రుద్రాక్ష – మీరు తెలుసుకోవలసిన విషయాలు

rd

రుద్రాక్ష అనేది ఎలిఒకర్ గనిట్రాస్ అనే చెట్టు యొక్క విత్తనం . అది సాధకుడి జీవితం లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది . పంచముఖి మరియు ఏకముఖి తో పాటు వివిధ రుద్రాక్ష విత్తనాల యొక్క ప్రయోజనాలు సద్గురు ఇక్కడ విశ్లేషించారు.


Sadhguruరుద్రాక్ష అనేది ఒక రకమైన చెట్టు జాతి యొక్క విత్తనం. సహజంగా ఎత్తైన పర్వతాలలో ముఖ్యంగా హిమాలయాల ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలలో కొన్ని ఉన్నాయి. కానీ నాణ్యత కలవి ఎత్తైన హిమాలయ ప్రాంతంలోనే లభిస్తాయి ఎందుకంటే భూమి, వాతావరణం లాంటి వివిధ కారణాల ప్రభావం చేత. ఈ విత్తనాలకి ఒక విశిష్టమైన కదలిక ఉంటుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు. విత్తనం ఎంత చిన్నదైతే కదలిక అంత బాగా ఉంటుంది.

మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా ,ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటె చాలా మంచిది. 

మాలలు (లేక) దండలు

సహజంగా ఈ విత్తనాలు అన్ని కూర్చి ఒక దండలాగా చేస్తారు. సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూసలు కంటే ఒకటి ఎక్కువగా ఉండాలని భావిస్తారు. ఆ ఒకటి ఎక్కువ ఉన్న రుద్రాక్షయే బిందువు. ప్రతి రుద్రాక్ష మాలకి ఖచ్చితంగా బిందువు ఉండాలి లేని పక్షంలో ఆ శక్తి చక్రంలా తయారవుతుంది. దీని వలన సున్నితమైన మనుషులకి మానసిక స్తిరత్వం తగ్గే ఆస్కారం ఉంది. ఈ రుద్రాక్ష మాలను సిల్క్ దారం లేక ప్రత్తి దారంతో చేయడం ఉత్తమం. మీరు ఈ మాలను దారంతో ధరిస్తే ప్రతి 6 నెలలకి ఆ దారాన్ని మార్చే ప్రయత్నం చేయటం మంచిది. లేదంటే ఏదో ఒక రోజు ఆ మాల ఆకస్మికంగా తెగిపోయి 108పూసలు చిందరవందర అవుతాయి. మీరు రాగి, వెండి మరియు బంగారం ఉపయోగించినా మంచిదే కాని, ఎక్కువ సందర్భాలలో మీరు ఆ మాల తయారీకి స్వర్ణ కారుడి దగ్గరికి తీసుకువెళ్తారు. ఒకవేళ ఆ స్వర్ణకారుడు బంగారపు దారంతో గట్టిగా ముడి వేస్తె, ఆ రుద్రాక్ష యొక్క లోపలి బాగం పగులుతుంది.

వ్యక్తులని స్వర్ణకారులకి చెప్పమని నేను చెబుతున్నప్పటికీ, అది పూర్తి అయ్యి నా దగ్గరికి తీసుకువచ్చినప్పుడు 30 – 40 శాతం సమయాల్లో అవి పగిలే ఉండటం నేను చూస్తున్నాను. వదులుగా ఉండేటట్టు చూసుకోవటం చాలా ముఖ్యం. ఎక్కువ బిగుతుగా ఉండకూడదు, ఒత్తిడి వల్ల లోపల పగుళ్ళు ఏర్పడితే అస్సలు మంచిది కాదు. ఈ మాలను ఎల్లప్పుడ్డు ధరించే ఉండవచ్చు. మీరు స్నానం చేసేటప్పుడు కూడా ధరించవచ్చు మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా, ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటె చాలా మంచిది. మీరు వేడి నీటితో స్నానం చేస్తూ మరియు రసాయనాల సబ్బు వాడితే, కొన్ని రోజుల తరువాత ఆ మాల పెళుసుగా మారి పగులుతుంది. అటువంటి సమయాల్లో మాలను ధరించకుండా ఉంటె మంచిది.

ఉపయోగాలు

ఎవరైతే ఎప్పుడూ సంచరిస్తూ వివిధ ప్రాంతాల్లో తింటూ నిద్ర పోతారో, రుద్రాక్ష అనేది మంచి మద్దతు. ఎందుకంటే ఇది మీ శక్తిని ఒక చట్రం లాగా చేస్తుంది. మీరు గమనించే ఉంటారు కొత్త ప్రదేశాల్లో మీకు అంత త్వరగా నిద్ర పట్టదు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మీరు శారీరకంగా అలసిపోయినప్పటికీ నిద్ర రాదు. ఎందువలన అంటే మీరు ఉన్న పరిస్తితి మీ శక్తికి సహాయకారిగా లేకపోవటం చేత, మిమ్మల్నిఅంత తొందరగా స్తిమిత పడనివ్వదు. సాధువలు మరియు సన్యాసులని అక్కడి ప్రాంతాలు ఇంకా పరిస్థితులు ఇబ్బంది పెట్టవచ్చు, ఎందుకంటే వారు నిరంతరం సంచరిస్తూనే ఉంటారు. వారికి ఒక నియమం ఉంది ఏమిటంటే ఒకే స్థలంలో రెండు సార్లు తల కింద పెట్టకూడదు అని. ఈ రోజుల్లో మనుషులు మళ్లి వాళ్ళ వృత్తి, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో తింటూ నిద్ర పోతూ ఉన్నారు,కావున రుద్రాక్ష చాల ఉపయోగ కారి.

