సద్గురు: మొదటి గురువు ఆవిర్భవించిన రోజే గురు పౌర్ణమి. యోగ సంస్కృతిలో , శివుడిని మనం ఒక దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి గా - మొదటి గురువుగా చూస్తాము. ఆదియోగి, ఆది గురువుగా  - మొదటి గురువుగా పరిణామం చెందిన పౌర్ణమి రోజునే మనం గురుపౌర్ణమిగా కొలుస్తాం.

15 వేల సంవత్సరాల క్రితం, సంవత్సరంలో దాదాపుగా ఈ సమయంలోనే,  ఆదియోగి దృష్టి, మనం ప్రస్తుతం సప్తరుషులు గా కొలుస్తున - ఆయన మొదటి ఏడుగురు శిష్యుల మీద పడింది. వారు అప్పటికి ఎనభై నాలుగు సంవత్సరాలుగా సాధనలో ఉన్నారు. అప్పుడు ఆయనాంతం జరుగుతున్నప్పుడు, అంటే సూర్యుడు భూమి తో ఉన్న సంబంధాన్ని ఉత్తరం నుండి దక్షిణానికి మార్చుకుంటున్న రోజు - దీన్ని మనం సాంప్రదాయపరంగా ఉత్తరాయణం ఇంకా దక్షిణాయణం అని అంటాం. ఆరోజున, ఆదియోగి సప్తఋషులను చూసి వారు జ్ఞానంతో  తేజో పాత్రులుగా ఉండటాన్ని గమనించారు.ఇక, ఆయన వారిని విస్మరించ లేకపోయారు. వారిని ఎంతో దగ్గరగా గమనించి, ఆ తరువాత వచ్చిన పౌర్ణమి రోజున ఆయన గురువుగా మారేందుకు నిశ్చయించుకున్నారు. ఆ పౌర్ణమి రోజే గురుపౌర్ణిమ గా ప్రసిద్ధిలోకి వచ్చింది.  ఆయన దక్షిణం వైపుకి తిరిగి యోగ శాస్త్ర సారాన్ని సప్త ఋషులకు ప్రసాదించడం మొదలుపెట్టాడు.

గురుపౌర్ణమి - ఆది గురువు ఆవిర్భవించిన రోజు

శరీరాన్ని ఎలా వంచాలో లేదా మీ శ్వాసను ఎలా నిలబెట్టాలో చెప్పేది కాదు, యోగ శాస్త్రం. ఇది మానవ వ్యవస్థకు సంబంధించిన నిశితమైన జ్ఞానాన్ని అవగాహన చేసుకుని, ఆ వ్యవస్థను నిర్మించగల లేదా కూల్చి వేయగల సామర్థ్యం కలిగించే శాస్త్రం.

ప్రజలు సృష్టిని, సృష్టి మూలాన్ని గ్రహించే విధానంలో ఆదియోగి మార్పును తీసుకుని వచ్చారు. ఒక సరళమైన సృష్టికీ, సృష్టి మూలానికి మధ్య ఆయన ఒక వారధిగా నిలిచారు. అయన, “ మీరు ఈ వారధిని దాటగలిగితే, మీకూ - ఈ సృష్టి మూలానికి మధ్య భేదం ఉండద”ని తెలిపారు. ఈ ప్రయాణం సృష్టి గా ఉండడం నుంచి సృష్టికర్తగా మారడం వరకు.

ఆదియోగి మొదటి గురువుగా ఆది గురువుగా మారిన పౌర్ణిమ రోజే గురుపౌర్ణిమ

ఆదియోగి మాట్లాడిన్నప్పుడు, ఆయన మతం గురించి లేదా తత్వం గురించి లేదా నమ్మకాన్ని గురించి మాట్లాడలేదు. ఆయన ఒక శాస్త్ర, శాస్త్ర విధానం గురించి మాట్లాడారు. ఈ శాస్త్రం ద్వారా, ప్రకృతి మానవుల పై విధించిన పరిమితులను అధిగమించవచ్చు.

మనం నిర్మించుకునే ప్రతి సరిహద్దు మన సంరక్షణకై చేసిందే. మన ఇంటి చుట్టూ రా ఒక ప్రహరీ వేసేది మనల్ని సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే. కానీ ఈ సరిహద్దులు ఎందుకు నిర్మించుకున్నామో, ఆ ఎరుకను కోల్పోతే, ఆత్మ సంరక్షణకై నిర్మించుకున్న ఈ సరిహద్దులే నిర్బంధ సరిహద్దులుగా మారతాయి. పైపెచ్చు, ఈ సరిహద్దులు కేవలం ఒక రూపం  లో మాత్రమే ఉండవు, ఇవి ఎన్నో సంక్లిష్టమైన రూపాలను తీసుకుంటాయి.

నేను కేవలం మీ మానసికమైన సరిహద్దుల గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ప్రకృతి మీ సంరక్షణకు, శ్రేయస్సుకు విధించిన పరిమితుల గురించి మాట్లాడుతున్నాను. మానవ స్వభావం ఎలాంటిదంటే, మీరు  పరిమితులను అధిగమిస్తే తప్ప నిజమైన శ్రేయస్సును అనుభూతి చెందలేరు. మానవులకు ఉన్న దుస్థితి ఇదే. మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు మీ చుట్టూరా ఒక కోటగోడ కావాలనుకుంటారు. ప్రమాద క్షణాలు అయిపోగానే అదంతా కుప్పకూలి మాయమై పోవాలనుకుంటారు.

మానవ జాతికి అందిన ఈ అసాధారణమైన, పరిష్కృతమైన జ్ఞ్యానాన్ని పొందిన రోజుగా పండుగ చేసుకోవడమే గురు పౌర్ణిమ

మీరు ఆత్మ సంరక్షణకై నిర్మించుకున్న సరిహద్దులు, మీరు కోరుకున్నప్పుడు కూలి పోకపోతే, మీకు నిర్బంధించినట్లు గా అనుభూతి కలుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీరు ఒకసారి  ఇక్కడికి విచక్షణ కలిగిన బుద్ధితో వచ్చినప్పుడు , ఒక పరిమితి లేదా మనల్ని నిర్బంధించేది ఏదైనా మనకు ఒక ఘోరమైన విషయంగా అనిపిస్తుంది. మానవులకు హింస కంటే కూడా ఎక్కువ బాధ కలిగించే విషయం, నిర్బంధం. ఎప్పుడైతే ఒక మానవుడు నిర్బంధాలను అనుభూతి చెందుతాడో, అప్పుడు ఇక వారు పడే బాధ వర్ణనాతీతం.

ఆదియోగి పద్ధతులని పండుగ చేసుకోవడమే గురు పౌర్ణిమ

శివుడు మనకి అందించిన  చైతన్య సాధనాలు ఇవే - మిమ్మల్ని ఈ పరిమితులను అధిగమించేందుకు అనుమతిస్తాయి - ఈ సాధనాలు మీకు కావలసినప్పుడు మీ కోటగోడలను నిలిచేలా చూసి వాటి ఉపయోగం నెరవేరిన తరువాత, మీకు వాటి అవసరం లేనప్పుడు అవి మాయమయ్యే లాగా చేస్తాయి.

మొదటిసారిగా మానవుడికి తనది ఒక నిర్ణీత జీవితం కాదని గుర్తుచేసిన రోజు గురు పౌర్ణిమ రోజు ఇటువంటి అద్భుతమైన కోటగోడలను కట్టడం ఎలా…?  మీ అస్తిత్వానికి ప్రమాదకరమైన వారు మాత్రమే చూడగలిగి, మీకు మీరుగా చూడలేనివి…? ఆదియోగి కృషి వీటి గురించే. ప్రకృతికి ఉన్న ఈ మాయాపూరిత స్వభావాన్ని ఉపయోగించుకుని ఆయన  ఈ అద్భుతమైన కోటగోడను నిర్మించేందుకు అసాధారణమైన విధానాలు తెలిపారు. వీటిల్లో, మీరు సురక్షితంగా ఉండొచ్చు. కానీ, ఎటువంటి శత్రువు చొరబడ లేరు. మొట్టమొదటిసారిగా మానవ జాతికి ఎంతో   అధునాతనమైన అసమానమైన విధానం ఆరంభమైన రోజుని మనం గురుపూర్ణిమగా వేడుక చేసుకుంటాము.

