ్యాల పై ఉంటుంది, మనుషులు  మలాన్నితమ వ్యవస్థ నుండి పూర్తిగా తరిమేస్తేనే వారి మానసిక ఆరోగ్యం ఇనుమడిస్తుంది. ఇదెలా పనిచేస్తుందో చూస్తే మనకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది!

ప్రతీ ఒక్కరికీ చర్మానికి సంబంధించి ఏవో, చిన్న చిన్న సమస్యలుంటూనే ఉంటాయి. మీ చెవుల వెనుక భాగంలో గానీ , కాళ్ళ వేళ్ళ మధ్యనగానీ ఇలా రాసి వాసన పీలిస్తే , కొద్దిగా వేరేగా ఉంటుంది.. అంటే ఈ భాగంలో బాక్టీరియా మిగితా చోట్ల కంటే చురుగ్గా పనిచేస్తున్నాయి. మీరిక్కడ వేపాకు నానపెట్టిన నీళ్ళను పోస్తే , శుభ్ర మౌతుంది లేదా వేపతో స్నానం చేయండి చాలు. వేప లేహ్యం/ ముద్ద వంటికి పట్టించి కాస్సేపుంచి స్నానం చేస్తే ఇక మీకు సబ్బుల అవసరం ఉండదు , చర్మం పైనున్న బాక్టీరియాని హత మారుస్తుంది, ఇది సబ్బుల కంటే ఏంతో శ్రేష్ఠమైనది , దాని పీచుతో చర్మం శుభ్రమౌతుంది. ఇలా వీలుకాకపోతే వేపాకులను రాత్రంతా బకెట్ నీళ్ళల్లో నాననిచ్చి మర్నాడు వాటితో స్నానం చేయండి.  మీ శరీరానికి ఓ కాంతి , నిగారింపూ వస్తాయి!

హఠ యోగ సాధనకు ఉపయోగ పడుతుంది

2neem

వేప శరీరంలో ఉష్ణాన్ని పుట్టిస్తుంది

దేహంలో వివిధ లక్షణాలు ఉండచ్చు- ఇందులో ముఖ్యమైనవి రెండు ‘శీతం’ ‘ఉష్ణం’. మీ దేహం శీతం దిశగా ఉంటే, వంట్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. తేమ శాతం ఎక్కువైతే, జలుబు, సైనస్ ఇంకా ఇతర సమస్యలు రావచ్చు.

అన్నిటినీ మించి వేప శరీరంలో ఉష్ణాన్ని పుట్టిస్తుంది. ఈ ఉష్ణమే మీ శరీరంలో ఉద్భవించే శక్తిని తట్టుకోవడానికి మీకు తగినంత ఆలంబననిస్తుంది. ముఖ్యంగా ఓ హఠ యోగికి తన శరీరంలో ఉష్ణాన్ని కొంత హెచ్చు స్థాయిలో ఉంచుతుంది కాబట్టి అతనికిది ఎంతో అవసరం. ఉష్ణం అంటే మీకు అదనపు ఇంధనం లాంటిది. తెలియని కోణాల గురించి శోధిస్తున్న సాధకుడికి, మరి కాస్త  ఇంధనం ఉండడం సురక్షితమే కదా..ఒక  వేళ  మీ వ్యవస్థలో ఈ ఇంధనం అవసరమైతే వాడుకుంటారు. మీకు మీలోని ఈ ఉష్ణాన్ని, మాములు కంటే కొద్దిగా ఎక్కువగా ఉంచుకోవడం అవసరం. మీ శరీరంలో శీతం ఉంటే, మీరు ఎక్కువ పని చేయలేకపోతారు. అదే మీ శరీరాన్ని ఉష్ణం దిశగా అట్టిబెట్టుకుంటే, మీరు ప్రయాణం చేసినా, బయిట తినాల్సి వచ్చినా లేక మరేదైనా పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా సరే, మీ లోని ఈ అదనపు ఉష్ణం కరిగి మీకు ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. వేప ఇందుకు దోహద పడుతుంది.

జాగ్రత్త తీసుకోవలసిన విషయాలు

గర్భిణి స్త్రీలు, గర్భం దాల్చిన మొదటి 4- 5 నెలల పాటు వేపని తినకోడదు

గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, అధికంగా వేపను తీసుకుంటే ఇది వీర్య కణాలని హతమారుస్తుంది. గర్భిణి స్త్రీలు, గర్భం దాల్చిన మొదటి 4- 5 నెలల పాటు వేపని తినకోడదు.  వేప అండాశయానికి హాని కలిగించదు. కాని అధిక ఉష్ణాన్ని కలిగిస్తుంది. దీనివల్ల పిండం నిలవలేకపోయే ప్రమాదం ఉంది. స్త్రీలు, గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వేపని తినకోడదు. దీనివల్ల కలిగే అధిక ఉష్ణం వల్ల, మీ వ్యవస్థ పిండాన్ని విదేశీ శరీరంగా భావిస్తుంది.

ఇలా వేప తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు శరీరంలో మార్పులని పురుషులకంటే స్త్రీలే త్వరగా గమనిస్తారు, ఉష్ణం ఎక్కువైతే దాన్ని తగ్గించడానికి మార్గాలు చూడాలి, అంతేగానీ వేపాకు తీసుకోవడం మాత్రం మానకూడదు. ఎందుకంటే సాధన చేసేవారికి ఈ ఉష్ణం అవసరం. ఐతే కొంతమంది మహిళలలో ఈ వేప ఋతుచక్రాన్ని తొందరగా తీసుకుని వస్తుంది, ఇది కొంత మందికే జరగవచ్చు. అటువంటప్పుడు మీరు నీరు బాగా తాగాలి , ఇంకా అలాగే ఉంటే నీళ్ళల్లో కొంత నిమ్మరరసం పిండుకుని తాగండి, ఇది మీ శరీర ఉష్ణాన్నితగ్గించి, చలవ చేస్తుంది. ఇదీ సరిపోకపోతే ఓ గ్లాసు బూడిద గుమ్మిడి రసం తీసుకోండి, ఇది మీ ఉష్ణాన్ని వెంటనే తగ్గిస్తుంది. ఉష్ణాన్ని తగ్గించడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి , ఒక చుక్క ఆముదం మీ నాభిలో, అనాహత వద్ద, మరొకటి కంఠం వద్ద ఉన్న గుంటలో, చెవుల వెనుక భాగం లో అద్దితే, వెంటనే శరీరాన్ని శీతలం చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

 
 
 
 
Login / to join the conversation1
 
 
2 సంవత్సరాలు 2 నెలలు క్రితం

You've made some decent points there. I looked on the web for more info about the
issue and found most people will go along with your views on this site.