Sadhguruఒకసారి మీరు ఆధ్యాత్మిక పథంలోకి వచ్చిన తరువాత, మీలో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతూ  ఉంటుంది. అదేవిటంటే,  నేను జీవితంలో ఎంతశాతం ఆధ్యాత్మిక ప్రక్రియలుకు కేటాయించాలి, ఎంతశాతం ప్రాపంచిక జీవనం గడపాలి అని. చాలామందికున్న సంఘర్షణ ఏంటంటే వాళ్ళు వాళ్ళ రోజు వారి పనుల్లో  నిమగ్నమై ఉండాల్సిన సమయంలో వాళ్ళు ఆధ్యాత్మిక  ప్రక్రియ చేయాలి అని కోరిక పడుతూ  ఉంటారు. మీరు వాళ్లను   ఏదయినా ఆధ్యాత్మిక ప్రక్రియ చేయమన్నారునుకోండి, వాళ్ళు ప్రాపంచిక విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఏది ఎంత చేయాలి..? లేకపోతే, “ నేను ఈ రెండు ఎలా చేయాలి..?” అంటే,  మీరు  మీ  ప్రాపంచిక విషయాల పట్ల  ఎలా ఉండాలంటే, నేను ప్రాపంచిక విషయాలు అన్నప్పుడు, ఇవి మీ శరీరానికి, మనసుకి  సంబంధించినవి, వాటిని సంతృప్తి పరిచేవి. ఇలా వీటిని విభజించడం సరికాదు గానీ,  అయినా అర్ధమవడం కోసం ఇలా అనుకుందాం. ఏదయితే మీ మనసుని, మీ శరీరాన్ని సంతృప్తి పరుస్తుందో అది  ఎంతవరకు చేయాలి? అది ఎలా చేయాలంటే, మీరు  ఎప్పటికి ఉండిపోతరనుకున్నట్టు చేయాలి. ఎప్పటికి ఉండిపోతాను  అనుకుంటారు.  నా సాధన ఎలా చేయాలి? ఈ రోజే నా ఆఖరి  రోజు అన్నట్టుగా  చేయాలి. అంతేనా? కాదు....

ఈ ప్రాపంచిక జీవితంలో మీరు దీన్ని ఎలా జీవించాలంటే “నేను ఈ రోజే మరణిస్తానేమో అన్నట్టుగా జీవించాలి”. మీ ఆధ్యాత్మిక ప్రక్రియ మీరు ఎలా చేయాలి అంటే “మీరు ఎల్లప్పటికీ ఉండిపోతారు అన్నట్టుగా చేయాలి”

ఒకరోజున ఒక వేటగాడు ఒక చిన్న పిట్టను పట్టుకున్నాడు. అది చాలా చిన్న పిట్ట. అతను దాన్ని చంపేయబోతుంటే, అపుడు ఆ చిన్న పిట్ట, “నీ జీవితంలో నువ్వు ఎన్నో పెద్ద జంతువుల్ని పట్టుకుని, తిని ఉంటావు. కానీ అది నీ ఆకలిని ఏమి సంతృప్తి పరచలేదు కదా.. నేను ఓ  ఒక చిన్న పిట్టని. నేను ఎంత  చిన్నగా ఉన్నాను. నేను నీ ఆకలిని ఎలా తీర్చగలను? నన్నెందుకు చంపుతున్నావు? నన్ను కనుక బతకనిస్తే, నేను నీకు వెల కట్టలేని మూడు విషయాలని చెప్తాను. దీనితో నీ జీవితం  ఎంతో అద్భుతంగా మారుతుంది. ఒకటి నేను నీ చేతిలో ఉండగానే చెప్తాను. రెండవ బోధన నేను నీ ఇంటి కప్పు మీద కూర్చున్నప్పుడు ఇస్తాను. మూడవది నేను ఆ చెట్టు, చిటారు కొమ్మకు వెళ్ళినప్పుడు చెప్తాను” అని చెప్పింది. అప్పుడు, ఆ చిన్న పిట్టని ఇలా చూసి ఆ వేటగాడు దాని గురించి ఆలోచించాడు “ఇది నాకు కనీసం నంచుకోవడానికి కూడా సరిపోదు.”  సరేలే అని దానిని  వదిలేసి, “నీ బోధన ఏవిటో చెప్పు”  అన్నాడు. ఈ పిట్ట మొదటి బోధన ఏవిటంటే “అది ఎవరైనా సరే, వాళ్ళు ఏమి ప్రగల్భాలు పలికినా సరే, ఎవర్నీ, ఎప్పుడూ నమ్మకు” అంది. సరే అతని చేతిలో నుంచి వెళ్లి ఎగిరి ఆ ఇంటి కప్పు మీద కూర్చుంది. “మూర్ఖుడా, నువ్వు నన్ను వదిలేసావు, నేనెవరో నీకు తెలుసా? నా పొట్టలో ఒక  వజ్రం ఉంది, ఇది ఐదు అవున్సులు ఉంటుంది” అని చెప్పింది.

