ఇటివలే టీవీ 5 వారు సద్గురు తో జరిపిన ఇంటర్ వ్యూలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురించి అడిగిన ప్రశ్నకు సద్గురు ఏమంటున్నారో ఈ ఆర్టికల్ ల్లో మీ కోసం అందిస్తున్నాము.

ప్రశ్న : అయితే రానున్న కి అంతర్జాతీయ యోగా దినోత్సవానిమీరేం చేయబోతున్నారు? ఈ సందర్భంగా ఎం కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు ? ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది .. ఈ యోగ దినోత్సవం మిగితా వాటికంటే ఏ విధంగా భిన్నమైనది?

దీని విశిష్టత ఏమిటంటే ఇవేళ ప్రపంచానికి యోగా యొక్క అవసరముందన్న విషయం యునైటెడ్ నేషన్స్ గుర్తించింది..దీని వెనుక  మన ప్రధాని ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. ఐతే ఇది 70 ఏళ్ల క్రితమే పూర్వపు ప్రధాన మంత్రులు చేయవలసింది . దురదృష్ట్ట వశాత్తూ అలా జరగలేదు..ప్రస్తుత ప్రధాని దీని కోసం ఎంతో ప్రయత్నం చేసి సాధించారు. ప్రపంచమంతా దీని కోసమే వేచి చూస్తోందేమో అని అనిపిస్తోంది .. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ చరిత్రలోనే 174 దేశాలు ఒక తీర్మానాన్నిఇలా ఎన్నుకోవడం ఇదే

మొదటి సారి..మన ప్రధాని చేతులమీదుగా ఇది జరగడం విశేషం . కాకపోతే మనదేశంలో ఇది మతానికి సంబంధించినదన్న విమర్శ వినబడుతోంది ..మీరే చెప్పండి యోగ అనేది మతానికి సంబంధించినదైతే యునైటెడ్ నేషన్స్ దీన్నేందుకు ఆమోదిస్తుంది?  ఇదివరకెప్పుడైన రామా డే, జీసస్ డే, కృష్ణ డే అని ప్రకటించలేదే? యోగ అనేది మతాలన్నిటికన్నా ముందొచ్చింది. మతమనేది ఇంకా సృష్టించబడక ముందే యోగ ఉంది..ఇది అంతః శ్రేయస్సు సంబంధించిన సైన్స్ (విజ్ఞానం).

పిల్లలు కల్మషంలేని జీవనానికి ప్రతిరూపాలు .

అయితే ఈ సారి మా సంస్థ మన జనాభాలో అతి ముఖ్యమైన భాగమైన పిల్లలపై దృష్టి సారించింది..పెద్దవాళ్ళకి పిల్లల ప్రాముఖ్యతని వివరించడం ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం..తల్లిదండ్రులు, తీరని ఆశయాలనూ,కలల్ని తమ పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలనే ఆశతో వారికి జన్మనిస్తారు. కానీ పిల్లున్నది దానికోసం కాదు.గత సంవత్సర కాలంలో , 16 ఏళ్ల వయసు లోపున్న 1700 ల పైగా పిల్లలు ఆత్మహత్యకి పాల్పడ్డారని నాకు తెలిసింది . అంతే కాదు 18 ఏళ్ల వయసున్న 9000 లకు పైగా పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సాధారణంగా ఆత్మహత్య అనేది స్త్రీ స్వభావంలో ఉందని నేను విన్నాను. అంతే కాదు.. రైతలు కూడా వారి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. అది వారి విధి రాత అని అనుకుంటున్నాం.కానీ ఇప్పుడు మన పిల్లలీ పని చేస్తున్నారంటే మన సమాజంలో మౌలికంగా ఎదో తప్పు జరుతోందనే అర్ధం.  ఎందుకంటే పిల్లలు కల్మషంలేని జీవనానికి ప్రతిరూపాలు. అటువంటి జీవనం తనను తనే బలికోరుతోందంటే మనం తప్పు దిశలో వేళుతున్నట్లే అర్ధం. ఈ  విషయం నాకు తెలుస్తూనే  10,000 పాఠశాలల్లో సరళమైన ‘ఉప యోగ’ ని ప్రవేశపెడదామని నిర్ణయించుకున్నాం. మొదట్లో 10,000 ఎంతో పెద్ద సంఖ్య అనిపించింది. కానీ ఆ తరువాత 8 రాష్ట్రాల పర్యటన చేసి ఆయా ముఖ్యమంత్రులనీ, విద్యాశాఖా మంత్రులనీ కలిసి వారి ఉత్సాహం, స్పందన చూసిన తరవాత 30,000 పాఠశాలల్లోని పిల్లలకి ఈ యోగ ని పరిచయం చేసాం!

మన దేశంలో 10 నుండి 16 ఏళ్ల వయసు లోపున్న 180 లక్షల మంది పిల్లలు ‘ఉప-యోగ’ ని నేర్చుకుంటున్నారు . ఇది ఒక 20 నిమిషాల సాధన. సరే,  ‘ఉప-యోగ’ నే ఎందుకు నేర్పిస్తున్నామంటే - మనం ‘యోగా’ నేర్పిస్తున్నప్పుడు మన ప్రమేయం,ఎరుకా లేకుండానే వారి జీవితంలోకి ఓ ఆధ్యాత్మిక కోణాన్ని తీసుకోస్తాము. ఐతే ఇది ఇంత పెద్ద సమూహానికి చేస్తున్నాం కాబట్టి, దీన్నుండి అధ్యాత్మిక కోణాన్ని తీసేసి కేవలం శారీరిక ,మానసిక లాభాలు పొందేల అందిస్తున్నాము. దీని విశిష్టత ఏమిటంటే మేము పిల్లలకి ఈ శిక్షణని ఇవ్వకుండా మా 45,600 టీచర్లకు శిక్షణని ఇచ్చాం . వీరు 2 లేదా 3 స్కూల్ టీచర్లకు ఈ శిక్షణని ఇస్తారు. వారు వీడియో సహాయంతో పిల్లలకి యోగ ని నేర్పిస్తారు. ఇలా చేయడం వలన పిల్లలు తప్పు చేసే ఆస్కారం లేదు..అంతే కాదు..ఇది ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు.. పిల్లలు రోజూ 20 నిమిషాల పాటు స్కూల్లో చేస్తారు..ఇక ఈ ‘ఉప-యోగ’ వారి నిత్య జీవితంలో ఓ భాగమైపోతుంది.

ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఎవరి అవసరాలకూ తగినట్లుగా లేదు.

తలిదండ్రులని కూడా ఇందోలో భాగాస్వాములని చేద్దామనేది మా కోరిక. ఇప్పుడు మనం steroid విద్యా వ్యవస్థ( ‘స్టెరాయిడ్’ ) లో ఉన్నాం. కొద్దికాలంగా జరుగుతున్న ఈ  అధిక పోటీ తత్వంలో , పిల్లలు 98% సాధించాలని ఆశ పడుతున్నారు. 98 అంటే ఎంత కష్టతరమైన శాతం . ఇది కూడా చాలదన్నట్టు, చాలా సంస్థలలో 98 శాతం పైగా రావాలి . ఇది చాలా క్రూరమైన విషయం. మీరు ఒక మూసలో పిల్లలు అందరు ఒక ఆకారం లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వారి  సృజనాత్మకతను నాశనం చేస్తుంది. మనం మన విద్యా వ్యవస్థను సరి చూసుకోవాలి. ఈ విధానం బ్రిటీషు వారు, వారి  సేవకు విధేయులుగా, గుమాస్తాలుగా పనిచేయడానికి రూపొందించినది. ఎదో చిన్న సవరణలతో ఇంకా అదే వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది. పెద్ద మార్పేమీ లేదు. భారతదేశం వంటి దేశంలో, 1 బిలియన్ జనాభాలో 70 శాతం మందికి వయస్సు 35 సంవత్సరాలు కంటే తక్కువగా, అంటే దాదాపు అందరూ ఒక విద్యార్ధి. వీరందరినీ ఇలా ఒక మూసలో  పోయడం  ఖచ్చితంగా క్రూరమైన పని. ఇలా చేయడం  దేశ క్షేమము , అభివృద్ధి కూడా  అందించదు. మీరు వీరితో ఏమి చేస్తారు? వీరికి  ఒక గ్రాడ్యుయేషన్ ఉండవచ్చు కానీ ఏ నైపుణ్యం లేని  ఈ వ్యక్తులతో మీరు ఏమి చేయగలరు ఈ విద్యా విధానం వల్ల వీరికి చదువుకున్న వాళ్ళ వైఖరి మాత్రమే ఉంటుంది.

ఇది  ఆపాలంటే , పిల్లల అవసరాలు అనుగుణంగా ,  దేశ అవసరాలకు తగినట్లుగా విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలి. ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఎవరి అవసరాలకూ తగినట్లుగా లేదు. ఎదో  ప్రిస్క్రిప్షన్, ఎందుకు ఈ నరకం లాంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం  వెళ్తున్నారో ఎవరికీ తెలియదు . కాని, విద్యా వ్యవస్థ ఒక రోజులో మరే  విషయం కాదు.  కాని వారి జీవితాలలో కొద్దిగా యోగ తీసుకువస్తే,  ఖచ్చితంగా ఇది  మానవులలో మరింత సమతుల్యత తెస్తుంది. యోగాతో పిల్లల యొక్క ప్రాధమిక కెమిస్ట్రీని  మార్చవచ్చు. పిల్లలు తమ ప్రాణాన్ని తీసుకొనే ఈ తీవ్రమైన దశనుంచి మళ్ళించి వారిని మరింత ప్రశాంతంగా ఆనందంగా  సమతుల్యతతో ఉండేలా చేస్తుంది.