మనసు అనేది మన నిత్య జీవితంలో అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితానుభూతి ఎక్కువ శాతం మన మనసు మీదే ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి మనసుని గురించి సద్గురు ఏమంటున్నారో ఈ ఏడు సూత్రాల ద్వారా తెలుసుకుని మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా మలుచుకోండి.

  • మనసనేది పోగుచేసుకున్న గతం. మీరు మనసును అధిగమిస్తే, గతానికి మీపై ఎలాంటి పట్టూ ఉండదు.

1

 

  • మీరు సృష్టించే ప్రతి ఆలోచనా, శరీర వ్యవస్థలో ఓ విద్యుత్ ప్రచోదనాన్ని సృష్టిస్తుంది. అది శృతి మించినప్పుడు, శరీర సమతుల్యతను అస్తవ్యస్తం చేస్తుంది.

2

 

  • మనసు అనే పరికరం విశ్లేషణకే కాని, నిర్ణయాలు తీసుకోవడానికి కాదు.

3

 

  • సమస్య జీవితంతో కాదు. మీరు మనసుని మీ ఆధీనంలోకి తీసుకోక పోవడమే సమస్య.

4

 

  • మనసనేది సమాజపు చెత్తబుట్ట. దారిన పోయే ప్రతివారూ దానిలో ఏదో వేస్తూనే ఉంటారు.

5

 

  • మీ శరీరం, మనస్సులు గనక మీ నుంచి ఆదేశాలు తీసుకుంటే, ఆరోగ్యంగా ఉండటం, శాంతియుతంగా ఉండటం, ఆనందంగా ఉండటం అనేది ఓ సహజమైన పరిణామమవుతుంది.

6

 

  • మనసులో జరుగుతున్నదానిలో ఎక్కువ శాతం ఓ మానసిక అతిసారమే – ఎప్పుడూ అదుపు లేకుండా పరిగెడుతూ ఉంటుంది.

7