అప్పుడు ఈ వేటగాడి మనసు బాధపడ్డం మొదలు పెట్టింది. “అయ్యో, ఇలా ఇంత పెద్ద వజ్రాన్ని నేను వదిలేసానా? నేను ఎంత మూర్ఖుడ్ని”   అనుకోవడం  మొదలుపెట్టాడు. అప్పుడు ఆ పిట్ట “నువ్వు నిజంగానే మూర్ఖుడివి. నేను నీకు ముందరే చెప్పాను, ఎప్పుడూ ఎవ్వర్నీ, ఎవ్వరు చెప్పింది  నువ్వు  నమ్మవద్దు, వాళ్లు ఎవ్వరైనా  సరే అని. చూడు నేను రెండు అవున్సులు మాత్రమే ఉన్నాను, నా పొట్టలో ఐదు అవున్సుల వజ్రం ఎలా ఉంటుంది? నువ్వు మూర్ఖుడివే. అందుకని, రెండో బోధన ఏవిటంటే ఎప్పుడూ గతాన్ని గురించి ఆలోచించి చింతించ వద్దు”. అక్కడ నుంచి వెళ్లి ఆ పిట్ట ఎగిరి చెట్టు చిటారు కొమ్మ మీద కూర్చుంది. ఆ మనిషి అరుస్తూ బాధపడ్డం మొదలుపెట్టాడు. “నేను వజ్రాన్ని కోల్పోయాను , ఇప్పుడు నువ్వు నన్ను బాధపడద్దు అని చెప్తున్నావు , నువ్వు నన్ను మోసం చేసావు”  అనడం  మొదలుపెట్టాడు. సరే!  కాసేపటికి కోలుకొని, సరే జరిగిపోయిన దాని గురించి బాధపడకూడదు అనుకొని, “సరే, మూడవ బోధన ఏమిటో చెప్పు” అన్నాడు. “ఎలాగయినా, నా మొదటి రెండు బోధనలని నువ్వేం పాటించలేదు, ఇంక మూడోది నీకు చెప్పి మాత్రం  ఏం ఉపయోగం ? ఎప్పుడూ  మన శక్తిని, మన సమయాన్ని ఎవరైతే వినరో వారికోసం వినియోగించకూడదు” అని చెప్పింది.

ఇప్పుడు నేనేం చెప్పినా సరే, అది మీకు పని చేయదు. ఈ ప్రాపంచిక జీవితంలో మీరు దీన్ని ఎలా జీవించాలంటే “నేను ఈరోజే మరణిస్తానేమో అన్నట్టుగా జీవించాలి”. మీ ఆధ్యాత్మిక ప్రక్రియని మీరు ఎలా చేయాలి అంటే “మీరు ఎల్లప్పటికీ ఉండిపోతారు అన్నట్టుగా చేయాలి”. అంతే కానీ మరో విధంగా కాదు.

మీ తర్కం మౌలికంగా ఉన్నప్పుడు ఇది (ఆధ్యాత్మిక ప్రక్రియ) ఇంకా కష్టంగా ఉండచ్చు. దీన్ని(తర్కాన్ని) ఇంకొంచెం మెరుగు పరచగలిగితే, ఇది మీ ఆధ్యాత్మిక ప్రక్రియకి ఒక మొదటి అడుగు కావచ్చు

“సరే, సద్గురు  మీరు ఏం చెబితే అదే” అని మీరంటే, అది నిజం కాదు. మీరు చెప్పేది నిజమే ఐతే, మీరు కనుక అలా మారిపోతే అప్పుడు ఇంక మీ జీవితంలో తర్కానికి ఏ విలువ ఉండదు. మీరు ఓ భక్తునిగా మారారు, అని అర్ధం. అప్పుడు దేని గురించి తర్కించక్కరలేదు. వీటన్నిటి గురించి మనమేమి పట్టించుకోవక్కరలేదు. మేము తొంభయ్  రోజుల  హోల్ నెస్  ప్రోగ్రాము చేసినప్పుడు, మేము ఈ జీవితంలో సాధ్యమయ్యే  ఎన్నో అంశాల గురించి శోధిస్తూ వచ్చాము. నేను ప్రతిసారి ఒక ప్రశ్న అడిగి అవునా, కాదా అనడిగే వాడ్ని. వాళ్ళు ఊహించలేని విషయాలు అక్కడ ఎన్నో జరిగాయి. వాళ్ళుల్లో కనీసం కొంతమంది వాళ్ళ తర్కన్ని పక్కన పెట్టారు. ఇంక వాళ్ళు “సద్గురు మేము అవును, కాదు అవును, కాదు అని ఇంక  చెప్పం. అవును, అవును అని  చెప్తాము” అన్నారు . ఒక రోజు నేను వచ్చేసరికి వాళ్ళు ఒక బోర్డు తయారు చేసి పెట్టారు. “సద్గురు, అవును – అవును” అని.  మీరు నా తర్కానికి పెద్ద విలువ లేదు అని తెలుసుకున్నారనుకోండి,  అప్పుడు మీరు ఏవీ  చేయక్కరలేదు. మీరు అవును అని కూడా అనక్కరలేదు. కానీ మీలో ఇంకా తర్కం పని చేస్తోందనుకోండి ఏం చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే, మీరు మీ తార్కితో, మీకది పని  చేస్తోందా, లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే, మీరు తర్కించి చూసుకోకపోతే మీ తర్కం ఏం మెరుగుపడదు. మీ తర్కం మౌలికంగా ఉన్నప్పుడు ఇది (ఆధ్యాత్మిక ప్రక్రియ) ఇంకా కష్టంగా ఉండచ్చు. దీన్ని(తర్కాన్ని) ఇంకొంచెం మెరుగు పరచగలిగితే, ఇది మీ ఆధ్యాత్మిక ప్రక్రియకి ఒక మొదటి అడుగు కావచ్చు. ఇది(తర్కం)  ఇంకా మౌలికమైన పరిస్థితిలోనే  ఉన్నప్పుడు, ఇది మిమ్మల్ని దీన్ని(ఆధ్యాత్మిక ప్రక్రియ) అనుభూతి చెందనివ్వదు. అందుకని మీరు మీ తర్కాన్ని ఇంకా వదిలేయలేదు. వదిలేశారా ? మీరు నామాటలు వినడం లేదు కదా...

మీరు మీ ప్రాపంచిక జీవితాన్ని నేను ఎప్పటికి జీవిస్తాను అన్నట్టు జీవిస్తే మీరేం చేస్తారు? మీరు ఓ 1673 జతల చెప్పులు కొంటారు. ఓ సారి నేను  అమెరికాలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు, నాకు బాత్రూం కి వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్లి ఓ తలుపు తీశాను. అదే బాత్రూం అనుకొని. తెరిచేసరికి అది ఒక పెద్ద గది. ఈ హాల్ లో ఓ పక్కన ఓ వంతు ఉంటుంది. దాన్నిండా చెప్పుల జతలే ఉన్నాయి. వందల జతలు. నేను ఆశ్చర్యపోయాను. “వీళ్ళు ఏదయినా చెప్పులు వ్యాపారం చేస్తున్నారా “ అనుకున్నాను. సరే, బయటకి వచ్చాను. ఆ ఇంటి ఇల్లాలు నాకు బాత్రూం చూపించింది. ఆ తరువాత నేను “ఆ చెప్పుల జతలన్నీ ఏవిటి?” అని అడిగాను. ఆవిడ ఇలా సిగ్గు పడింది. రెండు డజన్లు కాదు, వందల కొద్దీ చెప్పుల జతలు. “నేను పన్నెండు జన్మలకు సరిపడ చెప్పుల జతలు కొని అట్టేపెట్టుకున్నాను. ఒకవేళ నేను మళ్ళీ వచ్చే జీవితం లో వస్తే ఈ చెప్పుల జతల ఖరీదు చాలా ఎక్కువ ఉంటాయేమోనని కొని అట్టేపెట్టుకున్నాను” అన్నట్టు, మీ జీవితాన్ని ఇలా జీవించకూడదు. నేను ఎల్లప్పుడూ ఇక్కడే ఉండిపోతానుఅన్నట్టు ఉండకూడదు. మీరు మీ ప్రాపంచిక విషయాల పట్ల మీ జీవితాన్ని “ఇవాళే నా ఆఖరి రోజు అన్నట్టుగా ఉండాలి”. మీ ఆధ్యాత్మిక ప్రక్రియల పట్ల మీరు ఎప్పటికీ  జీవిస్తారు అన్నట్టుగా చేయాలి. మీరు వినండి, మీ తర్కాన్ని ఉపయోగించి అది నిజమో, కాదో  తెలుసుకోండి. మీరు అన్నిటికీ  “అవును” అన్నట్టుగా  పరిణామం చెందితే తప్ప!

ప్రేమాశిస్సులతో,
సద్గురు