రాసలీల – కృష్ణుడు గోపికలతో కలిసి చేసిన ఆనందభరిత నాట్యం. ఇది చరిత్రలో శాశ్వతంగా గుర్తుండేలా నిలిచిపోయింది. కాని అసలు దాని ప్రాముఖ్యత ఏంటి? మహాదేవుడైన శివుడు కూడా ఎందుకు ఆకర్షితుడయ్యాడు? ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు వేడుకలంటేనే అందులో సంపూర్ణమైన స్త్రీత్వం ఉంది. ఒక పురుషుడు వేడుక చేసుకున్నా లేక ఒక స్త్రీ వేడుక చేసుకున్నా అసలు వేడుక ముఖ్యంగా స్త్రీత్వానికి సంబంధితమైంది. స్త్రీ తత్వ ప్రాముఖ్యతను తెలియజేసే ఒక అందమైన కధ మహాభారతంలో ఉంది. ఎనిమిది సంవత్సరాల వయస్సులో కృష్ణుడు గోకులం నుంచి బృందావనానికి వెళ్ళాడు. అక్కడ గ్రామప్రజలకు కృష్ణుడు ఎంతో ప్రీతి పాతృడయ్యాడు. అది హోలీ పండుగ సమయం, వసంత ఋతువు అయిన తర్వాత అన్నీ వికసిస్తున్న కాలం అది. ఒక పౌర్ణమి రోజు సాయంత్రం ఊరిలోని ఆడపిల్లలు, మగ పిల్లలందరూ యమునా నది ఒడ్డున చేరారు. ఒకరి మీద ఒకరు నీళ్ళు, ఇసుక చల్లుకుంటూ ఆడుకోవటం మొదలు పెట్టారు. కొంచం సేపటికి ఆ ఆట కాస్తా నాట్యంగా మారింది. వాళ్ళు ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా ఉండటం వల్ల వాళ్ళు అలా నాట్యం చేస్తూనే ఉన్నారు. కాని మెల్లిగా అంత చురుకుగా లేని వాళ్ళు ఒక్కొక్కరిగా ఆగిపోటం మొదలు పెట్టారు. ఇది గమనించగానే కృష్ణుడు వేణుగానం చేయటం మొదలు పెట్టాడు. ఆయన వేణుగానం ఎంత సమ్మోహనంగా ఉందంటే ఆయన చుట్టూ దాదాపు రాత్రి చెరిసగ పడే దాకా,అందరూ చేరి మళ్ళీ నాట్యం చేయటం మొదలు పెట్టారు.

 యమునా నదీ తీరాన పౌర్ణమి రోజు అర్ధ రాత్రి ఈ మనోహరమైన నాట్యం జరుగుతుందని శివుడి చెవిన కూడా పడింది. ఆయన ధ్యానం ద్వారా సాధించింది, ప్రజలు నాట్యం చేస్తూ పొందుతున్నారనేది ఆయనకు తెలిసింది. 

ఇదే మొదటి రాసలీల. కేవలం సరదాగా నలుగురి చేరికతో మొదలై, చివరకు అన్నిటినీ అధిగమించే ఇంద్రీయాతీత స్థితికి చేరుకుంది. “రాస్” అనే పదానికి “రసం” అని అర్ధం, అది ప్రేమను, పారవశ్యాన్ని కూడా సూచించవచ్చు. కనుక ఇది పారవశ్య నాట్యం అయింది. ఈ నాట్య సువాసన అన్ని చోట్లకు చేరింది. పౌర్ణమిరోజు అర్ధరాత్రి ఈ రాసలీల జరుగుతుందని అందరికీ తెలిసింది. అక్కడికి వచ్చే వారి సంఖ్య పెరిగింది.

యమునా నదీ తీరాన పౌర్ణమి రోజు అర్ధ రాత్రి ఈ మనోహరమైన నాట్యం జరుగుతుందని శివుడి చెవిన కూడా పడింది. ఆయన ధ్యానం ద్వారా సాధించింది, ప్రజలు నాట్యం చేస్తూ పొందుతున్నారనేది ఆయనకు తెలిసింది. శివుడంటే నటరాజు, నాట్యానికే రాజు. ఇది భారతదేశ ప్రత్యేకత – భారతీయ దేవీ దేవతలు మాత్రమే నాట్యం చేస్తారు. వాళ్ళు ప్రేమలోపడ్డా నాట్యం చేస్తారు. ఆనందపారవశ్యంలో నాట్యం చేస్తారు. వాళ్ళకు కోపం వచ్చినా నాట్యం చేస్తారు. నాట్య దేవుడు కనుక శివుడు ఈ చిన్న పిల్లాడు, అందులోనూ తన భక్తుడు, వేణువు ఊదుతూ నాట్యం చేస్తూ జనాన్ని ఇలా అతీతమైన స్థితులకు చేర్చగలగటం ఆయనకు ముచ్చటేసింది. దానిని ఆయన స్వయంగా చూడాలని అనుకున్నాడు.

ఆయన హిమాలయాల నుంచి యమునా నది వరకు నడిచి వచ్చి అక్కడున్న పడవ నడిపే వ్యక్తితో, “నన్ను బృందావనానికి తీసుకెళ్ళు, నేను కృష్ణుడి రాసలీలా చూడాలి.” అని అన్నాడు. ఆ పడవ నడిపే వ్యక్తి “మీరు ఇలా వెళ్ళకూడదు. మీరు రాసలీలకు వెళితే అక్కడ కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా అందరూ స్త్రీలే. మీరు వెళ్ళాలని అనుకుంటే మీరు ఒక స్త్రీగానే వెళ్ళాలి” అని జవాబిచ్చాడు.

 స్త్రీ తత్వం అంటే ఉల్లాసం, ఉత్సాహం. మీ జీవితంలోని ప్రతి క్షణం మీరు ఇలానే ఉల్లాసంగా బ్రతకాలి. సగం బ్రతుకే బ్రతికితే ఏం లాభం? 

అసలు శివుడు పరమ పురుషునిగా భావించబడతాడు – పురుషులలో పురుషుడు. కనుక శివుడు స్త్రీగా మారటం అనేది ఒక వింతైన స్థితి.. కాని రాసలీల జోరందుకుంది, శివుడు అక్కడికి వెళ్ళదలచుకున్నాడు. కాని ఆ పడవనడిపే వ్యక్తి “మీరు వెళ్ళదలచుకుంటే మాత్రం మీరు ఆడవాళ్ళ బట్టలు వేసుకోవాల్సిందే” అన్నాడు.

శివుడు చుట్టూ చూసుకున్నాడు. ఎవరూ ఆయన్ని చూడటం లేదు కనుక ఆయన “సరే, నాకు గోపికల బట్టలు ఇవ్వు” అన్నాడు, ఆయన గోపికల బట్టలు వేసుకుని నది దాటాడు. మరి ఆయన అలాంటి సరదా మనిషి.

ఈ కధలోని ముఖ్యాంశం ఏమిటంటే వేడుక స్వభావమే స్త్రీ తత్వం. స్త్రీ తత్వం అంటే ఉల్లాసం, ఉత్సాహం. మీ జీవితంలోని ప్రతి క్షణం మీరు ఇలానే ఉల్లాసంగా బ్రతకాలి. సగం బ్రతుకే బ్రతికితే ఏం లాభం? మనం జీవితాన్నుంచి తప్పించుకోవటానికి ఇక్కడికి రాలేదు, మనం జీవితాన్ని అర్ధం చేసుకుని, అనుభూతి చెందటానికే వచ్చాము. మీరు పూర్తి తీవ్రతతో, ఉత్సాహంగా ఉంటేగాని మీరు జీవితాన్ని అనుభూతి చెందలేరు. మీ జీవితం మొత్తం, అసలు మీ అస్థిత్వమే ఒక పండుగ కావాలి. మీ జీవితమే ఒక పండుగ కావాలంటే మీలో మీరు పూర్తిగా ఆనందంగా ఉండాలి. ఇవి ఉత్తుత్తి మాటలు కాదు – ఇది నిజంగా సాధ్యమే. మీలో సరైన రసాయనికతను సృష్టించటానికి, మీ స్వభావికంగానే మీరు ఆనందంగా ఉండటానికి ఒక సంపూర్ణమైన శాస్త్రం ఉంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు