బూడిద గుమ్మడికాయ, పెరుగు సలాడ్
కీరదోసకాయలు, టమోటాలు చిన్న ముక్కలుగా తరగాలి.
కావాల్సిన పదార్థాలు :
బూడిద గుమ్మడి తురుము - 150 గ్రా.
అల్లం తురుము - 20 గ్రా.
మామిడి కాయ తురుము - 20 గ్రా.
క్యారెట్ తురుము - 20 గ్రా.
కీరా దోసకాయ - 20 గ్రా.
పెరుగు - 1 కప్పు
బెంగుళూరు టమోటో - 1
కొబ్బరి కోరు - సగం చెక్క
ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత
నిమ్మరసం - కావలసినంత
కొత్తిమీర - కొద్దిగా
చేసే విధానం :
కీరదోసకాయలు, టమోటాలు చిన్న ముక్కలుగా తరగాలి. తరువాత తురిమినవన్ని వేసి, కొబ్బరి కోరు కలపాలి. ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి, నిమ్మరసం పిండి, పైన కొత్తిమీర చల్లుకుని అందరికి వడ్డించాలి.