రుద్రాక్షని నీటికి కొంచం ఎత్తులో ఉంచితే ఆ నీరు మంచివి మరియు త్రాగదగినవి అయితే సవ్య దశలో తిరుగుతుంది.  

ఇంకొక విషయం ఏమిటంటే అడవుల్లో నివసించే సాధువులు సన్యాసులు ఏ కొలనులో పడితే ఆ కొలనులో నీరు త్రాగరు. ఎందుకంటే ప్రకృతిలోని వివిధ వాయువుల చేత ఆ నీరు విషపూరితంగా కలుషితం అవుతుంది. వారు ఆ నీరుని త్రాగాల్సి వస్తే, అస్వస్థతకు గురి కావచ్చు లేక మరణించవచ్చు. రుద్రాక్షని నీటికి కొంచం ఎత్తులో ఉంచితే ఆ నీరు మంచివి ఇంకా త్రాగదగినవి అయితే సవ్య(clockwise) దశలో తిరుగుతుంది. ఆ నీరు విషపూరితమైతే అపసవ్య(anti-clockwise) దిశలో తిరుగుతుంది. ఏదైనా సానుకూల ప్రాణ పదార్ధంపై ఉంచితే సవ్య దిశలో తిరుగుతుంది. ప్రతికూల ప్రాణ పదార్దంపై ఉంచితే అపసవ్య దిశలో తిరుగుతుంది.

ప్రతికూల శక్తులపై కవచం

ఇది ప్రతికూల శక్తులపై ఒక రకమైన కవచంలాగా ఉంటుంది. కొంతమంది ప్రతికూల శక్తులతో ఇతరులకి హాని చేసే అవకాశం ఉంది. ఇది ప్రతికూల శక్తులపై ఒక రకమైన కవచం లాగా ఉంటుంది. ఇది దానికదే ఒక శాస్త్రం. అథర్వణ వేదం అనే వేదం మొత్తం శక్తులని ఒకరి లాభానికి ఇంకొకరి నష్టానికి ఎలా వాడొచ్చో చెబుతుంది. ఎవరైతే దీనిపై పట్టు సాధించి ఉపయోగిస్తారో వారికి – విపరీతమైన బాధ మరియు మరణం కూడా సంభవించే అవకాశం ఉంది.

మీకై మీకే చాలా ముఖాలు,అన్ని ముఖాలు పెట్టుకుని మీరు ఏఖముఖిని ధరిస్తే సమస్యని అడిగి తెచ్చుకున్నటే. 

రుద్రాక్ష వీటన్నిటిపై ఒక రకమైన కవచం. మీరు అనుకోవచ్చు ఎవరూ నా పైన ప్రతికూల పనులు చెయ్యరు అని, మీరే లక్ష్యంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ ప్రక్కన ఉన్నవారి పైన ప్రయోగిస్తున్నారు అనుకుందాం. అది మీకు కూడా జరగవచ్చు. ఎందుకంటే మీరు ఆ వ్యక్తి ప్రక్కన ఉన్నారు. అది ఎలాంటిది అంటే వీధిలో ఇద్దరు గురిపెట్టి కాల్చుకుంటే, మిమ్మల్ని కాల్చే ఉద్దేశం లేనప్పటికీ మీకు తగలవచ్చు. అలానే ఇటువంటి విషయాలూ జరుగుతాయి. మీరు లక్ష్యం కానప్పటికీ మీరు ప్రతికూల సమయంలో ప్రతికూల ప్రదేశంలో ఉంటే అది మీకు కూడా జరగవచ్చు. ఇటువంటి విషయాలపై ఎక్కువ భయం ఉండాల్సిన అవసరం లేదు, కాని మాల అనేది ఇటువంటి వాటి నుండి ఒక రకమైన రక్షణ.

ఏకముఖి,పంచముఖి మరికొన్ని..

ఒక పూసకి 1 నుండి 21 ముఖాలు ఉండొచ్చు. అవి వివిధ రకాల ప్రయోజనాలకి ఉపయోగిస్తారు, ఊరికే దుకాణంలో కొని, శరీరం పైన ఉంచుకోవటం అంత మంచిది కాదు. సరయినది కాకపోతే జీవితాన్ని అస్తవ్యస్తం చేయవచ్చు. చాలా మంది ఎకముఖిని ధరించాలని అనుకుంటారు, ఒకే ముఖం ఎందుకంటే అది చాలా శక్తివంతం. మీకై మీకే చాలా ముఖాలు, అన్ని ముఖాలు పెట్టుకుని మీరు ఏఖముఖిని ధరిస్తే సమస్యని అడిగి తెచ్చుకున్నట్టే.

పంచముఖి సురక్షితం ఇంకా అందరికి మంచిది – పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరికి. జనం అంటూ ఉంటారు మీరు ఏకముఖిని ధరిస్తే 12 రోజుల్లో మీరు మీ కుటుంబాన్ని వదిలిపెడతారు అని. మీరు మీ కుటుంబాన్ని వదిలేస్తారా లేదా అన్నది సమస్య కాదు. అవి కేవలం మీ శక్తులని, మీమ్మల్ని ఏకాంతం కోరుకునేటట్టు చేస్తాయి. ఇది ఇతరులుతో అనుకూలంగా ఉండనివ్వదు. మీరు వేరే రకాల రుద్రాక్షలను ధరించాలి అనుకుంటే, ఊరికే కొనుక్కొని మీ వ్యవస్థ పై పెట్టుకోకుండా వాటి గురించి బాగా తెలిసిన వారి నుండి స్వీకరించటం మంచిది. పంచముఖి సురక్షితం. ఇది మీ సాధారణ శ్రేయస్సుకి ఆరోగ్యానికి, మీ స్వేచ్చకి ఎంతో మంచిది. ఇది మీ రక్తపోటును తగ్గిస్తుంది. మీ నరాలకు సాంత్వన చేకూర్చి ఒక రకమైన ప్రశాంతతను, చురుకుదన్నాని మీ నాడి వ్యవస్తకు కలిగిస్తాయి. 12 వయస్సు లోపు పిల్లలు 6 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. అది వారి ప్రశాంతతకు, శ్రద్ధకు ఉపయోగకారిగా ఉంటుంది. వీటన్నిటికి మించి వారు పెద్దల నుండి సరయిన శ్రద్ధను స్వీకరిస్తారు.

గౌరిశంకర్ మీ ఇడ, పింగాళలను సమతుల్యం చేసి క్రియాశీలం చేస్తాయి. 

గౌరీశంకర్ అనేది మీ ఇడ, పింగాళలను సమతుల్యం చేసే రకం. సహజంగా ఇది సౌభగ్యాన్ని కలిగిస్తుంది అని ప్రజలు నమ్ముతారు. సౌభాగ్యం అంటే కేవలం డబ్బే కానవసరం లేదు, అది ఎన్నో రకాలుగా రావొచ్చు. మీకు ఏది స్వంతం కానప్పటికీ మీ జీవితంలో సౌభాగ్యాన్ని పొందవచ్చు. మీరు సమతుల్యం లేక స్తిమితంగా ఉండే వ్యక్తి అయి ఉండి, మీ జీవితంలో సున్నితంగా పని చేస్తూ ఉంటే మీకు సౌభాగ్యం రావొచ్చు. మీ శక్తులు బాగా పని చేస్తుంటే అది జరుగుతుంది. గౌరిశంకర్ మీ ఇడ, పింగాళలను సమతుల్యం చేసి క్రియాశీలం చేస్తాయి.

వాస్తవమైన (లేక) నిజమైన మాలలు

సాంప్రదాయంగా రుద్రాక్షల వ్యవహారం చూసే వ్యక్తులు దానిని వారి జీవితంలో ఒక పవిత్ర విదిగా భావిస్తారు. తరతరాలుగా వారు ఇది ఒక్కటే చేస్తున్నారు. వాటి నుండి జీవనోపాధి పొందినప్పటికి. ప్రాధమికంగా వారికీ ఇతరులకు సమర్పణ చేసేటటువంటి ఒక పవిత్ర విధి. ఎప్పుడైతే గిరాకీ ఎక్కువగా ఉంటుందో ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతయి. ఇప్పుడు ఈ రోజుల్లో భద్రాక్ష అనే ఒక రకమైన విత్తనం వచ్చింది. ఇది విష పూరితం ఇది ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలలో పెరుగుతుంది. చూడటానికి ఈ రెండు విత్తనాలు ఒకే రకంగా ఉంటాయి, మీరు తేడా గమనిoచలేరు. మీరు సున్నితంగా ఉండి మీ చేతిలోకి తీసుకుంటేనే తేడా గమనించగలరు. దానిని శరీరం పైన ధరించకూడదు. కానీ చాలా ప్రదేశాలలో వీటిని నిజమైనవిగా అమ్ముతున్నారు. కావున మీరు నమ్మకమైన వారి నుండి మాలను స్వీకరించటం చాలా ముఖ్యం

ప్రేమాశీస్సులతో,
సద్గురు

ఈశా షాప్ ద్వారా కూడా మీరు ఖచ్చితమైన రుద్రాక్షలను కొనుగోలుచేసుకోవచ్చు : Isha Shoppe
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert