రండి! విజయవంతమైన జీవితాన్ని ఎలా తయారుచేసుకోవలో ఈ ఆరు సూత్రాల ద్వారా తెలుసుకుందాం!

  • కోరిక ఉన్నంత మాత్రాన మీకు విజయం లభించదు. మీరు అది నెరవేరడానికి తగ్గ పనులు చేసినప్పుడే మీకు విజయం లభిస్తుంది.

1

 

  • మీ దగ్గర ఓ ప్రణాళిక ఉందా లేక మీరు జోస్యాలను నమ్ముతారా అన్నదే మీ విజయం తథ్యమా, యాదృచ్ఛికమా అన్న తేడాను నిర్ణయిస్తుంది.

2

 

  • మీరు విజయాన్ని ఆస్వాదించాలనుకుంటే, పరిస్థితులను సరిదిద్దే ముందు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి.

3

 

  • మీరు విజయం సాధించాలనుకుంటే, విజయాన్ని కోరుకోకండి - సామర్థ్యం, సాధికారతలను కోరుకోండి; అలాగే శక్తివంచన లేకుండా కృషిచేయండి.

4

 

  • మీరు మీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే, విజయం సులభంగా వస్తుంది.

5

 

  • విజయం అంటే ఎక్కువ పనులు చేయడం కాదు. విజయం అంటే సరైన పనులు చేయడం.

6