“ఇటువంటి ప్రాణప్రతిష్టలో పాల్గొనటం ఒక గొప్ప శక్తివంతమైన ప్రక్రియ. ఇక్కడ అందించబోయేదాన్ని మీరు ఎటువంటి నిర్దేశకం లేకుండా పొందాలంటే , మీకు కొన్ని జన్మల కఠోర సాధన చేస్తే  కాని అది సాధ్యపడదు. ఇక్కడ అది ఉచితంగా ప్రకాశిస్తుంది. దీన్ని మీరు అవగతం చేసుకుంటే, మీరు కూడా ప్రకాశించాలి, ప్రకంపించాలి”  ~ సద్గురు

మనం ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొసం ఆదియోగిని ఏర్పాటు చేస్తున్నాం. ఏ శక్తినైతే మనం శివ అంటున్నామో, లేదా ఏ శక్తికి ఆకారం లేదో  - “శివ” అంటే అర్ధం, ఏదైతే లేదో, ఏది నిరాకారమైనదో అది అని – ఈ శక్తి ఎన్నో విధాలుగా అభివ్యక్త మవ్వగలదు. భారతీయ సంప్రదాయంలో దీనిని ఇలా అర్ధం చేసుకోవటం సర్వ సాధారణం. ఒక ప్రదేశంలో, శివడు ఒక నాట్యకారుడు, మరో ప్రదేశంలో వైద్యుడు, మరో ప్రదేశంలో వరాలు ప్రసాదించే వాడు, మరో చోట అజ్ఞానాన్ని రూపుమాపే  వాడు, మరో చోట భయాల్ని తొలగించేవాడు – ఈ విధంగా.. బృహదీశ్వరుడు, వైద్యేశ్వరుడు , నటరాజు -  ఇలా వేల పేర్లతో, పలు విధాలుగా అవిష్క్రుతమవుతున్న ఒకే శక్తి.  ప్రజల నిర్దిష్ట అవసరాలు నేరవేర్చటం కొసం, విభిన్న  ప్రయోజనాల కోసం  ప్రతిష్టాపనలు చేసారు.

ఇప్పుడు, ఇది యోగేశ్వరుడు. అంటే, ఈ సారి ఆయన్ని మనం ఒక పరిపూర్ణ యోగిగా ప్రతిష్టిస్తున్నాం. యోగి అంటే...ఆదియోగి, మిమల్ని  మీ వ్యాధుల నుంచి విముక్తి చేసేందుకు, ఇబ్బందుల నుంచి విముక్తి చేసేందుకు, నిరాశ్రత నుంచి విముక్తి చేసేందుకు, పేదరికం నుంచి విముక్తి చేసేందుకు -  అన్నిటికీ మించి జీవన్మరణాల ప్రక్రియ నుంచి కూడా మీకు విముక్తి కల్పించేందుకు, ఇక్కడ ఉంటారు. యోగేశ్వరుడు, ప్రధానంగా ముక్తి కల్పించేందుకే.  అందుచేతనే మనం ఆయనను యోగా కేంద్రానికి కొద్దిగా అవతల ఏర్పాటు చేస్తున్నాం. దాని వల్ల ఈశా ఫౌండేషన్ నియమ నిబంధనల్లో కాకుండా ఆయన చేయదలచుకున్నది చేసే వెసులుబాటు ఆయనకు ఉంటుంది..! ఆయన చేయదలచుకుంది ఆయన చేసేందుకు వీలుగా ఆయనకు స్వేచ్ఛ కల్పిస్తున్నాం. ఆయన ఎలా కావాలంటే అలా పని చేసుకోవచ్చు.

ఈ మహాశివరాత్రి నాడు 112 అడుగుల విగ్రహంతో పాటు సద్గురు ప్రత్యేకమైన ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. జీవితాన్ని మార్చివేయగల ఈ పరిణాత్మకమైన ప్రక్రియలో పాలుపంచుకోవడానికి సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

తారీఖులు: 20- 23 ఫిబ్రవరి, 2017

వేదిక : ఈశా యోగా కేంద్రం, వెల్లయాంగిరి పర్వత పాదాలు, కోయంబత్తూర్

ఆధ్యాత్మికావకాశాలలో మునిగి తేలవలసిన సమయం.

శివానుగ్రహ సాగరంలో మునిగి తేలవలసిన సమయం.

రండి! విముక్తికి మహద్వారం సృష్ఠించుకునే ప్రక్రియలో పాల్గొనండి!

మరిన్ని వివరాలకోసం: Local Center Details

Registration Assistance