భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటీ అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. వీటిలోకొన్నిరూపాల వెనుక ఉన్న అంతరార్ధాన్నిసద్గురు మనకి వివరించారు.  ఆ రూపాలను గురించి మనం ఈ వారం ఈ సీరీస్ లో  తెలుసుకుందాం....వీటితో పాటు సౌండ్స్ ఆఫ్ ఈశా వారి త్రిగుణ్ సిడి నుంచి మీకు ఓ స్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం..విని ఆనందించగలరు..!!


నటరాజు - ఈయనది అపార నిశ్చలత్వం..!!

నటేశుడు లేక నటరాజు, శివుడి రూపాల్లో నాట్యానికి అధిపతిగా ఉన్న ఈ రూపం అతి ముఖ్యమైంది. స్విట్జర్లాండ్ లోని CERN లో,ప్రపంచంలోనే ఉత్తమమైన ఫిజిక్స్ లాబరేటరీ ఉంది.అక్కడ అణువుల విచ్ఛేదనం చేస్తారు. నేను CERN కి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రవేశ ద్వారం దగ్గర నటరాజు విగ్రహం పెట్టి ఉండటం చూశాను. అక్కడ వారు చేసే పనికీ , పరిశోధనకీ ,మానవ సంస్కృతిలో మరేది ఇంత దగ్గరిగా లేదన్న విషయం వారికి అర్ధం అయ్యింది.

నటరాజు రూపం అపార నిశ్చలత్వం నుండి  పుట్టినది.

నటరాజు రూపం అపార నిశ్చలత్వం నుండి  పుట్టినది.  ఈ  సృష్టంతా కూడా ఆవిర్భావ నాట్యానికీ, ఆడంబరత్వానికీ ప్రతీకగా ఉంటుంది. చిదంబర ఆలయంలోని నటరాజు విగ్రహం దీనికి ప్రతీక. చిదంబరం అని మీరు పిలిచేది ఈ పరిపూర్ణ నిశ్చలతత్వాన్నే! ఈ నిశ్చలతత్వాన్నే ఈ ఆలయంలో రూపంగా ప్రతిష్టించారు. సంప్రదాయ కళలు మనిషిలో ఈ నిశ్చలత్వాన్ని తీసుకురావటానికే ఇలా చేసారు . నిశ్చలత్వం  లేకుండా నిజమైన కళ ఆవిర్భవించదు ..!

చిదంబరేశ్వర స్తోత్రం

https://soundcloud.com/soundsofisha/chidambareshvara-stotram?in=soundsofisha/sets/trigun

ప్రేమాశీస్సులతో,
సద్గురు