ప్రశ్న: మహాబిల్వపత్రాన్ని ఇక్కడ మనం ధ్యానలింగానికి సమర్పిస్తాం కదా! దాని విశిష్టత ఏమిటో తెలుపుతారా సద్గురు ?

సద్గురు:  "ఒక పువ్వు మరో పువ్వు కంటే పవిత్రమైనది ఎలా అవుతుంది? అన్నీ మట్టి నుంచి వచ్చినవే కదా!" అన్న ఆలోచన మీకు కలగచ్చు. అది తెలుసుకోవాలంటే మీరు వాటితో కొంత సమయం గడపాలి. ఆ చెట్టుతో కొంత సమయం, ఈ చెట్టుతో కొంత సమయం గడిపినప్పుడు, మీరు ఒకరకమైన ధ్యాన వ్యవస్థలో ఉన్నప్పుడు మీరు ఒకదాని పట్ల ఆకర్షితులవుతారు. ఉదాహరణకి వేప, మామిడి  రెండూ ఈ భూమి నుంచి వస్తున్నాయి కదా, కానీ వాటి రుచి ఎంతో వేరుగా ఉంటుంది కదా! అంటే ఈ జీవం ఈ భూమిని ఏ విధంగా మలిస్తే, అవి ఆ విధంగా ఉంటాయి. నిజానికి మీరైనా అంతే కదా. మీరైనా, ఒక కీటకమైనా ఒక  పురుగయినా,  మరొకరైనా ఏవిటి తేడా? అంతా ఒకటే కదా...! కానీ మీలో విభిన్నత కనిపిస్తోంది కదా!

ఇవి ఆయనకి అర్పించిన తరువాత, వాటిని తీసి మళ్ళీ మనమే స్వీకరిస్తాం. వీటి ద్వారా మనం ఆయన్ని స్పృశించే మార్గం మనకు దొరుకుతుంది.

ఇది ఎన్నోసార్లు ఈ విధంగా జరిగింది. అదేమిటంటే, సమాజాలను ఒక్క విధంగా ఉంచాలి అని ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది గుంపులో ఒకరిగా మిగిలిపోతారు. కొంతమంది వారి సామర్ధ్యాన్ని బట్టి, వారి నేర్పుని బట్టి వారు అందరికంటే విశిష్టంగా కనిపిస్తారు. ఇది వేరే జీవరాసుల్లో కూడా ఇలానే జరుగుతుంది. మీ ఆధ్యాత్మిక జీవితం ఓ సుదూరమైన ప్రయాణం లాంటిది. పైగా మీకు తెలియని ప్రదేశంలో ప్రయాణం.  అక్కడ ప్రతి చిన్న విషయం మీకు సహకారం అందించేదిగా ఉండాలి. ఉదాహరణకు మీరు ‘మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నారనుకోండి, అప్పుడు మీ దగ్గర చిన్న దారం ఉన్నా సరే, మీరు దాన్ని పారేయరు కదా! అది ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో తెలీదు కాబట్టి, దాన్ని జాగ్రత్త పరుచుకుంటారు. ఒకవేళ మీరు ఏదో  మహానగరంలో ఉన్నటైతే, ఆ దారాన్ని తీసి అవతల పడేస్తారు. కానీ అదే మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు మీకు తెలియని ప్రదేశంలో ఉన్నప్పుడు మీరు ఆ విధంగా చేయరు కదా! ఆధ్యాత్మికతలో కూడా ఇంతే’. ప్రజలు, కొన్ని ఆకులు, పూలు, పళ్ళు ఇవి మీకు ఏ విధంగా ఈ ప్రయాణంలో సహకరించగలవో వాటన్నిటిని గుర్తించారు. వేటిని వదిలి పెట్టలేదు.

బిల్వ పత్రం శివుడికి ప్రియమైనది. శివుడికి ప్రియమైనది అంటే ఏవిటి? ఆయన ఈ బిల్వ పత్రాన్ని ఏం చేసుకుంటారు? దానర్ధం “బిల్వ పత్రం యొక్క ప్రకంపన శివుడి ప్రకంపనకి దగ్గరగా ఉంటుంది, ఇది దాన్ని గ్రహించగలదు అని అర్ధం”. ఈ విధంగా మనం ఎన్నో గుర్తించాం, అవి మీకు మీ ప్రయాణంలో సహాయపడతాయి. అవి మాత్రమే మనం ఆయనకు అర్పిస్తాము. అవి ఆయన దగ్గర అలా వదిలేయము కదా! ఇవి ఆయనకి అర్పించిన తరువాత, వాటిని తీసి మళ్ళీ మనమే స్వీకరిస్తాం. వీటి ద్వారా మనం ఆయన్ని స్పృశించే మార్గం మనకు దొరుకుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

ఈ  బిల్వ పత్రం ప్రకంపన శివుడి ప్రకంపనకి దగ్గరగా ఉంటుంది.

ఉదాహరణకు ధ్యాన లింగం దగ్గర మీరు ఈ ప్రయత్నం చేసి చూడండి. ఒకరోజు నేత బట్టలు కట్టుకుని వెళ్ళండి, ఒకరోజు పట్టు బట్టలు కట్టుకుని వెళ్ళండి, ఒకరోజు నైలాన్ బట్టలు వేసుకుని వెళ్ళండి, ఒకరోజు ప్లాస్టిక్ కాగితం చుట్టుకుని వెళ్ళండి. మీరు దేన్నీ నమ్మవద్దు. ఒక మూడు, మూడు రోజులు ఇలా చేసి, మీరు గమనించి చూడండి. మీకు కొద్దిపాటి గ్రాహ్యత ఉంటే మీరు ఒక్కొక్కటి ధరించినప్పుడు మీ అనుభూతి ఒక్కో విధంగా ఉంటుందని గ్రహిస్తారు. ఆధ్యాత్మిక జీవనంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిదీ మీకు తోడ్పడాలి. మీరొక బిల్వ పత్రాన్ని కనుక శివుడికి అర్పించి, దాన్ని మళ్ళీ తీసుకుని మీరు జేబులో పెట్టుకుని చూడండి. మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు, మీ మానసిక స్థితి అన్నీకూడా ఎంతో అద్భుతంగా పని చేస్తూ ఉంటాయి. మీరు ఇది కొంత గ్రాహ్యతతో, కొంత ధ్యానంతో తెలుసుకోవచ్చు.

ఇక్కడ ఈ వింధ్యా పర్వతాలలో ఉన్న అడవులు వైవిధ్యమైనవి. ఇక్కడకొస్తున్న అడవి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే. ఈ అడవులు సాధారణంగా తీరం గుండా వెళ్తూ ఉంటాయి. ఈ అడవుల్లో ఎన్నో వైవిధ్యమైన చెట్లు ఉన్నాయి. ఎన్నో రకాలు, బహుశా ప్రపంచంలో మరెక్కడా ఇంత వైవిధ్యం మీరు చూడరేమో ! ఇన్ని రకాల చెట్లు ఉండగా, ఎందుకు మీకు ఈ బిల్వ పత్రం మాత్రమే, అంటే మీరు ఇది కూడా ప్రయత్నించి చూడండి. మీరు ఒక గుడ్డలో ఓ పది రకాల ఆకులు కోసుకొచ్చి, విడి విడిగా కట్టి, వాటిని ధ్యానలింగం దగ్గర పెట్టండి. ఒక్కొక్క దానితో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో చూడండి? మీరు కనక ఆకులను విడివిడిగా కట్టి, అలా ఒక గుడ్డలో పెడితే.., నేను వేరే వాటిని  గుర్తించలేనేమో కానీ, బిల్వ పత్రాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తించగలను. ఇది బిల్వ పత్రం అని చెప్పగలను’. ఎందుకంటే “ఈ  బిల్వ పత్రం ప్రకంపన శివుడి ప్రకంపనకి దగ్గరగా ఉంటుంది”. దీనికి మీరు నన్ను పిలవక్కరలేదు. మీ రుద్రాక్షని అడిగినా ఈ మాట చెప్తుంది. అది మీకంటే మరింత తెలివి గలది కదా!

https://soundcloud.com/soundsofisha/bilvashtakam

By Yosarian (Own work) , via Wikimedia Commons