అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 112 అ. ఎత్తైన ఆదియోగి విగ్రహం దగ్గర జరిగే కార్యక్రమంలో, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురుతో తమిళనాడు, మహారాష్ట్రాల గవర్నరు, ఇంకా కేంద్ర సంస్కృతి మరియి పర్యాటక శాఖామాత్యులు పాల్గొంటారు.

ఈ సంవత్సరం శివరాత్రి నాడు నాడు ప్రధాన మంత్రిచే ఆవిష్కరింపబడిన 112 అ. ఆదియోగి విగ్రహం ముందు ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు యోగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈశా యోగా సెంటరులో మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న, ఉ. 7 గం. జరిగే ఈ కార్యక్రమంలో తమిళనాడు, మహారాష్ట్రాల గవర్నరు గౌ. శ్రీ విద్యాసాగర్ రావుగారు, ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా పాల్గొంటారు, ఇంకా కేంద్ర సంస్కృతి మరియి పర్యాటక శాఖామాత్యులు గౌ. డా. మహేశ్ శర్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వచ్చే సంవత్సరం ప్రపంచమంతా కోట్లాది మందికి యోగా ఉద్యమాన్ని తీసుకువెళ్ళేందుకు స్ఫూర్తిగా  గవర్నరు గారు, కేంద్రమంత్రి వర్యులు ‘మహాయోగ యజ్ఞ జ్యోతి’ ని ప్రజ్వలింపజేస్తారు.

ఈశా యోగా సెంటరులో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ సంస్కృతుల, విభిన్న జీవన స్థాయిలకు చెందిన బడి పిల్లలు, స్త్రీలు, పారా మిలటరీ దళాలు, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఎంతోమంది పాల్గొంటారు. ప్రపంచ సమాజాన్ని, మూడు వందలకు పైగా దేశాలలోని యోగా ఔత్సాహికులను ఉద్దేశించి, సద్గురు, గౌ.గవర్నరు, కేంద్ర మంత్రి వర్యులు లైవ్ వెబ్ స్ట్రీమ్ ద్వారా యోగా ప్రాముఖ్యతను, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రాముఖ్యతను గురించి ప్రసంగిస్తారు.

ఈశా ఫౌండేషన్ AYUSH మంత్రిత్వ శాఖ వారిచే గుర్తింపబడిన యోగా సంస్థ. అంతేకాక  AYUSH మంత్రిత్వ శాఖ వారిచే నిర్వహించబడే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల స్టీరింగ్ కమిటీలో భాగస్వామి. మొదటి రెండు సంవత్సరాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంతో గొప్ప ప్రభావం చూపడంతో, ఈశా ఫౌండేషన్ ఈ సంవత్సరం విద్యార్ధులు, భారత సైనికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతోంది.

సద్గురుచే తర్ఫీదు చేయబడిన టీచర్లచే రెండు లక్షా యాభైవేల మంది సరిహద్దు రక్షక దళాల (BSF) సైనికులకు శాస్త్రీయ విధానంలో యోగా నేర్పేందుకు, ఈశా ఫౌండేషన్ - సరిహద్దు రక్షక దళాల(BSF)తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దేశమంతా ఉన్న పారా మిలటరీ దళాలకు పెద్ద ఎత్తున హఠ యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈశా ఫౌండేషన్ సమాయత్తమౌతోంది. దేశంలోని వివిధ కారాగారాలలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, పాఠశాలలు, కళాశాలలు, రేడియో స్టేషన్ లు, వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ ఇలా అనేక చోట్ల ఈ సంవత్సరం ఈశా ఫౌండేషన్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు శ్రీహరికోట, షార్ లోని 3000 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు కూడా ఈశా ఫౌండేషన్ ఉప యోగా కార్యక్రమం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2017, మే నెలలో, ఈశా యోగా సెంటరులో నిర్వహించిన ఎనిమిది రోజుల యోగా ప్రోగ్రాంలో 38 దేశాలకు చెందిన 2000 మందికి పైగా పాల్గొన్నారు. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచం నలుమూలా ఈశా ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర AYUSH మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విద్యా శాఖలు, వివిధ దేశాల దౌత్యకార్యాలయాలు, ప్రపంచమంతా ఉన్న వివిధ వ్యాపార సంస్థల సహాయ, సహకారాలతో ఈశా  యోగా ఈ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నది.

ప్రపంచం నలుమూలలా ఈ ఉద్యమం వ్యాపింప చేసే బృహత్తర కార్యక్రమంలో భాగంగా, ఈశా ఉపయోగా  కార్యక్రమాలను అందిస్తున్నది. ప్రపంచమంతా యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు వేల మంది స్వచ్ఛంద కార్యకర్తలకు ఈశా ఫౌండేషన్ ట్రైనింగ్ ఇస్తున్నది. యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ ‘నిజమైన శ్రేయస్సు అనుభూతి చెందడానికి ఉన్న ఏకైక మార్గం అంతరంగంలోకి చూడడమే. యోగా అంటే అదే - పైకీ కాదు, క్రిందకీ కాదు, లోపలికే. లోపలికి వెళ్ళడమే బయట పడడానికి ఉన్న ఏకైక మార్గం’ అని సద్గురు అంటారు.

క్రిందటి సంవత్సరం జరిగిన రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలలో భాగంగా, కేవలం ఆరోజే కాక సంవత్సరం మొత్తం, దేశమంతా 35,000 పాఠశాలల్లో ఉన్న రెండు కోట్ల మంది పిల్లలకు ఈశా ఫౌండేషన్ చేరుకుంది. భారత దేశంలలోనే కాక ఆరు ఖండాలలోని 80 దేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అమెరికాలో 50,000 చోట్ల ఉచిత యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ట్రైనర్స్ కు శిక్షణ ఇవ్వబడుతోంది.

ఈశా ఫౌండేషన్ సులువైన 5 నిముషాల యోగా సాధలను ఆన్ లైన్ లో  “Yoga Tools for Transformation” అనే మొబైల్ ఆప్ ద్వారా  అందిస్తోంది.

isha.sadhguru.org/ వెబ్ సైట్ ను చూడండి.
మరిన్ని వివరాలకు 9487475346 సంప్రదించండి.