"మీలో ఉన్న సృష్టి మూలాన్ని అభివ్యక్తం కానిస్తే, మీరుండగలిగేది ఆనందంగా మాత్రమే... !" 

ఈజిప్టులో ఓ ఇతిహాసం ఉంది. దాని  ప్రకారం ఎవరినైనా స్వర్గంలోకి అనుమతించాలంటే, స్వర్గ ద్వారం దగ్గర రెండు ప్రశ్నలు అడుగుతారు. మీరు ఈ రెండు ప్రశ్నలకి బిగ్గరగా "అవును" అంటే  తప్ప, మిమ్మల్ని లోపలికి  అనుమతించరు.

మొదటి ప్రశ్న: మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఆనందాన్ని అనుభూతి చెందారా?

రెండవ ప్రశ్న: మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి సంతోషం కలిగించారా?

ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం "అవును," అయితే,  మీరు  స్వర్గంలోనే ఉన్నారనంటున్నాను !

మీ కోసం..మీ చుట్టూ ఉన్నవాళ్ళ కోసం చేయగలిగే అద్భుతమైన విషయం, మీరు ఆనందంగా ఉండడమే. ముఖ్యంగా కోపం, ద్వేషం, అసహనం వంటివి విపరీతంగా బుసలు కొడుతున్న తరుణంలో, మనకున్న భీమా అల్లా ఆనందంగా ఉండే మనుషులే. కేవలం ఆహ్లాదకరంగా ఉండడంలోని విలువ తెలిసిన వారు మాత్రమే, తమ చుట్టూ ప్రసన్నతను సృష్టించడానికి పాటు పడగలరు.

"మీ పరిధి లోకి వచ్చిన వాటన్నిటిని ఆనందమయం చేయడం లోని సాఫల్యత మీకు కలగాలన్నదే నా  ఆకాంక్ష."
ప్రేమాశిస్సులతో,
సద్గురు