సంబందర్, తన వివాహ సన్నివేశంలో అతిథులందరూ ముక్తి పొందే సందర్భం కల్పించిన నాయన్మారు. అయన కథను సద్గురు మనకు చెప్తున్నారు.

Sadhguruసంబందర్ జ్ఞానోదయం పొందినవ్యక్తి, బాలయోగి. ఈయన, సుమారు ఓ వెయ్యేళ్ల కిందట జీవించాడు. ఆయనకు ఆరేళ్ల పసివయస్సులోనే తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని పరమసుందరమైన మార్గంలో వ్యక్తం చేయడం ప్రారంభించాడు. ఆయనింకా అప్పటికి బాలుడే కావడంతో , ఆయన ప్రబోధం చేయలేక పోయాడు, అందువల్ల అద్భుతంగా పాడడం ద్వారా తన జ్ఞానోదయాన్ని వ్యక్తం చేశాడు. అందులో చాలాభాగం ఎవరూ రాసిపెట్టకుండా నశించిపోయింది, కాని పొందుపరచిన మిగిలిన కొంచమూ ఎంత పరమసుందరంగా ఉన్నదో చెప్పలేము.

ఆయన రాజవంశంలో పుట్టాడు. యుక్తవయస్సుకు రాగానే తనకటువంటి ఇచ్ఛ లేకపోయినప్పటికీ రాజ్యమూ, కుటుంబమూ కూడా అతన్ని వివాహం దిశగా బలవంతపెట్టాయి. అప్పుడాయన ఒక అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు.... ఆ అమ్మాయి మహాసౌందర్యవతి అని గాని మరొకటి గాని అనుకొని ఆయన ఆ ఎంపిక చేయలేదు. ఆమెను, అయన చేయదలచుకున్న పనికి ఒక పరికరంగా ఉపయోగించదలచాడు.

ఐదారేళ్ల వయస్సులోనే ఆమె ఎంత తీవ్ర ఆధ్యాత్మిక వ్యక్తి అయిందంటే ఆమెను తల్లిదండ్రులు ఇంటిలో ఉంచలేకపోయారు.

ఈ అమ్మాయి కూడా రాజవంశానికి చెందిందే, కాని సంబందర్ రాజ్యానికీ ఈమె రాజ్యానికీ శత్రుత్వం. ఐదారేళ్ల వయస్సులోనే ఆమె ఎంత తీవ్ర ఆధ్యాత్మిక వ్యక్తి అయిందంటే ఆమెను తల్లిదండ్రులు ఇంటిలో ఉంచలేకపోయారు. ఎనిమిదేళ్ల వయస్సులో తనను వారణాసికి పంపేటట్లు తల్లిదండ్రులను ఒప్పించగలిగింది. ఆ రోజుల్లో ఇది చాలా కష్టమైనపని – ఇప్పుడు కూడా కష్టమే. కాని ఆమె సాధించింది. పధ్నాలుగేళ్ల వయస్సు వరకు తన గురువు గారి వద్ద అధ్యయనం చేసింది.

అప్పుడు విధి ఆమెను ఒక ప్రత్యేక దిశలో నడిపిస్తున్నట్లు గురువు గుర్తించాడు. ఈ వయస్సులో ఆమె తల్లిదండ్రులెలాగూ ఆమెకు వివాహం చేస్తారని ఆయనకు తెలుసు. ఆమెను సంబందర్‌తో వివాహం వైపు ప్రోత్సహించాడు. సంబందర్ ప్రణాళికను గురువు ఆమెకు చెప్పాడు – మామూలుగానైతే ఆయన ఇలా చేసేవాడు కాదు – ఆమె ఇష్టపూర్వకంగా అంగీకరించింది. ఆమెకు కూడా జీవితంలో వివాహం పట్ల ఆసక్తి లేదు. కాని, సంబందర్ ఒక విశిష్టమైన వ్యక్తి అనీ, అతనికి వేరే పథకం ఉందనీ తెలిసినందువల్ల ఆమె ఒప్పుకుంది. ఈ ఇద్దరూ ఇంత ప్రత్యేక వ్యక్తులు కాబట్టి రెండు కుటుంబాలూ తమ శత్రుత్వాల్ని మరిచిపోయి వివాహానికి అంగీకరించాయి. అందరికీ ఈ విషయం తెలుసు. అప్పటికే సంబందర్‌కు ఎందరో అనుయాయులు తయారయ్యారు. అలా వివాహం నిశ్చితమైంది.

దక్షిణభారతదేశంలో ముఖ్యులైన చాలామందిని పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లికి 3000 పైగా జనం వచ్చారు. సాధారణంగా భారతీయ వివాహ సందర్భాల్లో పురోహితుడు చదివే మంత్రాలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆయన చదువుతున్నదేదో ఈ ఇద్దర్నీ దగ్గరికి చేర్చింది – కేవలం వాళ్ల హార్మోన్లు కావచ్చు – కాని ఈ సంయోగం పరమ సంయోగానికి దారితీయవచ్చు. మొత్తం కర్మకాండ అంతా దానికి సంబంధించిందే – స్త్రీపురుషుల మధ్య ఈ సాధారణ ఆకర్షణ తీవ్రమై జ్ఞానోదయ సంపాదనకు ఒక పద్ధతిగా మారవచ్చు.

ఈ వివాహంలో సంబందర్ చేసిన యోచన ఇది – అది కేవలం తనకు, తన వధువుకూ మాత్రమే పరమ సంయోగం కాదు, అక్కడికి వచ్చిన అతిథులందరికీ ఇది కలగాలి.

హిందువుల వివాహ విధానంలోని ప్రత్యేకత ఇది. చాలామంది భావోద్వేగాలనూ, హార్మోన్లనూ దాటి వెళ్లవచ్చు. వాళ్ల భావోద్వేగాలు తగినంత ఆనందకరంగా ఉంటే ఆ వివాహం సఫలమైనట్లు. కాని, అసలు ఈ వివాహ ప్రక్రియే కేవలం భావోద్వేగ పూర్వక సంయోగం గాని, హార్మోన్ల సంతృప్తిగాని కాక ఒక పరమసంయోగానికి దారి తీయడానికి ఉద్దేశించినది.

ఈ వివాహంలో సంబందర్ చేసిన యోచన ఇది – అది కేవలం తనకు, తన వధువుకూ మాత్రమే పరమ సంయోగం కాదు, అక్కడికి వచ్చిన అతిథులందరికీ ఇది కలగాలి. అతను చాలా కారుణ్యం గలిగిన వ్యక్తి. వివాహానికి వచ్చిన అతిథులిప్పుడు కేవలం అతిథులుగా  లేరు, ఆ కొద్ది గంటలలోనే వాళ్లు తీవ్రమైన ఆధ్యాత్మిక సాధకులయ్యేట్లుగా చేశాడు సంబందర్. ఆ క్షణం రాగానే వాళ్లంతా తమ శరీరాలను అక్కడే వదలి, పరబ్రహ్మలో లీనమైపోయారు. ఆయన, ఆయన వధువు కూడా. సుమారు 3000 మంది సంపూర్ణమైన  స్పృహతో తమ శరీరాలను త్యజించారు.

అనేక శతాబ్దాల తర్వాత మరో కవి సాధువు వచ్చాడు. ఆయన నోట సంబందర్ గురించి మరింత విన్నాం. వల్లలాల్ ఎంతో కవితాత్మకంగా ఇలా విచారించాడు, ‘‘ఓహ్! ఆ వివాహంలో పాల్గొనే అవకాశం నాకెందుకు రాలేదు? నన్నెందుకు ఆహ్వానించలేదు? ఇప్పుడు నా ఆధ్యాత్మికత కోసం నేనిలా పాటు పడవలసి వస్తూంది.”

ప్రేమాశిస్సులతో,
సద్గురు 

flickr