Sadhguruమీరు అందరితో పోటీ పడతారు; అందరినీ, ముఖ్యంగా మీ పొరుగువారిని, మించిపోవాలనే మీ పరుగు. అయితే ఆ పోటీవల్ల వచ్చే సమస్యల్ని ఎదుర్కొనేందుకు మాత్రం మీరు సుముఖంగా ఉండరు. మనిషిలో కారుణ్యం అన్నది లేకపోతే, ఇంకేమి మిగిలి ఉంటుంది? అప్పుడు మనిషికి జంతువుకి పెద్ద తేడా ఏమి ఉండదు. ప్రస్తుతం సమాజం ఈ పరిస్థితిలోనే ఉంది.

మీరు ఏదైనా చెయ్యవచ్చు; అయితే పర్యవసానం మాత్రం ఆనందంగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను గమనిస్తే, భీతిగొలిపే ఈ యథార్థాన్ని సులభంగా గ్రహించవచ్చు, అంతటా విపరీతమైన పోటీనే. పోటీ పడాలనుకునేవారు పోటీ పడవచ్చు; కాని మీకు పోటీ వద్దనుకుంటే మీరెందుకు పోటీ పడడం. కనీసం మీ వేగాన్ని తగ్గించుకోరెందుకు? మీరు అందరితో ఎందుకు పోటీ పడాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అందరినీ మించిపోవాలనీ, ముఖ్యంగా మీ పొరుగువాడిని అధిగమించాలని. అయితే మీరు ఆ పోటీతో వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా ఉండరు. మీరు జీవితంలో చేసే ప్రతి పనికీ ఒక పర్యవసానం ఉంటుందని అర్థం చేసుకోవాలి. మీరు అలాంటి పనే చెయ్యాలి, ఇలాంటి పని చెయ్యకూడదు అని ఎక్కడా లేదు. మీరు ఏదైనా చెయ్యవచ్చు; అయితే పర్యవసానం మాత్రం ఆనందంగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి.

మీరు పర్యవసానాన్ని సంతోషంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే ఏదైనా చెయ్యవచ్చు. పర్యవసానం అంగీకరించే శక్తి లేకపోతే, ఆ పనిని చేయవద్దు, అది అనవసరం.

ఏదో చేసేసిన తరువాత, దాని పర్యవసానం ఎదురైనప్పుడు బాధపడితే లాభం లేదు. జీవితంలో ఏదైనా చెయ్యవచ్చు, అయితే దాని పర్యవసానం ఎదురైనప్పుడు ఫిర్యాదులు చేయడం, రోదించడం తగదు. మీరు పర్యవసానాన్ని సంతోషంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే ఏదైనా చెయ్యవచ్చు. పర్యవసానం అంగీకరించే శక్తి లేకపోతే, ఆ పనిని చేయవద్దు, అది అనవసరం. ‘ఎవరో, ఏదో చేస్తున్నారు కదా!’ అని మీరు కూడా అదే చేయనక్కరలేదు. వారికి ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. అవునా? అంటే సమాజం పోటీమయంగా అవడమే కాదు, మీరూ ఆ పోటీలో చిక్కుకుపోతున్నారు. మీకు అవసరమైనంత వరకు పోటీ పడవచ్చు. మీకు పోటీ పడవలసిన అవసరమే లేకపోతే మా వద్దకు రండి... మీకు ధ్యానం నేర్పుతాం. మిమ్మల్ని ధ్యానమార్గంలో పెట్టడానికి కారణం మీరు ఏపనీ చెయ్యలేని వారని కాదు. మీరు ఈ పోటీల్లో పాల్గొనవలసిన అవసరాన్ని అధిగమించగలిగారు కాబట్టి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు