క్రిందటి వ్యాసంలో యయాతి రాజు ఆగమనం ఎలా జరిగిందో ఇంకా అసురుల నుండి సంజీవిని రహస్యాన్ని తెలుసుకోవడానికి దేవతలు కచుని వారి వద్దకు ఎలా పంపారో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడెం జరగబోతోందో  చూద్దాం..

సంజీవిని విద్యను నేర్చుకున్న కచుడు

Sadhguruశుక్రాచార్యుడు మంత్రం ఉపయోగిస్తున్నప్పుడు అతని కడుపులో గడబిడ వినిపించింది. అది కచుడే. శుక్రాచార్యుడు "ఇది ఎవరు చేసారు అసురులేనా, ఇది ఎలా చేయగలిగారు?" అంటూ ఉగ్రుడయ్యాడు.  కడుపులో నుంచి కచుడు జరిగినదంతా చెప్పాడు. అసురులు తనని చంపి, మాంసం ఎముకలు రుబ్బి సముద్రపు నీటిలో కలిపారని, అవయవాలను రుబ్బి మద్యంలో కలిపి అది శుక్రాచార్యుడికి తాగించిన విషయం అన్నీ చెప్పాడు. "ఇది చాలా దూరం పోయింది. ఇప్పుడు అతడిని  కడుపులోకి పంపారు, ఇప్పుడు నేను అతడిని చావనివ్వాలి, లేక అతనిని బతికిస్తే నేను మరణించాలి, నన్ను వీరు గౌరవించడంలేదు ఈ ఉద్యోగం చాలించి, దేవతలతో కలవాలి, ఈ బాలుడిని నా కడుపులోకి చేర్చారు" అంటూ కోపించాడు. "నాకు కచుడూ కావాలి, మీరూ కావాలి. ఏ ఒక్కరు లేకున్నా నేను చెరువులో దూకుతాను" అని దేవయాని మొండికేసింది.

శుక్రాచార్యుడు సంజీవిని ఉపయోగించగా, కచుడు పెరుగుతున్న చంద్రుడిలా పెద్దవాడవ్వుతూ శుక్రాచార్యుని కడుపుని చీల్చుకుని బయటకు వచ్చాడు. శుక్రాచార్యుడు మరణించాడు.

"నువ్వు నీ ధ్యేయాన్ని సాధించావు. సంజీవిని నేర్చుకోవాలని నీ కోరిక, అందుకు నువ్వు యోగ్యుడవు కూడా. నేను నీకు సంజీవిని నేర్పుతాను, తరువాత నిన్ను సజీవున్ని చేస్తాను. నువ్వు నా కడుపు చీల్చుకుని వెలుపలకి వచ్చి, తరువాత నువ్వు నన్ను బ్రతికించి, ఇంకెక్కడికన్నా వెళ్ళి కొత్త జీవితం ఆరభించు" అని శుక్రాచార్యుడు కచుడితో అన్నాడు. శుక్రాచార్యుడు సంజీవిని ఉపయోగించగా, కచుడు పెరుగుతున్న చంద్రుడిలా పెద్దవాడవ్వుతూ శుక్రాచార్యుని కడుపుని చీల్చుకుని బయటకు వచ్చాడు. శుక్రాచార్యుడు మరణించాడు. దాంతో, దేవయాని పెద్దగా ఏడ్చింది. కచుడు సంజీవిని మంత్రం ఉపయోగించి శుక్రాచార్యుని బ్రతికించి, అతనికి నమస్కరించి వెళ్ళబోయాడు. దేవయాని అతడిని అడ్డుకుని, "నువ్వు వెళ్ళలేవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని తెలిపింది.

ఇంకా ఉంది ...

మరిన్ని మహాభారత కథలు