చంద్రవంశం ఎలా ఆరంభమైంది..? – మొదటి భాగం

moon

మహాభారత కథ చంద్రవంశీయులది. కౌరవ, పాండవులు చంద్రవంశీయులు. అయితే ఈ కథలో చంద్రవంశీయుల ఆరంభం ఎలా జరిగిందో తెలుసుకుందాం..

ఇప్పటివరకూ జరిగినది: దేవతల గురువు, ఇంద్రుని పురోహితుడూ అయిన బృహస్పతి వివాహేతర సంబంధాలలో మునిగి అతని భార్యని నిర్లక్ష్యం చేయగా, అతని భార్య తార చంద్రునితో ప్రేమలో పడ్డది. బృహస్పతి తారని తిరిగి రమ్మని వేడుకోగా తార అయిష్టంగా తిరిగి వచ్చింది. తార, చంద్రుని బిడ్డకి తల్లి కాబోతున్నదని తెలిసి బృహస్పతి ఉగ్రుడై శిశువుని నపుంసకుడవు కమ్మని శపించాడు. బుధ గ్రహాన్ని సూచించే బుధుడు జన్మించాడు. తరవాత ఎం జరిగిందో చదవండి..

Sadhguruశివ పార్వతులు నివసించే అడవికి ఒక రోజు సుధ్యుమ్న రాజు వేటకు వెళ్ళాడు. ఆ సమయంలో పార్వతి శివునితో “నాకు మీయందున్న ప్రేమ ఎంత గాఢంగా ఉన్నదంటే, ఈ అడవిలో మగ ఏనుగులు, జూలుతో ఉన్న సింహలు, అందమైన పింఛాలతో ఉన్న నెమళ్ళు ఉండడం మీకు అవమానకరమని నాకు అనిపిస్తున్నది. మీరు ఈ అడవిలో వేరే ఏ మగజీవీ లేకుండా చేయాలని నా కోరిక” అన్నది. శివుడు కూడా శృంగారంలో మునిగిపోయి “ఈ అడవిలోనివన్నీ ఆడవై పోవాలి” అని నిర్దేశించాడు. అడవిలోనివన్నీ వెంటనే ఆడ జంతువులుగా మారిపొయాయి, సింహం ఆడ సింహంగా, మగ ఏనుగులన్నీ ఆడ ఏనుగులుగా, మగ నెమళ్ళన్నీ ఆడ నెమళ్ళుగా మారిపోయాయి. ఆడవిలో ఉన్న సుద్యుమ్న రాజు కూడా స్త్రీగా మారిపోయాడు.

సూర్య వంశీయులు మంచి – చెడు అని స్పష్టమైన నిర్ధారణ ఉన్న వారు, యోధులు. చంద్రవంశీయులకు , ప్రతిదినం వారి స్వభావం మారుతూ ఉంటుంది.

సుద్యుమ్న రాజు తనను తాను చూసుకున్నాడు – ధైర్యవంతుడైన ఆ రాజు వేటకోసం అడవికి వచ్చి, ఒక్కసారిగా  స్త్రీగా మారిపోయాడు. “ఎవరు నన్నీవిధంగా మార్చారు? ఏ యక్షుడు, భూతం నాకీ శాపం ఇచ్చింది?’’ అని  శోకించాడు. బాధతో చుట్టూ వెదికాడు. శివ పార్వతులు శృంగారంలో ఉండటం చూసి శివుని కాళ్ళపై పడ్డాడు. “ఇది అన్యాయం, నేనొక రాజుని, పురుషుడిని, నాకు కుటుంబం ఉంది నేను కేవలం వేటకు మాత్రమే వచ్చాను, నన్ను మీరు ఈ విధంగా స్త్రీగా మార్చారు, నేను ఇలా తిరిగి ఎలా వెళ్ళను?” అని శోకించాడు. శివుడు ” నేను ఒకసారి చేసినది తిరిగి తీసుకోలేను కానీ కొంతవరకు సరి చేయగలను, చంద్రుడు క్షీణించేటప్పుడు నువ్వు స్త్రీగా, చంద్రుడు వృద్ధి  చెందుతున్నప్పుడు పురుషుడుగా ఉండగలవు” అన్నాడు.

 చంద్రవంశం ఆరంభం

సుద్యుమ్నుడు తిరిగి తన రాజ మందిరానికి వెళ్ళకుండా అడవిలోనే ‘ఈలా’ గా పిలువబడుతూ పదిహేనురోజులు స్త్రీగా మరో పదిహేను రోజులు పురుషుడిగా ఉండిపోయాడు. ఒకరోజు బుధుడు, ఈలా కలిసారు, వీరిద్దరూ సరైన జోడి. ఇద్దరిలో సమాన పాళ్ళలో ఆడ, మగ స్వభావలు ఉండటంతో వీరిద్దరూ కలసి ఎంతో మంది పిల్లలకి జన్మనిచ్చారు. ఈలా అని పిలువబడే ఈ పిల్లలు మొట్టమొదటి చంద్రవంశీయులయ్యారు.

ఈ దేశ సంప్రదాయంలో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అని సూర్యుని, చంద్రుని వారసులు రెండు వేరు వేరు రాజ వంశాలుగా పాలించారు. వీరిద్దరూ రెండు భిన్న తరహా మనుష్యులు. సూర్య వంశీయులు మంచి – చెడు అని స్పష్టమైన నిర్ధారణ ఉన్నవారు, యోధులు. చంద్రవంశీయులకు, ప్రతిదినం వారి స్వభావం మారుతూ ఉంటుంది. వారు చాలా భావావేశం కలవారు, కళాకారులు, నమ్మదగ్గవారు కాదు. సూర్యవంశీయులలో గొప్పవాడు మనువు, ఆ తరువాత ఇక్ష్వాకుడు, ఆ వంశంలోని వారే భగీరథుడు, దశరథుడు, రాముడు, హరిశ్చంద్రుడు. ఇక్కడ మనం చంద్రవంశీయుల గురించి మాట్లడదాము ఎందుకంటే కురువంశం వారు చంద్రవంశీయులు. వారి ఆవేశపూరిత ప్రవర్తనకు కారణం ఇప్పుడు మనకు తేటతెల్లమవుతుంది.

మరిన్ని మహాభారత కథలు
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *