యోగా దినోత్సవం వస్తోంది. దానికి ముందు రెండు వారాలూ అనేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాబోతున్న పండుగ రోజులెలా ఉంటాయో ఒక ఉదాహరణ ఇది.

ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగాదినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజును ఒక అద్భుతమైన యోగా సమర్పణకు, దాన్ని ప్రపంచంలోని అన్ని వయస్సుల, అన్ని మతాల, అన్ని దేశాల, అన్ని సామాజిక నేపథ్యాల వారికి సంభావ్యం చేసేందుకు, వారు ధ్యానాన్ని  అనుభూతి చెందేందుకు, జీవితమంటే వారి అవగాహనను వ్యక్తిగతం నుండి సార్వజనీనతకు విస్తరించేందుకు సద్గురు భవిష్యత్ దృష్టిని ప్రసరిస్తున్నారు.

ఈ దార్శనికతను వాస్తవం చేయడానికి, యోగాదినోత్సవానికి ముందటి ఈ రెండు వారాల్లో ఎన్నో కార్యక్రమాలు మీముందుకు వస్తున్నాయి. రాబోతున్న పండుగ రోజులెలా ఉంటాయో మచ్చుకి చూడండి.

విద్యార్థులకోసం ఉప-యోగా

గత ఒకటి రెండు దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యలు సర్వసాధారణమై భయం గొల్పుతున్నాయి. 2014లో 1700 మందికి పైగా పధ్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ధోరణి ఇంకా పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. అయితే విద్యార్థులకు సక్రమమైన యోగాభ్యాసాలు నేర్పితే అది ఇటువంటి ధోరణిని మార్చడంలో  ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందటి వారాల్లో భారతదేశ వ్యాప్తంగా 25,000  పాఠశాలల్లో కోటీ యాభై లక్షల మంది విద్యార్థులకు ఉప-యోగా తరగతులు నిర్వహించేందుకు ఈశా ఫౌండేషన్ సన్నద్ధమవుతున్నది.  యోగా దినోత్సవం తర్వాత కూడా ఈ తరగతులు కొనసాగుతాయి. సంవత్సరం పొడుగునా జరుగుతాయి. ఇది విద్యా ప్రక్రియను  సంతోషంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి విద్యార్థులకు సాధనంగా ఉపయోగపడుతుంది.

ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టడానికి, ఆంతరంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే తేలికయిన ఈ 5-నిమిషాల అభ్యాసాలను బోధించడానికి 45,600 మంది టీచర్లు శిక్షణ పొందుతున్నారు. ఈ కార్యక్రమంలోని కొన్ని ప్రధానాంశాలు:

  • విద్యార్థుల ఆత్మహత్యలు ప్రమాదఘంటికలు మోగిస్తున్న రాజస్థాన్‌లోని కోటాలో కోచింగు సంస్థల్లో ఒక ప్రత్యేక ప్రయత్నం జరుగుతోంది. సంస్థ సిబ్బంది, ప్రభుత్వ సహకారంతో 1,50,000 మంది విద్యార్థులు ఉప-యోగా నేర్చుకుంటారు.
  • దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలలో కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు) కోసం ఈశా యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. 5000కు పైగా టీచర్లు శిక్షణ పొందుతారు.
  • మహారాష్ట్రలో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో వ్యాయామ విద్య బోధించే టీచర్లందరూ జూన్ 16న ఉప-యోగా ఉపాధ్యాయ శిక్షణ పొందుతారు. ఈ ఉపాధ్యాయులు మళ్లీ తాము 17చోట్ల 2000 మంది బోధన, బోధనేతర సిబ్బందికి శిక్షణ ఇస్తారు. వారు మళ్లీ 260 పాఠశాలలలో 57,000 మంది విద్యార్థులకు ఉప-యోగా బోధిస్తారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో 140 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఈశా శిక్షణ ఇచ్చింది. ఈ ఉపాధ్యాయులు 140,000 విద్యార్థులకు యోగా నేర్పుతున్నారు.
  • చెన్నైలో అన్ని కార్పొరేషన్ పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, అకాడమీలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో యోగా నేర్పడానికి 4,500 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు శిక్షణ నివ్వడం జరిగింది. జూన్ 30 నాటికల్లా ఈ తరగతుల వల్ల 3,00,000 మంది లాభపడతారని ఆశిస్తున్నాం.
  • ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాతుల్లో ఇటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి.

విద్యార్థులే ఉపాధ్యాయులౌతారు

విద్యార్థులు ఉప-యోగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ఉప-యోగా బోధించడం కూడా నేర్చుకుంటున్నారు. ఈశా విద్యా గ్రామీణ పాఠశాలల విద్యార్థులు 150 మంది నిర్వహించిన ఉప-యోగా తరగతులనుండి ఏప్రిల్, మే నెలల్లో ఈశా యోగా సెంటరును దర్శించిన 25,000 మంది సందర్శకులు లాభపడ్డారు. ఉప-యోగా  శిక్షణనిచ్చే శిక్షకులందరిలోని పిన్న వయస్కురాలు పదకొండేళ్ల ఖుషీ. చండీగఢ్ కు చెందిన ఖుషీ అక్కడ స్నేహాలయలో పిల్లలకు ఉప-యోగా తరగతులు నిర్వహిస్తున్నది. స్నేహాలయ ఇన్‌చార్జి
శ్రీ సతీశ్ వర్మ అక్కడ పిల్లల రోజువారీ కార్యక్రమంలో ఉప-యోగా అభ్యాసాలను తప్పనిసరి భాగం చేస్తామంటున్నారు.

