ఈశా యోగ సెంటర్‌లో ఈ సంవత్సరం నవరాత్రి పండుగను సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు, అంటే విజయదశమి వరకు జరుపుకుంటున్నాం. ఈ తొమ్మిది రాత్రులు దేవీ పండుగలా చేసుకుంటాము. ఇది భారత దేశమంతటా గొప్ప పండుగలా జరుపుకుంటారు. భక్తులు ఈ సమయంలో దేవి కృపకు పాత్రులవటానికి సద్గురు ఒక ప్రత్యేక సాధనను రూపొందించారు.


నవరాత్రి సాధన

లింగ భైరవి వద్ద జరిగే వేడుకలు ప్రకృతి అందించే మద్దత్తును అందరూ ఉపయోగించుకునేందుకు దోహదపడుతాయి. దేవి కృపను ఇంటి వద్ద నుంచే పొందాలనుకునే వారి కోసం సులభం, శక్తివంతం ఐన ఒక నవరాత్రి సాధనను అందరికి అందిస్తున్నాము. ఈ సాధనను సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతి రోజు ఈ విధంగా చేయాలి:

  • దేవి వద్ద ఒక దీపం వెలిగించాలి
  • “జై భైరవి దేవి” స్తుతిని కనీసం మూడు సార్లు దేవి ఫోటో, లింగ భైరవి గుడి, లింగ భైరవి యంత్రం లేక అవిఘ్న యంత్రం ముందు కానీ చేయాలి. ఇది 11 సార్లు చేస్తే ఇంకా లాభదాయకం (ఒక సారి స్తుతి చేయటం అంటే కింద చెప్పిన ౩౩ పేర్లు ఒకసారి వరుసగా చదవటం అన్నమాట)
  • సమర్పణ - ఏదైనా దేవికి సమర్పించటం. ఏది సమర్పించాలి అన్న దాంట్లో నియమం ఏమీ లేదు.

ఈ సాధన రోజులో ఏ సమయంలోనైనా, పగలైనా , రాత్రైనా  చేయవచ్చు. ఈ సాధనను అందరూ చేయవచ్చు. ఈ సాధనలో భోజన నియమాలు ఏమి లేవు, కానీ ఇలాంటి పండుగల సమయంలో సంప్రదాయంగా సాత్వికమైన ఆహరం తీసుకోవటం ఉపయోగకరం. మీ సంప్రదాయం ప్రకారం మీరు జరుపుకునే వేడుకలతో పాటుగా ఈ సాధన చేయవచ్చు.

 లింగ భైరవి స్తుతి

జై భైరవి దేవి గురుభ్యో నమః శ్రీ
జై భైరవి దేవి స్వయంభో నమః శ్రీ

జై భైరవి దేవి స్వధారిణి నమః శ్రీ
జై భైరవి దేవి మహా కళ్యాణి నమః శ్రీ

జై భైరవి దేవి మహా భద్రాణి నమః శ్రీ
జై భైరవి దేవి మహేశ్వరి నమః శ్రీ

జై భైరవి దేవి నాగేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి విశ్వేశ్వరి నమః శ్రీ

జై భైరవి దేవి సోమేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి దుఖః సంహారి నమః శ్రీ

జై భైరవి దేవి హిరణ్య గర్భిణి నమః శ్రీ
జై భైరవి దేవి అమృత వర్షిణి నమః శ్రీ

జై భైరవి దేవి భక్త రక్షిణి నమః శ్రీ
జై భైరవి దేవి సౌభాగ్య దాయిని నమః శ్రీ

జై భైరవి దేవి సర్వ జనని నమః శ్రీ
జై భైరవి దేవి గర్భ దాయిని నమః శ్రీ

జై భైరవి దేవి శూన్య వాసిని నమః శ్రీ
జై భైరవి దేవి మహా నందిని నమః శ్రీ

జై భైరవి దేవి వామేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి కర్మ పాలిని నమః శ్రీ

జై భైరవి దేవి యోనీశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి లింగ రూపిణి నమః శ్రీ

జై భైరవి దేవి శ్యామ సుందరి నమః శ్రీ
జై భైరవి దేవి త్రినేత్రిని నమః శ్రీ

జై భైరవి దేవి సర్వ మంగళి నమః శ్రీ
జై భైరవి దేవి మహా యోగిని నమః శ్రీ

జై భైరవి దేవి క్లేశ నాశిని నమః శ్రీ
జై భైరవి దేవి ఉగ్ర రూపిణి నమః శ్రీ

జై భైరవి దేవి దివ్య కామిని నమః శ్రీ
జై భైరవి దేవి కాల రూపిణి నమః శ్రీ

జై భైరవి దేవి త్రిశూల ధారిణి నమః శ్రీ
జై భైరవి దేవి యక్ష కామిని నమః శ్రీ

జై భైరవి దేవి ముక్తి దాయిని నమః శ్రీ

ఆమ్ మహా దేవి లింగ భైరవి నమః శ్రీ
ఆమ్ శ్రీ శాంభవి లింగ భైరవి నమః శ్రీ
ఆమ్ మహా శక్తి లింగ భైరవి నమః శ్రీ
నమః శ్రీ నమః శ్రీ దేవి నమః శ్రీ

ఇవి దేవి యొక్క ౩౩ పవిత్రమైన నామములు. భక్తితో జపిస్తే దేవి కృపను ఎవరైనా పొందగలరు.

ఎలా చదవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి: దేవి స్తుతి

మరిన్ని వివరాల కోస సంప్రదించండి:

info@lingabhairavi.org.