ఈ రోజున మానవ చరిత్రలో మొట్టమొదటి సారిగా మానవులకు, “ వారిది నిర్బంధ జీవం కాదని” గుర్తు చేసిన రోజు. వారు కృషి చేసేందుకు సిద్ధంగా ఉంటే అస్తిత్వంలో ఉన్న ప్రతి ద్వారం తెరిచే ఉంది.

అందుకే ఈ రోజు మానవాళికి ఎంతో ప్రాముఖ్యం కలిగిన రోజు. ఇది , ఈ మధ్య కాలం వరకు ఇలానే జరిగింది. మన దేశంలో ఉన్న ముఖ్యమైన పండుగల్లో గురు పూర్ణిమ ఒకటి. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ వేడుకను మనదేశంలో జరుపుకున్నారు. డబ్బు లేదా ధనం అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం కాదు. జ్ఞానం అన్నిటికంటే ఉన్నతమైన విలువ కలిగిందిగా చూడబడేది. సమాజంలో ఒక గురువు లేదా బోధకులకు ఎంతో ఉన్నత స్థానం ఉండేది. ఎందుకంటే,  జ్ఞానం ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టి. ఆ తరువాత, ఎందుకో కానీ మనం జ్ఞానానికి బదులుగా అజ్ఞానాన్ని ఎంపిక చేసుకుని వేడుక చేసుకోవడం మొదలు పెట్టాం. గత 65 సంవత్సరాలుగా గురుపౌర్ణిమ ప్రాముఖ్యతను కోల్పోయింది, ఎందుకంటే మన భారత ప్రభుత్వం దాన్ని ఒక సెలవు దినంగా ప్రకటించలేదు.

దేశంలో ఉన్న ముఖ్యమైన పండుగల్లో గురు పూర్ణిమ ఒకటి. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ వేడుకను మనదేశంలో జరుపుకున్నారు.

బ్రిటిష్ వారు మన దేశానికి రాకమునుపు మనదేశంలో అమావాస్య కు మూడు రోజులు , పొర్ణమికి రెండు రోజులు సెలవు దినాలు ఉండేవి. అంటే ఒక మాసం లో ఉండే 5 సెలవు రోజులు, మీరు గుడికి వెళ్లి మీ అంతఃశ్రేయస్సు కోసం పని చేసుకునే రోజులు . కానీ బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఆదివారాన్ని సెలవు గా ప్రకటించారు. దాని ఉపయోగం ఏమిటి..? అది మీకు తెలియదు. ఆ రోజుల్లో ఏమి చేయాలో తెలియక మీరు అతిగా తిని టీవీ చూస్తారు.

అందుకే దేశంలో మెల్లిగా ఈ ఉత్సవం కనుమరుగైపోయింది. ఆశ్రమాల్లో ఇంకా అక్కడక్కడ ఇది సజీవంగానే ఉంది. కానీ ప్రజల్లో  చాలా వరకు ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజని, మతం అన్నది ప్రజల మనసు లోకి రాకముందే ఆదియోగి ఒక మానవుడు తన ప్రస్తుత పార్శ్వాన్ని అధిగమించవచ్చునని , అది సాకారం చేసుకునేందుకు అవసరమైన సాధనాలను అందించాడని తెలియదు. తన ప్రస్తుత పరిమితులను దాటి పూర్తిగా మరొక పార్శ్వాన్ని అనుభూతి చెంది సృష్టి మూలాన్ని చేరుకోవచ్చను, అన్నది.. మనిషి మనసులో వచ్చిన అతి అమూల్యమైన ఆలోచన.

ప్రేమాశీస్సులతో,

సద్గురు