Sadhguruమహాశివరాత్రి మహిమను గురించి సద్గురు మాటల్లో: "సంవత్సరంలో పన్నెండు, పదమూడు శివరాత్రులు వస్తాయి. చాంద్రమాసంలోని అతి చీకటి రాత్రిని శివరాత్రి అంటారు. మాఘ మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఆ రోజు మనిషి శరీర వ్యవస్థలో శక్తి సహజంగా ఊర్ధ్వముఖంగా ఉప్పొంగుతుంది. ఈ భూగోళం ఒక ప్రత్యేక కూటమిలో ఉంది కనుక, సాధువైనా లేక పాపాత్ముడైనా, తెలిసినవాడైనా లేక తెలియనివాడైనా, యోగైనా లేక దుష్టుడైనా, ఎవరైనా సరే వెన్నెముక నిటారుగా ఉంచుకుని మేల్కొని, సావధానంగా ఈ రోజంతా కూర్చోగలిగితే, వారు తమ జన్మసార్ధకత దిశగా ముందుకు పోవచ్చు. ఇదొక గొప్ప అవకాశం. ఈ రోజు మీరు ఇది తెలుసుకోవాలన్నది నా ఆకాంక్ష, ఆశీర్వాదం. ఈ రాత్రి కేవలం జాగరణ చేసే రాత్రేకాక, జాగృతమయ్యే రాత్రి కావాలి."

మహాశివరాత్రి సాధన, అమోఘమైన  సంభావ్యతలు గల మహాశివరాత్రికి మిమ్మల్ని సిద్ధంచేసే ప్రక్రియ.ఈ సాధనను  ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా చేయవచ్చు. ఈ సాధనను మీరు  40, 21, 14, 7 లేక 3 రోజుల పాటు వేరు వేరు కాలపరిమితులలో చేయవచ్చు. దీక్ష మొదలు పెట్టిన రోజు నుంచి  2019 మార్చి 4 నాడు వచ్చే శివరాత్రి వరకు మీరు సాధన చేయవచ్చు.

దీక్ష తీసుకోవడానికి తారీఖులు

40 రోజులు: జనవరి 24 - మార్చి 4

21 రోజులు -  ఫిబ్రవరి 12 - మార్చి 4

14 రోజులు -  ఫిబ్రవరి 19 - మార్చి 4

7 రోజులు -  ఫిబ్రవరి 26 - మార్చి 4

                        3 రోజులు -  మార్చి 2 - మార్చి 4

సాధనాకాలంలో అనుసరించాల్సిన నియమాలు:

  • 8-10 మిరియాల గింజలను , 2-3 బిల్వ పాత్రలతో కానీ లేక వేప ఆకులతో కానీ కలిపి తేనెలో రాత్రంతా నానబెట్టాలి. అలాగే ఒక గుప్పెడు వేరుశెనగ పప్పులు నీటిలో  రాత్రంతా నానబెట్టాలి.
  • శివ నమస్కార సాధన చేయడం పూర్తి అయిన తర్వాత, ఉదయాన్నే నానిన ఆకులు, మిరియాలకు నిమ్మ రసం కలిపి నీళ్ళతో తాగాలి. నానిన వేరుశెనగ పప్పుల్ని తినాలి.
  • బిల్వ లేక వేప ఆకుల అందుబాటులో లేకపోయినట్లయితే, వేప పొడితో చేసిన చిన్న ముద్దలు తీసుకోవచ్చు. వేప పొడి ఈశా షాప్ IshaShoppe.com లో అందుబాటులో ఉంది.
  • రోజుకి రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోండి. రోజులో మొదటి సరి చేసే భోజనం మధ్యాహ్నం 12 గం. తర్వాతనే చేయాలి.
  • మీకు 12గం. ముందే ఆకలి అనిపిస్తే; తేనె, నిమ్మరసం కలిపిన నీళ్ళను మళ్ళీ తాగవచ్చు.
  • సిగిరెట్ కాల్చటం, మద్యపానం మానుకోవాలి. మాంసాహారం తినకూడదు.

వస్త్ర ధారణ

  • సాధనా కాలంలో తెల్లని లేక లేత రంగు బట్టలు మాత్రమే వేసుకోవాలి.
  • మగవారు కుడిచేతి పైభాగంలో, స్త్రీలు ఎడమ చేతి పైభాగంలో ఒక నల్ల గుడ్డను కట్టుకోవాలి.  ఆ నల్ల గుడ్డ 12 అంగుళాల పొడవు, 1 అంగుళం వెడల్పు ఉండాలి. సాధనకాలం పూర్తి అయ్యేదాకా ఆ గుడ్డను వంటి మీద నుంచి తీయకూడదు.
  • రోజుకు రెండు సార్లు సున్నిపిండితో స్నానం చేయాలి.
  • ఈ స్థానాల్లో విభూదిని రాసుకోవాలి: ఆజ్ఞ – కనుబొమల మధ్య, విశుద్ధి – గొంతు గుంటలో, అనాహత – మీ పక్కటెముకలు కలిసే ప్రదేశానికి కొంచం కింద, మణిపూరక – బొడ్డు కింద.

సాధన ప్రక్రియ

ప్రతి రోజు చేయాల్సిన సాధనా విధానం :

  • ఖాళీ కడుపుతో 12 సార్లు శివ నమస్కాం చేయాలి. ఆ తర్వాత ‘సర్వేభ్యో’ మంత్రాన్ని మూడు సార్లు స్తుతి చేయాలి. ఇలా రోజుకు ఒక సారి, సూర్యోదయానికి ముందు లేక సూర్యాస్తమయం తర్వాత చేయాలి.

 

సర్వేభ్యో మంత్రం

 

ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః

( పవిత్ర, దివ్య జీవులందరికీ మేము నమస్కరిస్తున్నాము)

ఓం పంచభూతాయ నమః

( ఈ పంచభూతాలకు నమస్కరిస్తున్నాము)

ఓం శ్రీ సద్గురవే నమః

(సద్గురువుకు  నమస్కరిస్తున్నాము)

ఓం శ్రీ పృధ్వీయై నమః

(భూమాతకు నమస్కరిస్తున్నాము)

ఓం ఆది యోగేశ్వరాయ నమః

(యోగాకు మూలమైన వారికి నమస్కరిస్తున్నాము)

ఓం , ఓం , ఓం.

  • శివ నమస్కారం, మంత్రం పఠనం తర్వాత, రోజూ చేసే శాంభవి మహాముద్ర లాంటి సాధనలను కూడా పూర్తి చేసాక, నానబెట్టిన ఆకుల్ని నమిలి తిని, మిరియాలని నిమ్మరసంతో కలిపి తాగండి. వేరుశెనగ పప్పుల్ని కూడా తినండి.
  • మీరు శివనమస్కారం సూర్యాస్తమయం తరువాత చేస్తుంటే, ఈ మిరియాలు, ఆకులు, వేరుశనగ పప్పులను ఉదయం 12గం. లోపు (ఇతర సాధనలు చేస్తుంటే అవి పూర్తి అయిన తరువాత)తీసుకోవాలి.
  • శివ నమస్కారం చేయటానికి కొన్ని సూచనలు:
    • గర్భిణీ స్త్రీలు శివ నమస్కారం చేయకూడదు.
    • ఋతుక్రమ సమయంలో కూడా స్త్రీలు శివ నమస్కారం చేయవచ్చు.
    • హెర్నియా సమస్య ఉన్న వారు శివ నమస్కరం చేయడానికి కొంచెం వేరుగా కుషన్ లేక కుర్చీని ఉపయోగించాలి.
    • ఒక నూనె దీపాన్ని ఉదయం, సాయంత్రం వెలిగించండి. దీపం అందుబాటులో లేకపోతే ఒక కొవ్వొత్తి వెలిగించవచ్చు.
    • దీపం వెలిగించిన తర్వాత యోగ యోగ యోగీశ్వరాయ మంత్రాన్ని ఉదయం 12 సార్లు, సాయంత్రం 12 సార్లు చదవండి. ఇది  సంధ్యా కాలం 20 నిముషాల సమయంలో చేయటం ఉత్తమం. రెండు ముఖ్యమైన సంధ్యా కాలాలు సూర్యోదయం, సూర్యాస్తమయాలకు 10 నిముషాలు ముందు మొదలై 10 నిమిషాల తర్వాత ముగుస్తాయి.

యోగ యోగ యోగీశ్వరాయ

యోగ యోగ యోగీశ్వరాయ

భూత భూత భూతేశ్వరాయ

కాల కాల కాలేశ్వరాయ

శివ శివ సర్వేశ్వరాయ

శంభో శంభో మహాదేవాయ

శివ నమస్కారం ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి : శివ నమస్కారం 

 

సాధన ఉద్యాపన

ఈ సాధన మహాశివరాత్రి రోజు ముగుస్తుంది. ఉద్యాపనను ఈశా యోగా సెంటర్లో, లేక స్థానిక ఈశా సెంటర్లో లేక మీ ఇంట్లోనే ధ్యానలింగం ఫోటో ఎదురుగా చేయవచ్చు.

ఉద్యాపన విధానం:

  • రాత్రంతా జాగారం చేయటం ముఖ్యం.
  • మహా శివరాత్రి నాడు యోగ యోగ యోగీశ్వరాయ 112 సార్లు స్తుతి చేయాలి.
  • అవసరంలో ఉన్న ముగ్గిరికి ఆహారంగాని, డబ్బుగాని దానం చేయండి.
  • ఒక బిల్వ పత్రం/వేపాకు/3 లేక 5 భాగాలుగా ఉన్న ఆకును ధ్యానలింగానికి లేక మీ ఇంట్లో ధ్యానలింగం ఫొటోకు సమర్పణం చేయండి.

మీ చేతికి కట్టుకున్న నల్ల గుడ్డను విప్పి ధ్యానలింగం ఎదురుగా ఉన్న నంది దగ్గర కట్టండి. స్థానిక ఈశా సెంటర్లో లేక ఇంట్లోనే చేస్తున్న వారు ఈ నల్ల గుడ్డను కాల్చి, ఆ బూడిదను చేతులకు, కాళ్ళకు ఉద్యాపన తర్వాత రాసుకోండి.

ఇంటి దగ్గరే ఉద్యాపనా కార్యక్రమం చేస్తుంటే ఈ ధ్యానలింగం ఫోటోను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Dhyanalinga