మీరు ఎప్పుడైనా స్నానం చేస్తున్నప్పుడు లేదా ఎక్కడైనా పారుతున్న నదుల్లో ఒక మునక వేసినప్పుడు - అది కూడా మీరు చల్లని నీటితో స్నానం చేస్తే, దానర్ధం మీరు స్నానం చేయడం అన్నది కేవలం మీ చర్మాన్ని శుద్ధి పరచడం మాత్రమే కాదు ఇది మిమ్మల్ని ఎన్నో విషయాల నుంచి శుద్ధిచేసి మిమ్మల్ని పునరుత్తేజితం చేస్తుంది - అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. మీరు ఒకవేళ కోపంగా, చిరాకుగా ఉండి.. స్నానానికి వెళ్ళినప్పటికీ స్నానం చేసి వచ్చేసరికే అవన్నీ మీకు తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇది కేవలం చల్లని నీరు మీ శరీరం మీద పారి, మీ నరాలని సాంత్వన పరచడం మాత్రమే కాదు. అది కూడా జరుగుతోంది కానీ దానికంటే పెద్ద విషయం ఇంకేదో జరుగుతోంది.

ప్రతి మనిషి చుట్టూరా పన్నెండు నుంచి పద్ధెనిమిది అంగుళాల వరకు ఈ ఆకాశం ఉంటుంది.

అదేమిటంటే, మీలో ఆకాశానికి సంబంధించిన మూలకాన్ని శుద్ధి చేస్తూ ఉంది. మీరు ఏదైతే మీ దేహం అనుకుంటున్నారో అది ఈ పంచభూతాల కలయిక. అందులో ఆకాశం లేదా శూన్యం అనేది ఒకటి. మిగతా నాలుగు - పృధ్వీ, జలం, అగ్ని, వాయువు. మీరు మానవ స్వరూపం తీసుకున్నప్పుడు మీ శరీరంలో అన్నిటికంటే పై పొర 'ఆకాశం'. ప్రతి మనిషి చుట్టూరా పన్నెండు నుంచి పద్ధెనిమిది అంగుళాల వరకు ఈ ఆకాశం ఉంటుంది. ఎవరైనా కొంత జబ్బుతో బాధ పడుతుంటేనో లేదా మృత్యువుకు ఎంతో సమీపంలో ఉంటే ఇది మరో విధంగా ఉంటుంది. లేకపోతే సామాన్యంగా మానవులందరికీ కూడా ఈ ఆకాశం పన్నెండు నుంచి పద్ధెనిమిది అంగుళాలు.. వారి దేహానికి చుట్టూరా ఉంటుంది. ఇది మానవ దేహ నిర్మాణంలో ఎంతో అత్యవసరమైన పదార్థం.

మీ భౌతిక శరీరం దేన్నైనా తగిలే ముందరే మీ ఆకాశ-శరీరం దాన్ని స్పృశిస్తుంది. అందుకని ఎదైతే బయట నుంచి వస్తుందో, అది మిమ్మల్ని పెంపొందించేదైనా సరే లేదా వినాశకారకంగా ఉన్నా సరే. ముందర మీ ఆకాశ దేహానికే తగులుతుంది. మీరు ఇంతవరకు ఎంత మలినాలని(క్లేశాలని) లేక సహకారాన్ని సంపాదించుకున్నారు అనేది మీ మీద ఇప్పటివరకూ ఎటువంటి ప్రభావాలు పడ్డాయి అనేది నిర్ణయిస్తుంది.

ప్రతి మనిషి చుట్టూరా పన్నెండు నుంచి పద్ధెనిమిది అంగుళాల వరకు ఈ ఆకాశం ఉంటుంది.

మీరు ఈ క్లేశాలన్నింటినీ శుద్ధి చేసుకోవాలి అనుకుంటే, మీరు శరీరాన్ని నీటితో కడగవచ్చు లేదా అగ్నితో కూడా ఈ పని చేయవచ్చు. అంటే ఇది మీకు మీరే నిప్పు పెట్టేసుకోవడం అని అర్థం కాదు. మిమ్మల్నిమీరు శుద్ధి చేసుకోవడానికి అగ్నిని వాడడం అనేది ఎంతో శక్తివంతమైన ప్రక్రియ. దీనిని మనం క్లేశనాశన క్రియ అంటాం. దానర్థం ఏమిటంటే మీలో, మీ వ్యవస్థలో ఎలాంటి దోషాలైతే ఉన్నాయో, వాటన్నింటినీ ఇది నాశనం చేసేస్తుంది. ఈ ప్రక్రియ కనుక సరిగ్గా చేసినట్లైతే, ఇంకా ఎవరైతే ఈ ప్రక్రియను చేస్తున్నారో..వారికి దీనిని చెయ్యడం సరిగ్గా వచ్చినట్లైతే, మొదట్లో మీరు కేవలం అగ్నిని మాత్రమే గమనించగలరు. కానీ కొంత సమయం తరువాత మీలో మీకు ఒకరకమైన స్వేచ్చ కలుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని పట్టి ఉన్నదేదో ఇప్పుడు పోతుంది కనుక.

మీరు ఇలాంటి శుద్ధిని మీ ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే మీరు కట్టె-పుల్లలతోనో, లేదా ఎండు గడ్డితోనో, నూనెతోనో, మరోదానితోనో ఒక అగ్నిని తయారు చేసి దాని ముందర మీరు చేతులను చాచి కాసేపు ముందువైపుకి తిరిగి కళ్ళు తెరిచి మూడు నిమిషాలు ఉండాలి. ఆ తరువాత, మీరు వెనుకవైపుకి తిరిగి మీ వెన్నెముకను మూడు నిమిషాలపాటు ఆ అగ్ని స్పర్శ తగిలేలాగా అట్టిపెట్టాలి. ఈ రకమైన ప్రక్రియ, మీ వ్యవస్థలో ఒక రకమైన పునరుత్తేజాన్ని కలిగిస్తుంది. ఇది, మీలోని అగ్ని తత్వాన్ని మెరుగు పరుస్తుంది. ఇది లోపల-బయట ఉన్న మీలోని అగ్ని తత్వాన్ని మెరుగు పరుస్తుంది. మిమ్మల్ని దానితో అనుసంధానం చేస్తుంది. మనకి, తూర్పు దేశాల్లో ఉన్న ప్రక్రియలన్నీ కూడా అగ్నితో సంబంధించిన ప్రక్రియలే. మీకు ఈ విధంగా అగ్నిని ఏర్పాటు చేసుకోవడం అన్నది కుదరకపోతే, మీరు ఒక దీపాన్ని వెలిగించండి. ఇది నూనెతో అయినా లేదా నెయ్యితో అయినా చేయవచ్చు. మీరు కాసేపు ఈ దీపానికి ఎదురుగుండా తిరిగి కూర్చోండి. ఆ తరువాత వెనుకకు తిరిగి కూర్చోండి. ఈ విధంగా కూడా మీలోని అగ్ని తత్వాన్ని పునరుత్తేజితం చేయవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

సంపాదకుడి సూచన: లింగ భైరవి దేవి ఆలయంలో క్లేశ నాశన క్రియ సరైన విధానంలో సద్గురు చెప్పిన విధానంలో జరుపబడుతుంది. అగ్నితో మీ క్లేశాలని శుద్ధి చేసుకునే ఒక చక్కటి అవకాశం. మరిన్ని వివరాలకు సంప్రదించండి: lingabhairavi.org