నా చిరునవ్వు..


నా చిరునవ్వు..

మంచు గుట్టలు గుట్టలుగా కురుస్తుంటే
నీరు గడ్డకట్టుకుపోయింది,
జీవితం స్తంబించిపోయింది.
గదుల వెచ్చదనం, ఉన్నిదుప్పట్లూ లేని ఆరుబయట
ఎలా ఉందో చూద్దామని అలా వెళ్ళాను.
అంతా సవ్యంగానే ఉంది… కాకపోతే 
ప్రకృతి అభివ్యక్తి కాలానుగుణంగా ఉంది.  
శరీరం అంచుల నుండి ఒక్కసారిగా
చలి లోపలికి చొచ్చుకుపోడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు
నా ముఖం మీద చిరునవ్వు చిందింది 
ఎందుకంటే, ఇంతచలికీ గడ్డకట్టించడం
సాధ్యం కానిది నా చిరునవ్వొక్కటే.
దాన్ని నా పెదవులనుండి చెరపాలంటే 
చితిమీద దహించవలసిందే.  
సద్గురు స్వయంగా ఆంగ్లంలో రాసిన పద్యాన్ని చదవండి: Sadhguru Spotఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert