గురు అనుగ్రహం ఎలాంటిదో, ఆ అనుగ్రహానికి పాత్రులు కావడం ఎంత ముఖ్యమో సద్గురు మాటల్లో మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం. గురు పాదుక స్తోత్రం ఎంతో శక్తివంతమైన మంత్రోచ్చారణ, ఇది గురుపాదుకల్ని అనంతమైన సంసారాన్ని దాటించే నావగా కొనియాడుతుంది. ఈ  మంత్రోచ్చారణ వల్ల మనం గురు అనుగ్రహానికి పాత్రులం కాగలుగుతాము. సౌండ్స్ ఆఫ్ ఈశా వారి గురు పాదుక స్తోత్రం విని, గురు అనుగ్రహాన్ని పొందుతారని మా కోరిక.. 

అనుగ్రహం మీ పైన లేకపోయినా లేక మీరు అనుగ్రహానికి పాత్రులు కాలేకపోయినా, మీ దగ్గర ఎంత డబ్బు, ధనం, ఇంకా వేరే ఎన్ని ఉన్నాసరే, మీరు ఓ అందమైన జీవితాన్ని జీవించలేరు. గురు అనుగ్రహం అనేది మీరు ఉహించుకునే అభూత కల్పన కాదు. గురు సాన్నిద్ధ్యం ఎంతో భౌతికమైంది. మీరు ఈ వీస్తున్న గాలిని ఎలా అనుభవించగలరో, ఈ సూర్య కిరణాలను ఎలా అనుభవించగలరో, ఇది కూడా అంత భౌతికమైన అనుభవమే. గురువు అనేది ఓ నిర్దిష్టమైన శక్తి, నిర్దిష్టమైన అవకాశం. ఇది ఓ వ్యక్తి మాత్రమే కాదు - ఓ వ్యక్తి అలాంటి శక్తికి, స్థానానికి ఓ దూతగా మారడం. మీరు ఏదైనా చూడాలనుకోండి, మీకు కావలసింది వెలుగు అంతే గాని బల్బ్ కాదు కదా. కాని ఇప్పుడు బల్బ్ ద్వారానే ఈ వెలుగు వస్తోంది. నెనీ బల్బ్ లేకుండా ఉండలేనని మీరు ఆలోచించడం మొదలుపెడుతున్నారు. ఓ స్థాయిలో ఇది కూడా నిజమే . కాని గురు తత్త్వమనేది కాలానికి, స్థానానికి పరిమితమైంది కాదు. ఇప్పుడు నేను ఈ లైట్ బల్బ్ పక్కన కూర్చుంటే నాకు చాలా ఎక్కువ కాంతి వస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండచ్చు . కాని ఒక గురువుకి పక్కన కూర్చున్న వ్యక్తి కంటే ఎన్నో వేల మైళ్ళు దూరంలో ఉన్నపటికీ మీరు ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.

గురు తత్త్వమనేది కాలానికి, స్థానానికి పరిమితమైంది కాదు. 

విజయం అనేది అనుగ్రహం లేకుండా రాదు. ఎలాగోలా మీరు ఈ  అనుగ్రహానికి పాత్రులవ్వడం నేర్చుకోవాలి. మీరు మీ మానసిక స్థితిని ఒక నిర్దిష్టమైన విధానంలో నిల్పుకుంటే మీరు దీనికి పాత్రులు కావచ్చు. మీ శరీరాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో తయ్యారుచేసుకుంటే కూడా, దీనికి పాత్రులు కావచ్చు. అలాగే మీరు మీ భావాల్ని ఒక నిర్దిష్టమైన విధానంలో మలచుకుంటే కూడా మీరు దీనికి పాత్రులు కావచ్చు. లేకపోతే మీరెంతో సంక్లిష్టమైన పద్ధతుల ద్వారా, ఈ శాస్త్రం పని చేసే తీరును తెలుసుకొని మీరు దీనికి పాత్రులు కావచ్చు. కాని అనుగ్రహం అన్నది లేకపోతే మాత్రం విజయం అనేది ఉండదు. మీరెంతో తెలివి గల వారై ఉండచ్చు కాని మీరో ఓటమిగానే మిగిలిపోతారు. మీరెంతో సామర్ధ్యం కలిగినవారై ఉండచ్చు, కాని మీరో ఓటమిగానే ఉంటారు. ఒక్క క్షణం, అనుగ్రహం మీకు దొరికినప్పుడు , వెంటనే అంతా మారిపోతుంది, అన్నిట్లోనూ మీరు విజయవంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా లేదా సంతోషంగా ఉండడం అనేది అది మీరు మీ లోపల నుండి చేస్తున్న పని. మీకు మీ శరీరం మీద, మనస్సు మీద కొంత నియంత్రణ ఉంటే ఈ పనులు మీరు తేలిగ్గా చెయ్యొచ్చు.

మీరొకసారి ఈ అనుగ్రహానికి పాత్రులైయ్యరంటే ప్రతీది ఎంతో సునాయాసంగా జరుగుతుంది. 

కాని మీరు విజయం సాధించాలంటే మాత్రం, ఇది అనుగ్రహం లేకుండా జరగదు. ఎందుకంటే, అనుగ్రహం అనేది యంత్రంలో వేసే చమురు లాంటిది ఇది లేకుండా యంత్రం ఎక్కువ కాలం పని చేయలేదు. ఇది లేకపోతే, ప్రతిదీ కొండ ఎక్కుతున్నంత కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనలో చాలా మంది మనకి మనమే అనుగ్రహానికి పాత్రులు కాకుండా ఉంటున్నాం, మనకు మనమే ఇది చేసుకుంటున్నాం. మనం అనుగ్రహానికి పాత్రులయ్యేలాగా మనల్ని సంసిద్ధం చేసుకోవడంలేదు. అలాంటి వారి జీవితంలో ప్రతీది శ్రమే. చదువుకోడం ఒక ప్రయాస, ఉపాధి కోసం పని చేయడం ఒక ప్రయాస, సరే వివాహం అనేది ఎంతో పెద్ద ప్రయాస. కాని మీరొకసారి ఈ అనుగ్రహానికి పాత్రులైయ్యరంటే ప్రతీది ఎంతో సునాయాసంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది మీ యంత్రాన్ని చమురుతో నింపేస్తుంది.

https://soundcloud.com/soundsofisha/guru-paduka-stotram-1-hr

ప్రేమాశీస్సులతో,
సద్గురు