ఉపయోగా అంటే ఏమిటి?

సద్గురు: ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో - యోగాభ్యాసం చేసేవాళ్లలో కూడా చాలామందికి ఉప-యోగా అన్నది ఒకటి చేయవచ్చునని తెలియదు.

ఇది మీకు శారీరక, మానసిక ప్రయోజనాలిస్తుంది. కాని ఆధ్యాత్మిక కోణాన్ని స్పృశించదు.

అసలు యోగా కేవలం వ్యాయామ రూపం కాదు. దీనికి అంతకంటే ఉదాత్తకోణం ఉంది. భౌతిక కోణాన్ని మించిన ఒక కోణాన్ని మీలో సజీవ వాస్తవం చేసే సాంకేతికత ఇది. మీ జీవితంలో ఒక ఉన్నత సంభావ్యతను కలిగించేది యోగా. ఒక మార్పు తీసికొని వచ్చే శక్తి కలిగింది ఏదైనా సరే దాన్ని మనం తప్పుగా ఉపయోగిస్తే నష్టాన్ని కలిగించే శక్తి కూడా దానికి ఉంటుంది. అందుకే చాలా నిబద్ధత కలిగిన వాతావరణంలోనే యోగాని ఉపయోగించాలి. అయితే ఉప-యోగాకి ఆ స్థాయి నిబద్ధత అవసరంలేదు. మీరు దాన్ని అపసవ్యంగా చేసినా అది సమస్యనేమీ కలిగించదు, అసలు మీరు దాన్ని తప్పుగా చేయనేలేరు - అది అంత తేలిక!

అన్ని ఉప-యోగా అభ్యాసాలు ఉచితంగా లభిస్తాయి. ఆన్‌లైన్‌లో isha.sadhguru.org/yogaday నుండి కాని, app - ద్వారా కాని నేర్చుకోవచ్చు. ఏడేళ్ల పైబడిన ప్రతివ్యక్తీ నేర్చుకోవచ్చు.

 

ఉప-యోగా లాభాలు

  • కండరాలకు వ్యాయామం ఇస్తుంది, కీళ్లకు కందెన ఇస్తుంది, శరీర వ్యవస్థను క్రియకు ప్రేరేపిస్తుంది.
  • నాడీ కణాల పునరుజ్జీవనాన్ని, జ్ఞాపకశక్తిని, చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది.
  • నిద్రావసరాలను తగ్గిస్తుంది, వెన్నెముకను చైతన్యవంతం చేస్తుంది.
  • ఆరోగ్యం, శక్తి కలిగిన భావం కల్పిస్తుంది, గాఢమైన ప్రశాంత భావనను కలిగిస్తుంది.

యోగాదినోత్సవం నాడు ఐరాసలో సద్గురు

ఐరాసలో భారత శాశ్వత రాయబార వర్గం న్యూయార్కులోని ఐరాస హెడ్ క్వార్టర్స్‌లో జూన్ 20, 21 తేదీలలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం ఇతివృత్తం ‘‘కొనసాగించదగిన అభివృద్ధి లక్ష్యాల (SDG - sustainable Development Goals) సాధన కోసం యోగా’’. ఈ కార్యక్రమంలో భాగంగా సద్గురు ఒక యోగా సెషన్ నిర్వహిస్తారు. ప్రముఖ వ్యక్తులు, ఆహూతులైన అతిథుల బృందంలోని ప్రధాన వక్తలలో ఒకరుగా ఆయన పాల్గొంటారు. ఎస్‌డిజిల సాధనలో యోగా ఒక సమీకృత పాత్రను ఎలా పోషిస్తుందో సద్గురు మాట్లాడతారు.

ఎస్‌డిజిలు 17 లక్ష్యాలు. పేదరికాన్ని పారదోలడానికీ, భూగోళాన్ని పరిరక్షించడానికి, అందరికీ సంపన్నతను కల్పించటానికి ఒక కొత్త ‘కొనసాగించదగిన అభివృద్ధి లక్ష్యాల’ ఎజెండాలో భాగంగా అన్ని దేశాలూ ఈ 17 లక్ష్యాలను స్వీకరించాయి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ పాత్ర నిర్వహించాలి: ప్రభుత్వాలు, ప్రైవేటురంగం, పౌర సమాజం, ప్రజలు. యోగా ఎలా తోడ్పడుతుంది? తెలుసుకోవడానికి సన్నద్ధంగా ఉండండి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లలో అంతర్జాతీయ యోగాదినోత్సవం

పిల్లలకు యోగా అభ్యాసాలు నేర్పడానికి ఇక్కడ 1100 మంది వ్యాయామ విద్యా టీచర్లుకు  శిక్షణ నిచ్చారు. దీని వల్ల 13 జిల్లాలలోని  12000 ప్రభుత్వపాఠశాలలో   ౩౦ లక్షలకు పైగా విద్యార్ధుల జీవితాల్లోకి యోగా ప్రవేశ పెట్టబడుతుంది.

హైదరాబాద్ లో ఉప యోగ జరిగుతున్న స్థానాలు:

చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, మెరిడియన్ పాఠశాల, DAV పాఠశాలలు - 1000 పైగా పిల్లలు మరియు 400 పాఠశాల ఉపాధ్యాయులు ఇప్పటి వరకు నిర్వహించబడ్డాయి.

సిల్వర్ ఓక్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), మంజీత రెసిడెన్సియల్ పాఠశాల, శ్రీ గాయత్రి టెక్నో స్కూల్ ఇంకా 30 పాఠశాలల్లో  సెషన్లు నిర్వహించబడతాయి .

కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు జాతీయ టై అప్ లో ఒక భాగంగా, హైదరాబాద్ లో అన్ని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు సిబ్బందికి మరియువ ఉపాధ్యాయులకు,

ఏకలవ్య ఫౌండేషన్, ధన్ ఫౌండేషన్, SOS చిల్డ్రన్స్ విలేజ్ మరియు అభయ ఫౌండేషన్ వంటి NGO లు,

సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ విభాగం, భారతదేశం ప్రభుత్వం: కవరింగ్ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు,

21 జూన్ న 300 పైగా పాల్గొనే జమ్మూ కాశ్మీర్ ఆర్మీ లైట్ ఇన్ఫంటరీ  సైన్యం సిబ్బంది,

ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐబిఎం, Delloite, CTS, జిఇ, బ్రిటిష్ కౌన్సిల్, సిఐఐ, డాక్టర్ మోహన్ డయాబెటిస్ సెంటర్, ఒరాకిల్, అసేన్దాస్, aon  వంటి మరిన్నిప్రైవేట్ సంస్థలు,

ఎలా లో మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, బేగంపేట్, హిమాయత్ నగర్, దిల్సుఖ నగర్ , తార్నాక ,  ఏయస్ రావు నగర్, సికింద్రాబాద్ లలో పబ్లిక్ సెషన్.ఈ సెషన్ లలో 7 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఎవరైనా పల్గోనవచ్చు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి లో ఉచిత కార్యశాలలు (workshops)

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

భారతదేశపు పొరుగుదేశాలు - నేపాల్, సింగపూర్, మలేసియా, లెబనాన్, దక్షిణకొరియా, చైనాలతో సహా ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా దేశాలు, యూరపు, ఆఫ్రికా, దక్షిణ అమెరికా - మొత్తం ఆరు ఖండాలలో, 80 దేశాలకు పైగా దేశాల్లో ఉప-యోగా సెషన్లు జరుగుతున్నాయి. అమెరికాసంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగా 50,000 చోట్ల సెషన్లు నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో శిక్షకుల్ని తయారుచేయడం జరుగుతున్నది.

ఆయుష్ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం

2016 అంతర్జాతీయ యోగాదినోత్సవం జరుపుకునే దిశలో వివిధ కార్యక్రమాల ఆచరణకు ప్రణాళికలు, వ్యూహాలను నిర్మించడంలో ఆయుష్ మంత్రిత్వశాఖ ఈశాతో భాగస్వామి అయింది.

హఠయోగా కార్యక్రమం

భారతదేశంలోని ఈశాయోగా సెంటర్లో 39 దేశాలనుండి పాల్గొంటున్న 2000 మందికి పైగా వ్యక్తులకు హఠ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం ఇంగ్లీషులో ఉంటుంది, అయితే ఒకేసారి ఆరుభాషల్లో - తమిళం, తెలుగు, హిందీ, చైనీస్, రష్యన్, ఫ్రెంచి - ప్రత్యక్ష అనువాదం ఉంటుంది. పాల్గొంటున్న వారు ఉప-యోగా, సూర్యక్రియ యోగాసనాలు నేర్చుకుంటారు.

మీరు కూడా!

అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి లో ఉచిత కార్యశాలల్లో (workshops) పొల్గొనడం కాని, నిర్వహించడం కాని చేయమని ఈశా ఫౌండేషన్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. ఆరోగ్యం, శాంతి, ఆనందం, ప్రేమ, సాఫల్యంతో పాటు మరెన్నో ప్రయోజనాలు సాధించడానికి ఉపయోగపడే ఉప-యోగా అభ్యాసాలకు మీకు ఈ 90 నిమిషాల కార్యశాలలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని ఉప-యోగా అభ్యాసాలు ఉచితం.  ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు లేదా మా app ద్వారా నేర్చుకోవచ్చు. 7 సంవత్సరాలు దాటిన వారెవరైనా ఈ అభ్యాసాలు చేయవచ్చు.