ఈ ప్రపంచంలో అన్నింటితో జీవిస్తూ కూడా ముక్తిని పొందడం సులభామేనా? దీనికి సద్గురు ఇచ్చిన సమాధానాన్ని ఈ వ్యాసంలో చదవండి.

ప్రశ్న: ఈ ప్రపంచంలో ఉంటూ ముక్తిని పొందవచ్చా..? ఈ ప్రపంచంలో అన్నింటి మధ్య సంసార జీవితంలో ఉంటూ..??

సద్గురు: ఎవరైనా సంసార జీవితంలో ఉంటూ, విముక్తులవ్వవచ్చా..? మీరు, జీవితం నుంచి ముక్తి పొందాలంటే, ఇది ఎంతో తేలిక. మిమ్మల్ని కాల్చేసామంటే.. మీరు జీవితం నుంచి ముక్తి పొందవచ్చు. ఇది ఎంతో తేలిక. కానీ, ఇప్పుడు మీరు జీవన్మరణ ప్రక్రియ నుంచి ముక్తి పొందాలి అనుకుంటే - అది వేరే విషయం. ఇదే మీలోని ఆకాంక్ష కూడానూ.  ఇది ఎందుకు వస్తోంది..?ఎందుకంటే, మీరు ఈ జీవితాన్ని భరించలేక పోతున్నారు కాబట్టి - మీరు ముక్తి గురించి ఆలోచిస్తున్నారు. కానీ, ఇది అలా పనిచేసే విషయం కాదు. మీరు జీవన ప్రక్రియని భరించలేక పోతున్నారు కాబట్టి మీరు ముక్తి గురించి ఆలోచిస్తే మీకు ఎప్పటికీ ముక్తి లభించదు. మీరు పరిపూర్ణంగా ఆనంద పారవశ్యంలో ఉంటే, మీర ఎంత ఆనంద పార్వశ్యంలో ఉండాలంటే, ఇప్పుడు మీరు ఎందులో కావాలంటే అందులో లయమై పోవడానికీ,  మరణించడానికీ కూడా సిద్ధంగా ఉంటే - అప్పుడు ముక్తి అన్నది సాధ్యం అవుతుంది. మీరు విచారంగా ఉంటూ మీ విచారం నుంచి పారిపోవడానికి, ఏదో ఒక దారి వెతుక్కోవాలనుకుంటే, అప్పుడు ముక్తి అన్నది ఎప్పటికీ లభించదు.  మీకు ఈ ఆకాంక్ష అన్నది ఒక బంధనం వల్ల కలుగుతున్నది. ఔనా..? కాదా..?

సాధకుడుఅవును.

సద్గురు: దురదృష్టవశాత్తూ, నిజం ఏమిటంటే  చాలామంది మనుషులకు, వారి జీవితంలో ఆపద అనేది వచ్చినప్పుడు మాత్రమే, పరిస్థితులు ఘోరంగా చెయ్యి దాటిపోయినప్పుడు మాత్రమే, వారు ఆధ్యాత్మికతను కాంక్షిస్తున్నారు.  అందుకు ఇది, సరైన సమయం కాదు. మీరు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడూ, మీరు చాలా చాలా సంతోషంగా ఉన్నప్పుడూ, మీ జీవితంలో ప్రతీదీ సరిగ్గా జరుగుతున్నప్పుడు మాత్రమే మీరు ముక్తిని కాంక్షించాలి. ముక్తిని కాంక్షించాల్సిన సమయం - అదే..!

ఈ  సృష్టితో  మీరు సంతోషంగా లేనప్పుడు, మీరు, దీనిని సృష్టించిన వారిని కలుసుకోవడం ఎందుకూ..?

