పవిత్ర భారతావని ఆధ్యాత్మిక ఉన్నతికోసం అనేక పండుగలను జరుపుకుంటుంది. వాటిలో ప్రభావపరంగా మహాశివరాత్రి అతి ముఖ్యమైనది. ఆ రాత్రి (ఆకాశంలో)ఉండే ప్రత్యేకమైన గ్రహస్థానాల మూలంగా ఎవరైతే తమ వెన్నెముకను నిటారుగా ఉంచి జాగరణ చేస్తారో వారికి మహత్తరమైన భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆధ్యాత్మికోన్నతికి ఆలవాలమైన శక్తివంతమైన ప్రదేశం, ప్రబలమైన ఆధ్యాత్మికానుభూతి కలిగించడానికి సరైన వాతావరణం కలిగిన, ఈశా యోగా కేంద్రంలో మిమల్నిఅబ్బుర పరచే రీతిలో రాత్రంతా మహా శివరాత్రి ఉత్సవం జరుపబడుతుంది.

మహాశివరాత్రి రోజున మనం ఏమి చేయబోతున్నాం?

చరిత్రలోనే అద్వితీయమైన ఆదియోగి విగ్రహ ఆవిష్కరణలో పాలుపంచుకునేందుకు సద్గురు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. 112 అడుగుల ఎత్తైన ఈ కీర్తివంతమైన ముఖం, మనిషి తన పరమోన్నత స్థితిని చేరుకొనేందుకు ఉన్న 112 మార్గాలకు ప్రతీకగా నిలుస్తుంది. మనం ముక్తి సాధించేందుకు యోగానే మార్గమని మనకి ఆదియోగి గుర్తు చేస్తూ, ప్రేరణనిస్తారు.

ఇది జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జరిగేది కాబట్టి , మీలో ధ్యానలింగ ప్రాణప్రతిష్టకు రాలేక పోయినవారికి, ఇది ఒక అవకాశం. ఇప్పుడు ఈ భూమ్మీద అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాబోయే తరాలవారు కేవలం నమ్మకం మీద ఆధారపడ్డ వాళ్ళుగా కాకుండా సత్యాన్వేషకులై ఉండాలి. ఇది ఒక అద్వితీయమైన ఘటనగా నిలవబోతుంది. మళ్లీ ఇటువంటి ఘటన ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో, అసలు జరుగుతుందో లేదో నాకు తెలియదు” ~ సద్గురు

మట్టిని ఆహారంగా తయారు చేయడాన్ని వ్యవసాయం అంటాం..

ఆహారాన్ని మాంసంగా చేయడాన్ని, జీర్ణ ప్రకియ అంటాం..

రాతిని దైవంగా మలచడాన్ని ప్రాణప్రతిష్ఠ అంటాం..

ఆదియోగి ప్రాముఖ్యత, ఒక కొత్త మత స్థాపనకు కాదు, ప్రపంచంలో ఒక కొత్త జాగృతం తీసుకురావడంలో ఉంది. ఇలాంటి అవకాశం మళ్ళీ చాలా కాలం కలుగకపోవచ్చు. ప్రతి బిడ్డకీ, పది సంవత్సరాల వయసు వచ్చే సరికి, వారి ఆలోచనలను, భావాలను నియంత్రించుకో గలిగేందుకు ఉపకరించే సాధనలు వారి వద్ద ఉండాలన్నదే నా ఆకాంక్ష, నా ప్రయత్నం.

ఒక తరానికి చెందిన వారిగా, మనమంతా మన భావితరాలకు దీనిని అందించగలగటం ఒక భాగ్యం. ఇది సాధించటానికి, ఆదియోగి సారూప సాన్నిధ్యాన్ని వినియోగించదలచుకున్నాం. ఆయన్ని దైవంగా కాక ఒక యోగిగా వెలుగులోకి తీసుకువస్తాం. కాబట్టి, 24 ఫిబ్రవరి 2017 న ఇక్కడ అద్వితీయమైన రీతిలో నిర్మిస్తున్న అత్యంత పెద్ద ముఖాన్ని ప్రపంచానికి అందించబోతున్నాం.

దక్షిణ కైలాసంగా పేరుపొందిన వేలంగిరి పర్వతాల వద్ద ఈశా యోగా కేంద్రంలో, మహా శివరాత్రి వేడుకలు మరెక్కడా జరగని విధంగా జరుగుతాయి. ఆదియోగి  అనుగ్రహాన్ని పొంది, మీలో కొత్త కోణాలలో అనుభూతులు వికసించనివ్వండి.

రండి, ఆదియోగిని ప్రపంచానికి అందించే చారిత్రక ఆవిష్కరణలో మాతో చేతులు కలపండి...!!

‘‘మీరు ఈ మహా శివరాత్రి నాటి రాత్రిని మీ ఎఱుకను పెంచుకునేందుకు, మీ జీవితానుభవాన్ని మరింతగా అనుభూతి చెందడానికి వినియోగించుకోవాలని నా ఆకాంక్ష - దానికి నా ఆశీస్సులు’’ - సద్గురు

మహాశివరాత్రి నాడు ప్రదర్శన ఇచ్చే కళాకారులు : కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్

తేది : ఫిబ్రవరి 24, 2017, సాయంత్రం 6 గం. నుండి మరునాడు ఉదయం 6 గం. వరకు

మరిన్ని వివరాలకోసం : మహాశివరాత్రి