కానీ చాలామంది మానవులకు ఇటువంటి తెలివి లేదు. జీవితం వాళ్ళకి మొట్టికాయ వేసినపుడే, వారికి తెలుసుకోవాలిన్న కాంక్ష కలుగుతుంది. ఈ గోతిలో నుంచి బయటికి రావడం ఎంతో కష్టమైనది. సరే..ఇదీ మంచి సమయమే..! ఏదో ఒక సమయం. కానీ ఇప్పుడు మీరు జీవితాన్ని భరించలేక ముక్తిని కోరుకుంటున్నారు. ఇది, అలా మీకు లభ్యం కాదు. ఇందువల్లనే మనం ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించి, పారవశ్యాన్ని గురించీ ఎందుకు మాట్లాడుతున్నాం.

ఇప్పుడు మీ మనస్సులో ఎంతో ఆహ్లాదంగా ఉంటే.. దానిని మనం ఆనందం అంటాం. అవునా..? మీ భావాలు ఎంతో హాయి గొలిపేవిగా ఉంటే, దానిని మనం ప్రేమ అంటాం. మీ శరీరంలో హాయి ఉంటే దానిని ఆరోగ్యం, సౌఖ్యం అని అంటాం.  మీ శక్తులు కనుక ఎంతో హాయిగా ఉంటే, మనం దానిని పారవశ్యం అని అంటాం. ముందర మీరు మీ శరీరాన్నీ,  మనస్సునీ, భావాలనీ, శక్తినీ హాయిగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఆ తరువాత, మీ ఉనికి ఎంతో హాయిగా ఉంటుంది.  ఇప్పుడు మీరుండే విధానం ఎంతో ఆనందంగా అనిపించి, ‘ఎవరు దీనిని సృష్టించారు..? నాకు తెలుసుకోవాలని ఉంది ‘ అని మీరు అనుకుంటే, అప్పుడు మీ ఆకాంక్ష సరియైనది.

ఈ  సృష్టితో  మీరు సంతోషంగా లేనప్పుడు, మీరు, దీనిని సృష్టించిన వారిని కలుసుకోవడం ఎందుకూ..?

మీరు విచారంలో ఉండి, దేవుడి కోసం కేకలు పెడితే, అది సరైనది కాదు. మీరు కేకలు పెట్టేది, ఒక ఫైర్ బ్రిగేడ్ కోసమే..! ఎవరో వచ్చి మీలో చెలరేగుతున్న ఈ అగ్నిని చల్లార్చాలి. అలా కాకుండా ఇప్పుడు మీరు ఎంతో పారవశ్యంతో ఉంటే,  మీ జీవితానుభూతి ఎంతో గొప్పగా ఉంటే, మీకు దీనిని ఎవరు సృష్టించారో తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఇది సరియైన ఆకాంక్ష. కానీ మీరు ఇప్పుడు ఈ సృష్టి వల్ల బాధపడుతున్నారు. మీరు, సృష్టికర్తని కలవాలనుకుంటున్నారు. ఈ  సృష్టితో  మీరు సంతోషంగా లేనప్పుడు, మీరు, దీనిని సృష్టించిన వారిని కలుసుకోవడం ఎందుకూ..? మీరెందుకు కలుసుకోవాలనుకుంటున్నారు..? మీరు, ఈ సృష్టిని ద్వేషిస్తే, ఈ సృష్టికర్తని ఇంకా ఎక్కువ ద్వేషిస్తారు కదా..?  ఔనా..?  కాదా..?

సాధకుడు:  ఔను.

సద్గురు: ఇప్పుడు మీ ప్రక్కన కూర్చున్న మనిషేనే మీరు ద్వేషించినప్పుడు, ఎవరైతే ఈ మనిషిని సృష్టించారో ఆయనని మరింతగా ద్వేషిస్తారు. ఔనా..? కాదా..?. ఒకవేళ మీరు ఈ సృష్టితో ప్రేమలో పడ్డారనుకోండి - మీ జీవితానుభూతి ఎంతో పారవశ్యతతో ఉన్నప్పుడు, మీరు, “సరే..! ఇదంతా ఎవరు సృష్టించారన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను” అని అనుకున్నప్పుడు, అది నిజాయితీగా నిజమైన అన్వేషణ. లేదంటే, అది కేవలం మీరు నిస్పృహతో చేస్తున్నదే..! ముక్తి, ఆ విధంగా మీకు లభించదు.